క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
ఈ భ్రష్ట పాత లోకపు చివరి రోజుల్లో మన ఆధ్యాత్మిక వస్త్రాలను, మన క్రైస్తవ గుర్తింపును కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. (ప్రక. 16:15) అందుకే 2006వ సేవా సంవత్సరపు ప్రాంతీయ సమావేశ కార్యక్రమ మూలాంశం ‘నవీన స్వభావాన్ని ధరించుకోండి’ అనేది సముచితంగా ఉంది.—కొలొ. 3:9.
మొదటి రోజు: “నవీన స్వభావంలోని వివిధ అంశాలను కనబరచడం” అనే మొదటి గోష్ఠి, నూతన స్వభావాన్ని వృద్ధి చేసుకోవడం మన జీవితాల్లోని అన్ని రంగాల్లో మనకెలా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశాన్ని నొక్కి చెబుతుంది. నూతన స్వభావాన్ని మనమెలా వృద్ధి చేసుకుంటాం? ఆ అంశం మొదటి రోజు ఇవ్వబడే “సరైనవిధంగా ధ్యానించడానికి మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోండి,” “నవీన స్వభావాన్ని తీర్చిదిద్దే విద్య” అనే చివరి రెండు ప్రసంగాల్లో వివరించబడతాయి.
రెండవ రోజు: “జ్ఞానుల నాలుకను వృద్ధి చేసుకోవడం” అనే రెండవ గోష్ఠిలో, మనం నాలుకను ఉపయోగించే విధానాన్ని నూతన స్వభావం ఎలా ప్రభావితం చేస్తుందో వివరించబడుతుంది. “మీరు దుష్టుణ్ణి జయిస్తున్నారా?” అనేది బహిరంగ ప్రసంగపు అంశం, అది సాతాను కుయుక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. “ఇహలోకమాలిన్యం మీకు అంటకుండా చూసుకోండి,” “ఆంతర్యపురుషుడ్ని దినదినము నూతనపరచుకోవడం” అనే సమావేశపు చివరి రెండు ప్రసంగాలు, దేవుని నీతియుక్త మార్గాలకు వ్యతిరేకంగా ఉన్న వైఖరులను, ప్రవర్తనను వదిలివేసి మనం యెహోవాకు చేసే ఆరాధనలో స్థిరంగా ఉండడానికి మనకు సహాయం చేస్తాయి.
నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకొని దానిని కాపాడుకోమనే ఆ ప్రోత్సాహాన్ని పొందాలని మనం ఎంతగా ఎదురుచూస్తున్నామో కదా!