పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోటఆగ. 15
“యేసు చెప్పిన ఒక విషయంపై మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాం. [మత్తయి 5:5 చదవండి.] ఈ వాగ్దానం నెరవేరినప్పుడు, పరిస్థితులు ఇప్పుడున్నట్లు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] యేసు భూమిని ఏ విధంగా మారుస్తాడో ఈ పత్రిక బైబిలు నుండి తెలియజేస్తుంది. భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారనే విషయాన్ని కూడా ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ఉగ్రవాదం కొత్త విషయమేమీ కాదు, కానీ అది నేడు దాదాపు ప్రతీఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచెందింది. అది ఎందుకలా తయారైందని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ తేజరిల్లు! సంచిక ఉగ్రవాదం ఎప్పుడు అంతమవుతుంది, భూమిపై నిజమైన శాంతిని దేవుడెలా తీసుకువస్తాడు వంటి ప్రశ్నలకు బైబిలు నుండి జవాబిస్తుంది.” మీకా 4:4 చదవండి.
కావలికోటసెప్టెం. 1
“చాలామందికి మతం విషయంలో ఆసక్తి లేదు. మతాసక్తి కలిగివుండడంవల్ల ఒకరు మంచి వ్యక్తిగా తయారవడానికి సహాయం చేస్తుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ అంత్యదినాల్లో కొంతమంది మతం నుండి ఏమి ఆశిస్తున్నారు అనే విషయం గురించి బైబిలు ముందుగా ఏమి చెప్పిందో గమనించండి. [2 తిమోతి 4:3, 4 చదవండి.] ఈ పత్రిక, సత్యారాధన దేవుణ్ణి ఎలా ఘనపరుస్తుంది, మనకెలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది అనే విషయాన్ని వివరిస్తుంది.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ప్రపంచ జనాభాలో దాదాపు మూడు శాతంమంది ఏదో ఒక రకమైన బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. కుటుంబాలు అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవచ్చు? [ప్రతిస్పందించనివ్వండి. 17వ పేజీలోని శీర్షికను చూపించండి.] ఈ శీర్షిక, కొన్ని కుటుంబాలు అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాయి, ఇతరులు వారికి సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు అనే విషయాలను వివరిస్తుంది.” యెషయా 35:5, 6 చదవండి.