మీరు హ్యాండ్ బిల్లులను ఉపయోగిస్తున్నారా?
11 ఏండ్ల ఒక అబ్బాయికి ఒకరోజు, నరకం అనే అంశం మీద బహిరంగ ప్రసంగం గురించి ప్రకటిస్తున్న ఒక హ్యాండ్ బిల్లు దొరికింది. “నేను ఎప్పుడూ తప్పే చేస్తుంటాను అని నాకు అనిపించేది కాబట్టి నేను చనిపోయిన తర్వాత మండుతూవుండే నరకానికే వెళ్తానేమోనని నేను ఎక్కువగా కలతపడేవాడ్ని, ఆ కారణంగా ఆ హ్యాండ్ బిల్లు నాలో ఆసక్తి రేకెత్తించింది” అని ఆయన ఆ తర్వాత వివరించాడు. ఆయన ఆ ప్రసంగానికి హాజరయ్యాడు, దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఎన్నో బైబిలు అధ్యయన చర్చల అనంతరం ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన కార్ల్ క్లెయిన్ క్రైస్తవ జీవితం అలా ప్రారంభమైంది. అదీ ఒక హ్యాండ్ బిల్లుతో ప్రారంభమైంది.
నేడు కూడా హ్యాండ్ బిల్లులు సమర్థవంతమైన సాక్ష్యమిచ్చే సాధనాలుగా ఉన్నాయి. చాలామంది ప్రచారకులు తమను తాము పరిచయం చేసుకొని, సంభాషణను ప్రారంభించడానికి ఒక వ్యక్తికి హ్యాండ్ బిల్లును ఇవ్వడం అనువైన పద్ధతి అని గ్రహిస్తున్నారు. తమ చిన్నపిల్లలు ఇంటింటి పరిచర్యలో హ్యాండ్ బిల్లులు ఇస్తూ పరిచర్యలో భాగం వహించేలా తల్లిదండ్రులు వారికి సహాయం చేయవచ్చు. ఉత్తరాల ద్వారా సాక్ష్యమిచ్చే ప్రచారకులు ఉత్తరంతోపాటు హ్యాండ్ బిల్లును కూడా పంపించడం ద్వారా కూటాల గురించి తెలియజేయవచ్చు. అంతేకాక, బైబిలు విద్యార్థులను, ఆసక్తిగల ఇతరులను, మన కూటాలకు రమ్మని ఆహ్వానించేందుకు హ్యాండ్ బిల్లులు ఇవ్వడం అనువైన మార్గం.
మీరు మీ పరిచర్యలో హ్యాండ్ బిల్లులను సరైన విధంగా ఉపయోగిస్తున్నారా?