కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/05 పేజీ 4
  • మన పరిచర్య ఏమి నెరవేరుస్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన పరిచర్య ఏమి నెరవేరుస్తుంది?
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ పరిచర్యను పూర్తిస్థాయిలో చేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • యెహోవా సేవలో పనిరద్దీగా యుండుట
    మన రాజ్య పరిచర్య—1992
  • అత్యంత ఉత్సాహంతో సువార్తను ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ప్రకటనా పనిలో పట్టుదలతో మీరు ఎలా కొనసాగవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 11/05 పేజీ 4

మన పరిచర్య ఏమి నెరవేరుస్తుంది?

1. యెహోవా మన పరిచర్యను ఎలా దృష్టిస్తాడు, పరిచర్యకు మానవుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది?

1 విజయోత్సాహపు ఊరేగింపులో పాల్గొంటున్నట్లుగానే క్రైస్తవులు యెహోవా సేవలో విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్నట్లు దేవుని వాక్యం వర్ణిస్తోంది. (2 కొరిం. 2:14-16) మనం దేవుని జ్ఞానం గురించి ప్రకటిస్తున్నప్పుడు మన సేవార్పణలు యెహోవాకు ఇంపైన సువాసనలాగా ఉంటాయి. కొంతమంది సువార్త మాధుర్యానికి ఆకర్షించబడతారు, మరికొందరు దానిని తిరస్కరిస్తారు. అయితే చాలామంది సువార్తకు ప్రతికూలంగా స్పందిస్తున్నారంటే, మన పని విఫలమైందని దాని భావం కాదు. మన పరిచర్య ఏమి నెరవేరుస్తుందో పరిశీలించండి.

2. మన పరిచర్య ఏమి నిరూపించడానికి మనకు సహాయం చేస్తుంది?

2 యెహోవాను ఘనపరచడం: మానవులు స్వార్థపూరిత కారణాలనుబట్టి యెహోవాను సేవిస్తున్నారని సాతాను వాదిస్తున్నాడు. (యోబు 1:9-11) దేవునిపట్ల మనకున్న భక్తి నిజమైనదని నిరూపించుకోవడానికి క్రైస్తవ పరిచర్య మనకు అవకాశాన్నిస్తుంది. వ్యక్తిగత పరిస్థితులు కష్టంగా ఉన్నా లేక సాధారణ ప్రజానీకం పరిచర్యపట్ల ఉదాసీనత చూపిస్తున్నా, ప్రకటించి శిష్యులను చేయమనే ఆజ్ఞకు చాలామంది ప్రచారకులు ఇప్పటికీ లోబడుతున్నారు. అలాంటి యథార్థ సహనం యెహోవా హృదయాన్ని సంతోషపెడుతుంది!—సామె. 27:11.

3. దేవుని నామం గురించి, సంకల్పం గురించి ఎల్లప్పుడూ ప్రకటించడం మనకు ఎందుకు చాలా ప్రాముఖ్యం?

3 అంతేకాక, మన పరిచర్య దేవుని సంకల్పాన్ని నెరవేర్చడంలో కూడా ఒక పాత్రను పోషిస్తుంది. సాతాను లోకానికి రాబోయే నాశనం గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు: ‘నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలుసుకోవాలి.’ (యెహె. 39:7) ఈ విషయాన్ని జనాంగాలు తెలుసుకోవాలంటే దేవుని సేవకులు “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును” ఆయన నామం గురించి, సంకల్పం గురించి ఎల్లప్పుడూ ప్రకటించడం అత్యంత ప్రాముఖ్యం.—ప్రక. 14:6, 7.

4. ప్రకటనా పని తీర్పుకు ఆధారంగా ఎలా పని చేస్తుంది?

4 తీర్పుకు ఆధారం: సువార్త ప్రకటించడం తీర్పుకు ఆధారంగా కూడా పనిచేస్తుంది. క్రీస్తుయేసు, ‘దేవుని నెరుగనివారి మీదికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారి మీదికి’ ప్రతిదండన తీసుకువస్తాడని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (2 థెస్స. 1:6-8) ప్రజలు సువార్తకు ప్రతిస్పందించే దానినిబట్టి తీర్పుతీర్చబడతారు. దేవుని సేవకుల మీద అది ఎంత గంభీరమైన బాధ్యతను ఉంచుతుందో కదా! మనం రక్తాపరాధాన్ని తప్పించుకోవడానికి ప్రాణాన్ని రక్షించే రాజ్య సందేశాన్ని ప్రకటించేందుకు వెనకాడకూడదు.—అపొ. 20:26, 27.

5. మన పరిచర్యలో దేవుని దయ ఎలా ప్రతిబింబించబడుతుంది?

5 మన పొరుగువారు దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకొనేలా సహాయం చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు యెహోవా దయను వెల్లడి చేస్తాయి. (1 తిమో. 2:3, 4) ప్రజల జీవితాలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయనే విషయం మనకు తెలుసు కాబట్టి మనం వారి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి, సమయం మిగిలి ఉండగానే యెహోవాను వెదకమని వారిని ప్రోత్సహిస్తాం. అలా చేయడం ద్వారా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరే” “మన దేవుని మహా వాత్సల్యమును” మనం ప్రతిబింబిస్తాం.—లూకా 1:79; 2 పేతు. 3:9.

6. యెహోవా సేవలో క్రియాశీలంగా ఉండడం మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

6 మనం ప్రయోజనం పొందడం: యెహోవా సేవలో క్రియాశీలంగా ఉండడం మనకు రక్షణగా ఉంటుంది. మనం “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టు[కొని]” ఉండడానికి, ఈ ప్రస్తుత దుష్ట విధానంవల్ల మలినం కాకుండా ఉండడానికి మనకు అది సహాయం చేస్తుంది. (2 పేతు. 3:11-14; తీతు 2:11, 12) క్రైస్తవ పరిచర్యలో మన కృషి వ్యర్థం కాదని మనకు తెలుసు కాబట్టి ‘స్థిరులుగా, కదలనివారిగా, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తిగలవారిగా’ ఉందాం.—1 కొరిం. 15:58.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి