సేవా కూటాల పట్టిక
జూలై 11తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. జూలై 15 కావలికోటను, జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 4వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. రెండు ప్రదర్శనల్లోనూ ‘పనితొందరలో ఉన్నాను’ అని సంభాషణను ఆటంకపరిచే వారితో విభిన్నమైన రీతుల్లో ఎలా వ్యవహరించాలో చూపించండి.—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను పుస్తకంలో 11-12 పేజీలు చూడండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “రాజ్య సువార్త సాధ్యమైనంతమందికి అందుబాటులో ఉండేలా చేయడం.”a 5వ పేరా చర్చిస్తున్నప్పుడు జూన్ 2005 మన రాజ్య పరిచర్య 8వ పేజీలోని, స్థానిక క్షేత్రానికి అన్వయించే సూచనలను సమీక్షించండి.
పాట 26 (212), ముగింపు ప్రార్థన.
జూలై 18తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
10 నిమి: స్థానిక ప్రకటనలు. కావలికోట, ఆగస్టు 15, 2000 32వ పేజీని క్లుప్తంగా చర్చించండి. సెలవుల్లో ఉన్నప్పుడు, సాధారణ దినచర్యకు భిన్నమైన పరిస్థితుల్లో ఉన్న వేరే సమయాల్లో కూడా ప్రతీదినం బైబిలు చదివే క్రమమైన కార్యక్రమాన్ని అనుసరించడంవల్ల కలిగే ప్రయోజనాలను నొక్కి చెప్పండి.
15 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—11వ భాగం.”b అధ్యయన నిర్వాహకుడు, క్రొత్త ప్రచారకుడు ఒక పునర్దర్శనానికి సిద్ధపడుతున్నట్లు చూపించే ఒక ప్రదర్శనను చేర్చండి. వారు మొదటి సందర్శనాన్ని సమీక్షించి పునర్దర్శనమప్పుడు మాట్లాడడానికి సరైన అంశాన్ని ఎన్నుకుంటారు. వారు ఒక సరళమైన ఉపోద్ఘాతాన్ని, సందర్శన ముగింపులో లేవనెత్తగల ప్రశ్నను కూడా సిద్ధపడతారు. వారు అప్పుడే సిద్ధపడిన ప్రతిపాదనను పూర్వాభ్యాసం చేయడానికి సిద్ధమవుతుండగా ప్రదర్శన ముగుస్తుంది.
20 నిమి: బైబిలు విలువను గ్రహించేందుకు ఇతరులకు సహాయం చేయండి. దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంలోని 23-5 పేజీల్లోవున్న 3-6 పేరాల ఆధారంగా ప్రశ్నా జవాబులతో చర్చ. పుస్తకంలో ఇవ్వబడిన అధ్యయన ప్రశ్నలను ఉపయోగించండి. సర్వమానవాళి కొరకైన గ్రంథం బ్రోషుర్‌లోని 32వ పేజీలోని వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 21 (191), ముగింపు ప్రార్థన.
జూలై 25తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
15 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టును, విరాళాల ఎక్‌నాలెడ్జ్‌మెంట్లను చదవండి. జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, ఆగస్టు 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 4వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఆచరణాత్మకమైన ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ఒక ప్రదర్శనలో మార్కెట్‌లో గానీ మరితర అనువైన బహిరంగ ప్రదేశాల్లో గానీ పత్రికలను అనియతంగా ప్రతిపాదించడాన్ని ప్రదర్శించండి.
10 నిమి: మీ పిల్లల హృదయాల్లో సత్యాన్ని నాటండి (ద్వితీ. 6: 7). కావలికోట, ఆగస్టు 15, 2002, 30-1 పేజీల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. సాక్షికాని భాగస్వామిగల క్రైస్తవ తల్లికి లేదా తండ్రికి పిల్లల శిక్షణ విషయంలో మార్గనిర్దేశం ఇచ్చే లేఖన సూత్రాలను నొక్కి చెప్పండి.
20 నిమి: “మనం ఇతరులకు ఋణపడి ఉన్నది.”c కావలికోట, జూలై 1, 2000, 11వ పేజీలోని 13వ పేరాలో నుండి వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 10 (82), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 1తో ప్రారంభమయ్యే వారం
పాట 17 (187)
15 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై క్షేత్ర సేవా రిపోర్టులు ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. పరిచర్య పాఠశాల పుస్తకంలోని 70వ పేజీ తెరవమని ప్రేక్షకులను ఆహ్వానించండి, ప్రేక్షకులతో చర్చ రూపంలో 2, 3 పేరాలను, “కూటాల్లో వ్యాఖ్యానించడమెలా” అనే బాక్సును చర్చించండి.
15 నిమి: “మీ పిల్లలు పరిచర్యలో ప్రగతి సాధించడానికి సహాయం చేయండి.” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. తల్లి లేక తండ్రి తమ అబ్బాయి లేక అమ్మాయి సరళమైన ప్రతిపాదనను ఉపయోగించే ఒక ప్రదర్శనను చేర్చండి. తల్లి లేక తండ్రి చందా ఏర్పాటు గురించి క్లుప్తంగా వివరించడం ద్వారా ప్రతిపాదనను ముగించనివ్వండి.
15 నిమి: పరిస్థితికి తగ్గట్లు మీ ప్రతిపాదనను మలుచుకోవడానికి ప్రయత్నించారా? జనవరి 2005 మన రాజ్య పరిచర్యలోని 6వ పేజీ ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ఇవ్వబడిన సూచనలను సమీక్షించి, ఆగస్టు సాహిత్య ప్రతిపాదన విషయంలో పరిస్థితికి తగ్గట్టు మలుచుకొనే పద్ధతిని ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. ఒకటి లేక రెండు ప్రతిపాదనలను ప్రదర్శించండి.
పాట 29 (222), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నాజవాబులతో చర్చను కొనసాగించండి.