పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“పర్యావరణ కాలుష్యం గురించే చాలామంది వ్యాకులపడుతున్నారు. కానీ మనస్సు కలుషితం కావడం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిల్లో లభించే ఆచరణాత్మకమైన సలహా మనకు భద్రతనివ్వగలదు. [ఎఫెసీయులు 5:3, 4 చదవండి.] మోసకరమైన ఈ ప్రమాదం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో ఈ పత్రిక చూపిస్తుంది.”
కావలికోట నవం. 15
“ఈ భూమి ఒకరోజు పరదైసుగా మారుతుందని గతంలో చాలామంది విశ్వసించేవారు. కానీ నేడు కొందరు అసలది ఉంటుందా అని సందేహిస్తున్నారు. భూమి భవిష్యత్తు గురించి మీ దృక్పథం ఏమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ విషయం గురించి బైబిలు ఏమి చెబుతోందో గమనించండి. [కీర్తన 37:11 చదవండి.] భూమి గురించి బైబిలు ఇంకా ఏమి చెబుతోందో ఈ పత్రిక చర్చిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“మీరూ మీ కుటుంబమూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 11వ పేజీలోని ఆర్టికల్ చూపించండి.] మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆరు మార్గాల గురించి ఈ తేజరిల్లు! చర్చిస్తుంది. ‘నాకు దేహములో బాగులేదని’ ఎవరూ అనని ఒక కాలం వస్తుందని మన సృష్టికర్త వాగ్దానం చేశాడు.” యెషయా 33:24 చదవండి.
కావలికోట డిసెం. 1
“నేడు కొంతమంది దేవుని మీద విశ్వాసం కోల్పోతున్నారు. దీనికి ఒక కారణమేమిటంటే, వారిని కలతపెట్టే ఇలాంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు దొరకక పోవడమే. [6వ పేజీలోని బాక్సు నుండి ఒక ఉదాహరణ ఇవ్వండి.] దేవుని మీద నిజమైన విశ్వాసాన్ని పెంచుకునేందుకు ఒక కీలకమైన అంశం గురించి ఈ కావలికోట సంచిక చర్చిస్తుంది.” ఫిలిప్పీయులు 1:9 చదవండి.