సేవా కూటాల పట్టిక
డిసెంబరు 12తో ప్రారంభమయ్యే వారం
పాట 3 (32)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. డిసెంబరు 15 కావలికోటను, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ప్రతీ ప్రదర్శన తర్వాత ప్రతిపాదనలో సులభంగా ఒక లేఖనాన్ని ఎలా చేర్చవచ్చు అనే విషయం మీద వ్యాఖ్యానించండి.
15 నిమి: “మనం నేర్చుకున్నవి ఆన్వయించుకునేందుకు సహాయం చేసే పాఠశాల.” పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. మన రాజ్య పరిచర్య, అక్టోబరు 2005 సంచికలోని మధ్య పేజీల్లో ఉన్న వ్యాఖ్యానాలను చేర్చండి.
20 నిమి: “జీవానికి నడిపించే విద్య.”a దైవిక విద్య నుండి తామెలా ప్రయోజనం పొందారో వ్యాఖ్యానించడానికి ముందుగా ఒకరిద్దరిని ఏర్పాటు చేసుకోండి.
పాట 28 (224), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 19తో ప్రారంభమయ్యే వారం
పాట 16 (143)
5 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు 25, జనవరి 1 కోసం చేయబడిన ప్రత్యేక క్షేత్రసేవా ఏర్పాట్ల గురించి వివరించండి.
15 నిమి: “ప్రతిపాదనను పరిస్థితికి అనుగుణంగా మలచుకోవడం ద్వారా వ్యక్తిగత ఆసక్తి చూపించడం.”b ఒక ప్రచారకుడు గృహస్థుని వ్యాఖ్యానాల ఆధారంగా తన ప్రతిపాదనను ఎలా మార్చుకోవచ్చో చూపించే ఒక క్లుప్త ప్రదర్శనను చేర్చండి.
25 నిమి: “మీ పిల్లలు ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలరా?”c ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. సమర్థంగా చదవగల సహోదరునితో ప్రతీ పేరా బిగ్గరగా చదివించండి. ఉదాహరించబడిన లేఖనాలన్నిటినీ చర్చించండి. రెండవ పేరా చర్చించిన తర్వాత, కావలికోట, మే 1, 1992 13-14 పేజీల్లోని 16-17 పేరాల్లో, బాక్సులో పేర్కొనబడిన ఇద్దరు యౌవనుల పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి వివరించండి. ముగింపులో, తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కావలికోటలో ఉన్న ఆ ఆర్టికల్ అంతటినీ సమీక్షించిన వెంటనే రక్తం విషయంలో బైబిలు ఆధారిత నియమం గురించి చర్చించి, అభ్యాసం చేయమని, వారు దృఢవిశ్వాసంతో తమ నమ్మకాలను వ్యక్తం చేసేందుకు సిద్ధం చేయమని తల్లిదండ్రులను ప్రోత్సహించండి. కుటుంబ శిరస్సులు, బాప్తిస్మం తీసుకున్న పిల్లల దగ్గర DPA కార్డు ఉండేటట్లు, బాప్తిస్మం తీసుకోని పిల్లల దగ్గర ఐడెంటిటీ కార్డు ఉండేటట్లు చూడాలి. హాస్పిటల్‌లో చేరిన తర్వాత రక్తమార్పిడుల విషయంలో ఎవరికైనా సమస్య ఎదురైతే పెద్దలు సహాయం కోసం స్థానిక ఆసుపత్రి అనుసంధాన కమిటీని సంప్రదించాలి.
పాట 4 (43), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 26తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. డిసెంబరు క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. క్రొత్త సంవత్సరంలో మీ సంఘం కూటాల సమయాలను మార్చనున్నట్లయితే క్రొత్త సమయాల గురించిన ప్రకటన చేయండి. జనవరిలో అందించాల్సిన సాహిత్యం గురించి చెప్పి సూచించబడిన ప్రతిపాదనలను ఎక్కడ కనుగొనవచ్చో చెప్పండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: కావలికోట, తేజరిల్లు! పత్రికలను ప్రతిపాదించండి. అందించే పత్రికల సంఖ్యను పెంచడానికి సహాయం చేసే మన రాజ్య పరిచర్య, ఫిబ్రవరి 2005 సంచికలోని 8వ పేజీలో ఉన్న సలహాలను సమీక్షించండి. తాజా పత్రికల్లో ఆసక్తిని రేకెత్తించే అంశాల గురించి చర్చించండి. జనవరి 1 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ప్రతీ ప్రతిపాదనలో మన ప్రపంచవ్యాప్త పనికి ఎలా ఆర్థిక మద్దతు లభిస్తుందో వివరించండి.—కావలికోట, 2వ పేజీ లేక తేజరిల్లు! 5వ పేజీ.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
జనవరి 2తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
గమనిక: సంఘాలు జనవరి 2తో ప్రారంభమయ్యే వారపు సేవాకూటాన్ని ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శన ఉంటే తప్ప ఆ తేదీకన్నా ముందు నిర్వహించకూడదు. ప్రతీ సంఘంలో మధ్య పేజీల్లోని సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని సేవా కూటంలో ఉన్న పట్టిక ప్రకారమే చర్చించాలి. ఆ వారంలో ప్రాంతీయ సమావేశం ఉన్నట్లయితే పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు, సమావేశం జరిగే స్థలాన్ని, తేదీలను క్రమంగా పుస్తక అధ్యయనాలు నిర్వహించబడే చోట ప్రకటించాలి.
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “మన బైబిలు ఆధారిత ప్రచురణలను జ్ఞానయుక్తంగా ఉపయోగించండి.”d మన రాజ్య పరిచర్య సెప్టెంబరు 2002 1వ పేజీలోని వ్యాఖ్యానాలను చేర్చండి.
25 నిమి: “2006 ‘విడుదల సమీపించింది’ అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశం.”e సంఘ కార్యదర్శి నిర్వహించాలి. మొదటి పేరా చర్చించిన తర్వాత, డిసెంబరు 15, 2005వ తేదీగల సమావేశ నియామక పత్రాన్ని చదవండి. వీలైనంత త్వరగా సమావేశ ఏర్పాట్లను చేసుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.