కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/06 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2006
  • ఉపశీర్షికలు
  • ఆగస్టు 14తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 21తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 28తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 4తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2006
km 8/06 పేజీ 2

సేవా కూటాల పట్టిక

ఆగస్టు 14తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

15 నిమి:స్థానిక ప్రకటనలు. “క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం” గురించి చర్చించండి. ప్రత్యేక సమావేశదినపు తేదీ తెలిస్తే దానిని తెలియజేయండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ, ఆగస్టు 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో, “యెహోవాసాక్షులంటే నాకిష్టం లేదండి” అని చెప్పి సంభాషణను ఆటంకపర్చే వ్యక్తితో ఎలా మాట్లాడాలో చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 9వ పేజీని చూడండి.

15 నిమి:“అక్టోబరులో మనమందించే తేజరిల్లు! ప్రత్యేక సంచిక.”a4వ పేరాను చర్చిస్తున్నప్పుడు, యౌవనస్థుడు(రాలు) టీచర్‌కు అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు! సంచికను అందించడాన్ని క్లుప్తంగా ప్రదర్శించండి.

15 నిమి:నేను ఎందుకు చదవాలి? తేజరిల్లు! జూలై-సెప్టెంబరు 2006లోని 21-23 పేజీల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. బైబిలు ప్రచురణలను చదివి వాటిలో ఉన్న బైబిలు సూత్రాలను ప్రత్యేకంగా స్కూల్లో అన్వయించుకునేందుకు తమ తల్లిదండ్రులు తమకు ఎలా శిక్షణ ఇచ్చారో చెప్పమని, ప్రేక్షకుల్లోవున్న క్రైస్తవ కుటుంబాల్లో పెరిగినవారిని వ్యాఖ్యానించమని ఆహ్వానించండి. ఒకటి రెండు వ్యాఖ్యానాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవచ్చు.

పాట 19 (164) ముగింపు ప్రార్థన.

ఆగస్టు 21తో ప్రారంభమయ్యే వారం

పాట 22 (130)

10 నిమి:స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసుకోబడిన ప్రకటనలు. “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం” గురించి చర్చించండి. ప్రాంతీయ సమావేశపు తేదీ తెలిస్తే దానిని తెలియజేయండి.

15 నిమి:కావలికోట అధ్యయనం నుండి, బహిరంగ కూటం నుండి ప్రయోజనం పొందడం. యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం అనే పుస్తకంలోని 59వ పేజీ నుండి 64వ పేజీలోని ఉపశీర్షిక వరకు ఉన్న పేరాల ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ.

20 నిమి:సహాయ పయినీరు సేవ చేయడానికి ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి! ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. క్రొత్త సేవా సంవత్సరంలో కనీసం ఒక్క నెలైనా సహాయ పయినీరు సేవ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోమని ప్రోత్సహించండి. (1 కొరిం. 9:26) కొంతమంది ప్రత్యేక కార్యకలాపాలు ఏర్పాటు చేయబడిన నెలను లేదా సెలవు ఉండే నెలను లేదా ఎక్కువ వారాంతాలు ఉన్న నెలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రేక్షకులను ఇలా అడగండి: “గతంలో సహాయ పయినీరు సేవ చేయడానికి మీరు ఎలాంటి సవాళ్ళను అధిగమించారు? సహాయ పయినీరు సేవ చేయడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు లభించాయి? మీకు సహాయ పయినీరు సేవచేయాలనే కోరిక ఉన్నా కానీ చేయలేరని మీకు అనిపిస్తే, ఆ విషయం గురించి ఎందుకు ప్రార్థించకూడదు? (అపొ. 4:29; 2 కొరిం. 4:7; యాకో. 1:5) మీ కుటుంబ సభ్యులతో, ఇతరులతో, ప్రత్యేకంగా మీలాంటి పరిస్థితుల్లోనే ఉన్న సంఘంలోని వారితో ఆ విషయాన్ని గురించి చర్చించడం కూడా ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది? (సామె. 15:22) మీరు సహాయ పయినీరు సేవ ఎప్పుడు చేయాలనుకుంటున్నారు?”

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 28తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

10 నిమి:స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. ఆగస్టు నెల క్షేత్ర సేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తు చేయండి. 4వ పేజీలోని సూచనలను లేక మీ క్షేత్రానికి అనువైన వేరే సూచనలను ఉపయోగిస్తూ ఒక ప్రదర్శనలో పత్రికా మార్గంలో ఉన్న వ్యక్తిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు సెప్టెంబరు 1 కావలికోట, జూలై-సెప్టెంబరు తేజరిల్లు! పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.

15 నిమి:మీరు ప్రోత్సహించేవారిగా ఉండవచ్చు. (రోమా. 1:11, 12) ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. సంఘంలో ఎంతమంది క్రమ పయినీర్లు ఉన్నారో చెప్పండి. వారిని ప్రోత్సహించే మార్గాల గురించి అంటే, వారిని మెచ్చుకోవడం, పయినీరు సేవవల్ల వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడడం, వారితో కలిసి సేవకు వెళ్ళడం, వారిని భోజనానికి ఆహ్వానించడం, ప్రయాణ ఖర్చుల విషయంలో సహాయం చేయడం వంటి కొన్ని మార్గాలను వివరించండి. ఇతరులు తమను ఎలా ప్రోత్సహించారో చెప్పమని క్రమ పయినీర్లను ఆహ్వానించండి. సంఘంలో క్రమపయినీర్లు లేకపోతే, సహాయ పయినీర్లను ఎలా ప్రోత్సహించవచ్చో చర్చించండి.

20 నిమి:సెప్టెంబరులో మీరు బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించగలరా? ప్రసంగం, ప్రదర్శనలు. సెప్టెంబరులో బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించి మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి మనం ప్రత్యేక కృషి చేస్తాం. అంటే మనం పుస్తకాన్ని అందించినప్పుడు, గృహస్థుడితో కొన్ని పేరాలను చర్చించడానికి మనం ప్రయత్నిస్తాం. స్థానిక క్షేత్రానికి సరిపోయే అంశాలను ఎంచుకొని రెండు ప్రదర్శనలను చూపించండి. ప్రతీ ప్రదర్శనలో, పునర్దర్శనం చేసేందుకు, చర్చను కొనసాగించేందుకు ఎలా ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకోవాలో చూపించండి.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 4తో ప్రారంభమయ్యే వారం

పాట 21 (191)

10 నిమి:స్థానిక ప్రకటనలు.

15 నిమి:స్థానిక అవసరాలు.

20 నిమి:“నిష్పక్షపాతంగా ప్రకటించడం ద్వారా​—⁠వ్యక్తిగత ఆసక్తిని చూపించండి”b 2వ పేరా చివర్లో ఉల్లేఖించబడిన రోమీయులు 1:14ను చర్చిస్తున్నప్పుడు, అంతర్దృష్టి, (ఆంగ్లం) 1వ సంపుటి, 225వ పేజీలోని “బార్బేరియన్‌” అనే అంశం క్రిందవున్న మొదటి పేరాపై క్లుప్తంగా వ్యాఖ్యానించండి. 3వ పేరాను చర్చించిన తర్వాత, అన్ని దేశాల ప్రజలకు సువార్త పుస్తకంలోని 2వ పేజీలో ఉన్న మూడు పద్ధతులను సమీక్షించి స్థానిక క్షేత్రంలో, వేరే భాష మాట్లాడే ప్రజలను కలుసుకున్నప్పుడు ఆ పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలో ప్రదర్శించండి.

పాట 28 (224), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి