క్రైస్తవేతర మతాలకు చెందినవారి కోసం బ్రోషుర్లు
శాశ్వత శాంతి, సంతోషం —వాటిని ఎలా కనుగొనాలి (ఆంగ్లం)
చైనా భాష మాట్లాడే విద్యార్థికి సాక్ష్యమిస్తున్నప్పుడు, మీరిలా అనవచ్చు:
“విద్యార్థులందరూ శాంతి, సంతోషాలు నెలకొనడం చాలా ప్రాముఖ్యమని భావిస్తున్నట్లు నేను కనుగొన్నాను. అవి ప్రాముఖ్యమని మీరు భావిస్తున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ ప్రాచీనకాల వాక్యాల నెరవేర్పును చూడడం అద్భుతంగా ఉండదా?” కీర్తన 37:11 చదివి, బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.—km 2/98 5వ పేజీ.
“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
వయస్సు పైబడిన ఒక బౌద్ధమతస్థునితో మీరిలా అనవచ్చు:
“ప్రస్తుతం ప్రవాహంలా కొట్టుకొస్తున్న అనైతిక తలంపుల గురించీ, అవి మన పిల్లల మీద చూపించే ప్రభావం గురించీ బహుశా మీరూ నాలాగే చింతిస్తుండవచ్చు. యౌవనులలో ఎందుకింత అనైతికత పెరుగుతోంది? [ప్రతిస్పందించనివ్వండి.] ఇస్లామ్, హిందూ, క్రైస్తవ మతాల ప్రారంభానికి ఎంతోకాలం ముందు వ్రాయబడిన ఒక గ్రంథంలో దాని గురించి ముందుగానే తెలియజేయబడిందన్న విషయం మీకు తెలుసా? [2 తిమో. 3:1-3 చదవండి.] జ్ఞానార్జన అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఈ పరిస్థితులు అధికమౌతున్నాయనేది గమనించండి. [7వ వచనం చదవండి.] చాలామంది తెలుసుకోలేని సత్యాన్ని అర్థం చేసుకొనేందుకు ఈ పుస్తకం నాకు సహాయం చేసింది. దీనిని చదవడానికి మీరు ఇష్టపడతారా?—km 8/99 8వ పేజీ.
మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?
యౌవనుడైన ఒక హిందువుతో మీరిలా అనవచ్చు:
“దేవుడున్నాడని మీరు నమ్ముతారనడంలో సందేహం లేదు. మన విషయంలో దేవుని సంకల్పమేమిటని మీరనుకుంటున్నారు?” [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత ఆదికాండము 1:28 చదవండి.] భూమ్మీది అనేక ప్రాంతాల్లో అధిక జనాభా ఉండడమే కాక సమస్యలు కూడా వారిని పట్టి పీడిస్తున్నాయి. మన సమస్యలను పరిష్కరించుకోవడానికి సృష్టికర్త మనకు సహాయం చేయడానికి సుముఖంగా ఉన్నాడని మీరనుకుంటున్నారా?” ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.—km 9/99 8వ పేజీ.
మనం పరదైసుకు వెళ్ళే మార్గం —దేవుని నడిపింపు (ఆంగ్లం)
ఒక ముస్లిమ్ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీరిలా అనవచ్చు:
“నేను ఈ రోజు ప్రత్యేకంగా ముస్లిమ్లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ముస్లిమ్‌లు ఒకే సత్య దేవుణ్ణి, ప్రవక్తలనందర్నీ నమ్ముతారనీ నేను గ్రహించాను. అది నిజమేనా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ భూమి ఒక పరదైసుగా మారుతుందని చెప్పే ఒక ప్రాచీనకాల ప్రవచనం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ ప్రవక్త ఏమి వ్రాశాడో నేను మీ కోసం చదవవచ్చా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యెషయా 11:6-9 చదవండి.] ఈ ప్రవచనం, ఈ బ్రోషుర్‌లో ఖురాన్ నుండి ఉదాహరించబడిన ఒక అంశాన్ని నాకు గుర్తు చేస్తుంది.” బ్రోషుర్‌లోని 9వ పేజీ తెరిచి, ముద్దక్షరాల్లో ఉన్న దానిని చదవండి. ఆసక్తి చూపిస్తే, ప్రక్క పేజీలోవున్న 7-9 పేరాలను చర్చిస్తూ సంభాషణను కొనసాగించండి.—km 1/00 8వ పేజీ.
దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఎందుకు ఆరాధించాలి? (ఆంగ్లం)
కుటుంబస్థుడైన ఒక హిందువును ఈ ప్రతిపాదన ఆకట్టుకోవచ్చు:
“నేడు అనేక దేశాల్లో ఉన్న కుటుంబ పరిస్థితి గురించి చింతించే ప్రజలను నేను సందర్శిస్తున్నాను. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచేందుకు సహాయం చేసేది ఏమిటని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] కుటుంబం గురించి హిందువుల పవిత్ర గ్రంథాలు ఏమి చెబుతున్నాయో కొందరికి తెలుసు అయితే, అదే అంశం మీద బైబిలు చెబుతున్న విషయాన్ని పోల్చి చూసే అవకాశం వారికి దొరకలేదు. ఈ విషయాన్ని మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. [కొలొస్సయులు 3:12-14 చదవండి.] ఈ బ్రోషుర్ భారతదేశానికి చెందిన పవిత్ర గ్రంథాలనే కాక బైబిలును కూడా పరిశోధిస్తుంది.” బ్రోషుర్‌ను అందించి, 8-9, 20-1 పేజీలను చూపించండి.—km 9/99 8వ పేజీ.
యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం)
ఒక యూదునికి సాక్ష్యమిస్తున్నప్పుడు మీరిలా అనవచ్చు:
“మనలో చాలామంది మనకు ప్రియమైనవారిని మరణం కారణంగా కోల్పోయి ఉంటాం. మనం మరణించినప్పుడు మనకు ఏమౌతుందని మీరు అనుకుంటున్నారు?” ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత బ్రోషుర్‌లోని 22వ పేజీలో ఉన్న “మరణము, ప్రాణము—ఏమిటవి?” అనే బాక్సు చూపించండి. పునరుత్థానం గురించి 23వ పేజీలోని 17వ పేరాను చదవండి. పూర్వీకుడైన యోబు పునరుత్థాన నిరీక్షణను మనస్సులో ఉంచుకున్నాడని చెప్పండి. బ్రోషుర్‌ను ఇచ్చి, 17వ పేరా చివర్లో ఉదాహరించబడిన లేఖనాలను చర్చించేందుకు తిరిగి కలుసుకొనే ఏర్పాటు చేసుకోండి.—km 11/99 8వ పేజీ.