ప్రాంతీయ సమావేశ పునఃసమీక్ష
ఈ సమాచారం, 2006వ సేవా సంవత్సరపు ప్రాంతీయ సమావేశానికి సంఘం హాజరయ్యే కొద్దికాలం ముందు, కొద్దికాలం తర్వాత సేవా కూటం కార్యక్రమంలో ఉపయోగించబడుతుంది. మన రాజ్య పరిచర్య, డిసెంబరు 2004, 4వ పేజీలో ఇవ్వబడినట్లు ఈ సమావేశ సమీక్షను, పునఃసమీక్షను సంఘ పైవిచారణకర్త ఏర్పాటు చేస్తాడు. పునఃసమీక్ష చేస్తున్నప్పుడు, ఇవ్వబడిన ప్రసంగాలను మనమెలా అన్వయించుకోవాలి అనే దానిమీద దృష్టి నిలుపుతూ ప్రశ్నలన్నిటినీ అడగాలి.
మొదటి రోజు
1. మనం నూతన స్వభావాన్ని ఎలా ధరించుకుంటాం, మనం ఆ స్వభావాన్ని ఎందుకు కాపాడుకోవాలి?
2. కొందరు ప్రకటనా పనిలో తమ భాగాన్ని ఎలా అధికం చేసుకున్నారు?
3. మనం ఇతరులతో ఎందుకు పోల్చుకోకూడదు?
4. కుటుంబ పరిధిలో కుటుంబ సభ్యులు నూతన స్వభావాన్ని ఎలా చూపించవచ్చు?
5. మనం సంఘంలో యథార్థమైన మద్దతును ఎలా చూపించవచ్చు?
6. మనం క్షేత్ర పరిచర్యలో నూతన స్వభావాన్ని ప్రదర్శించడం ఎందుకు అవసరం?
7. సరైన ధ్యానం అంటే ఏమిటి, మనం అలాంటి ధ్యానం నుండి ఎలా ప్రయోజనం పొందుతాం?
8. మనం యెహోవా చేతిలో మలచబడగలిగేవారిగా ఏ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి?
రెండవ రోజు
9. మన నాలుకను సరైన విధంగా ఉపయోగించడం ఎంత ప్రాముఖ్యం?
10. సహోద్యోగులతో, తోటి విద్యార్థులతో, మరితరులతో మంచిగా సంభాషించడంవల్ల వచ్చే ప్రయోజనాలేమిటి?
11. మనం తోటి విశ్వాసులతో వ్యవహరిస్తున్నప్పుడు ఎఫెసీయులు 4:25-32 లో ఉన్న పౌలు సలహాను ఎలా అన్వయించుకోవచ్చు?
12. మన నాలుకను అత్యంత ఘనమైన రీతిలో ఉపయోగించే పద్ధతి ఏమిటి?
13. దుష్టుణ్ణి జయించడానికి మనం ఏమి చేయాలి?
14. ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండడానికి మనం ఏ రంగాల్లో కృషి చేయాలి?
15. మనం ప్రతీదినం మన ఆంతర్యపురుషుడ్ని ఎందుకు నూతనపరచుకోవాలి, మనం ఎలా నూతనపరచుకోవచ్చు?
16. ఈ సంవత్సరపు ప్రాంతీయ సమావేశ కార్యక్రమంలోని ఏ సలహాను అన్వయించుకోవాలని మీరనుకుంటున్నారు?