కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/06 పేజీ 1
  • బ్రాంచి ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బ్రాంచి ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఇలాంటి మరితర సమాచారం
  • బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
    మన రాజ్య పరిచర్య—1995
  • ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్‌ కాగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
  • “దేవుని మందిరము”ను మెప్పుతో చూచుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2006
km 9/06 పేజీ 1

బ్రాంచి ఉత్తరం

ప్రియమైన రాజ్య ప్రచారకులకు:

గత కొన్ని సంవత్సరాలుగా చేయబడిన సంస్థాగత మార్పులకు మీరందరు ఇచ్చిన మద్దతుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.

ప్రాంతీయ సమావేశాల్లో స్థానిక భాష మాట్లాడే జిల్లా పైవిచారణకర్త సేవ చేయడానికి వీలుగా సెప్టెంబరు 1, 2006 నుండి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లా నం. 1, ఇంగ్లీషు సర్క్యూట్‌కు, జిల్లా నం. 2, హిందీ, ఉత్తర భారతీయ భాషలకు, జిల్లా నం. 3, కన్నడ, తమిళం, తెలుగు ప్రచారకులకు, జిల్లా నం. 4, అన్ని మలయాళం సర్క్యూట్‌లకు సంబంధించినవై ఉంటాయి.

పెద్ద నగరాల్లోని విభిన్న భాషా గుంపులకు మరింత ప్రత్యేక శ్రద్ధను ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయబడుతోంది. అంటే ఒకే క్షేత్రంలో ఒకటికన్నా ఎక్కువ సంఘాలు పనిచేస్తూ, ప్రతీ సంఘం ప్రత్యేకంగా తమ సంఘానికి చెందిన భాష మాట్లాడేవారిపై దృష్టి కేంద్రీకరిస్తుంది.

మనలో ప్రతీ ఒక్కరు యెహోవా చిత్తాన్ని చేయడంలో మరింత సంస్థీకరించబడిన విధంగా, మన సంఘంలో మాట్లాడే భాష కాకుండా వేరే భాష మాట్లాడేవారు ఆసక్తి కనబరిస్తే ఏమి చేయాలనే విషయంలో ఇవ్వబడిన నిర్దేశాన్ని అనుసరించడంలో మనవంతు పాత్రను నిర్వర్తించాలి.​—కీర్త. 40:8.

వివిధ భాషలకు చెందిన క్రొత్తవారు మనతో సహవసించడం ఆరంభిస్తుండగా మరిన్ని సమావేశ స్థలాలు అవసరమవుతాయి. దేశవ్యాప్తంగా వివిధ రాజ్యమందిర ప్రణాళికలకు ఇవ్వబడిన చక్కని భౌతిక, వస్తుదాయక మద్దతును చూడడం అద్భుతమైన విషయం. ఆర్థిక పరిస్థితి మారకపోయినా, స్థానిక ప్రచారకులు మరింతగా హెచ్చుగా ఇస్తున్న విరాళాల కారణంగా మరిన్ని రాజ్య మందిరాలు నిర్మించబడుతున్నాయి. స్థలానికి, నిర్మాణానికి అయ్యే భారీ ఖర్చుల విషయంలో సంఘాలు తమ బరువుబాధ్యతలను నిర్వర్తిస్తుండగా, నిర్మాణ కార్యక్రమంపై యెహోవా ఆశీర్వాదం ఎడతెగక ఉంటుందని మనం నమ్మవచ్చు.​—గల. 6:5; కీర్త. 127:1.

మీ సహోదరులు,

ఇండియా బ్రాంచి కార్యాలయం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి