పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటఅక్టో. 15
“దేవుడు పరలోకంలో ఉంటాడు కాబట్టి, ఆయన గురించి తెలుసుకోవడం అసాధ్యమని కొందరు అనుకుంటారు. మీరలా ఎప్పుడైనా అనుకున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యోహాను 17:3 చదివండి.] ఈ పత్రిక, దేవుని జ్ఞానాన్ని మనమెలా సంపాదించుకోవచ్చో వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చాలామంది మనం సృష్టించబడ్డామని భావిస్తారు. మరికొందరు మనం పరిణామంవల్ల ఉనికిలోకి వచ్చామని భావిస్తారు. ఈ విషయంపై మీ అభిప్రాయమేమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] సరైన ముగింపుకు రావడానికి సహాయం చేసే ఈ సలహాను గమనించండి. [యోబు 12:7, 8 చదవండి.] ఈ ప్రత్యేక తేజరిల్లు! సంచిక సృష్టిలో కనిపించే జ్ఞానంనుండి, రూపకల్పన నుండి మనమేమి నేర్చుకోవచ్చో చర్చిస్తుంది.”
కావలికోటనవం. 1
“పిల్లల ఆలనాపాలనా విషయంలో నేడు అనేక పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలున్నాయి. తల్లిదండ్రులకు సరైన సలహా దొరికే అవకాశం ఉందంటారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత కీర్తన 32:8 చదవండి.] ఈ పత్రిక పిల్లల్ని పెంచే విషయంలో బైబిల్లోని ఆచరణాత్మక ఉపదేశాన్ని అందజేస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చాలామంది సృష్టికర్త ఉన్నాడని నమ్ముతారు. ఈ నమ్మకాన్ని మనమెలా సమర్థించవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత హెబ్రీయులు 3:3 చదివి, 26వ పేజీలోని ఆర్టికల్‌ను చూపించండి.] మనం దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నాం అనే దానికున్న కారణాలను ఇతరులకు ఎలా వివరించవచ్చో ఈ ఆర్టికల్ సలహాలను ఇస్తుంది.”