జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు? బ్రోషుర్ను
ప్రతిపాదించడానికి సూచనలు
గృహస్థుడిని పరిచయం చేసుకున్న తర్వాత, మీరిలా అనవచ్చు:
“నేటి జీవితంలో సమస్యలు, నిరాశలు తప్పడం లేదు. జీవితం ఇలాగే ఉండాలని ఉద్దేశించబడిందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మానవజాతిపట్ల, భూమిపట్ల దేవుని ఆది సంకల్పం చివరకు నెరవేరుతుందని ఈ బ్రోషుర్ వివరిస్తోంది. [20-1 పేజీల్లోని చిత్రాన్ని చర్చించండి. ఆ తర్వాత 9వ పేరాను చదువుతున్నప్పుడు యెషయా 14:24; 46:11 వచనాలు నొక్కి చెప్పండి.] నేను మళ్ళీ వచ్చినప్పుడు దేవుడు భూమ్మీద పరదైసు పునరుద్ధరిస్తాడని బైబిల్లో ఎక్కడుందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను.” బ్రోషుర్ను ప్రతిపాదించి పునర్దర్శనం చేయడానికి ఏర్పాటు చేయండి.
పునర్దర్శనం చేస్తున్నప్పుడు మీరిలా అనవచ్చు:
“మానవులు పరదైసు భూమ్మీద నిరంతరం జీవించాలనేది దేవుని సంకల్పం అని నేను ఇంతకుముందు చెప్పాను. [20-1 పేజీల్లోని చిత్రాన్ని మళ్ళీ చూపించండి.] యేసు, పేతురు, దావీదు పరదైసు గురించి చెప్పారని గమనించండి.” ఆయనను తన బ్రోషుర్ను తెచ్చుకోమని చెప్పండి. ఆ తర్వాత 21-2 పేజీలను తెరచి, 10-13 పేరాలను చర్చించండి. బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి, లేక తర్వాత కలుసుకున్నప్పుడు 29-30 పేజీల్లోని ఒక ఉపశీర్షికను చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
కౌమారప్రాయంలోవున్న ప్రచారకుడు ఇలా అనవచ్చు:
“నా వయస్సువారు చాలామంది భవిష్యత్తు గురించిన అనిశ్చయతతో ఉన్నారు. రాబోయే తరం వారికి మెరుగైన జీవితం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మానవజాతి అంతటికీ ఒక ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉందని బైబిలు చెబుతోంది. [బ్రోషుర్లోని 31 పేజీలో ఉన్న చిత్రానికి పేజీని త్రిప్పి, శీర్షికను చదవండి. ఆ తర్వాత 2 పేతురు 3:13 చదవండి.] దేవుడు భవిష్యత్తులో మానవజాతికి ఇవ్వనున్న ఆశీర్వాదాల గురించిన సమాచారం ఈ బ్రోషుర్ ఇస్తోంది. [29-30 పేజీల్లో ముద్దక్షరాల్లోని ఉపశీర్షికలను నొక్కి చెప్పండి, బ్రోషుర్ను ప్రతిపాదించండి.] నేను మళ్ళీ వచ్చినప్పుడు, యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని దేవుడు చేసిన వాగ్దానం గురించి చెప్పాలనుకుంటున్నాను.” పునర్దర్శనం కోసం ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనం చేస్తున్నప్పుడు, మీరిలా అనవచ్చు:
“నేను ఇంతకుముందు వచ్చినప్పుడు, భూమ్మీద పరదైసును పునరుద్ధరించాలనే దేవుని సంకల్పం గురించి క్లుప్తంగా వివరించాను. [31వ పేజీలోని చిత్రాన్ని మళ్ళీ చూపించండి.] యుద్ధాలన్నిటినీ అంతం చేస్తాననే దేవుని వాగ్దానం గురించి మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను.” ఆయనను తన బ్రోషుర్ను తీసుకురమ్మనండి. ఆ త్రర్వాత 29 పేజీల్లోని 3-6 పేరాలు చదివి, చర్చించండి. తర్వాతి సందర్శనంలో 7-8 పేరాలు చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
ఒక పిల్లవానితో పనిచేస్తున్నప్పుడు వయోజనుడు ఇద్దరినీ పరిచయం చేసుకొని ఇలా అనవచ్చు:
“మీరు అనుమతిస్తే, ________ మీకు ఒక చిత్రాన్ని చూపించి బైబిలు నుండి ఒక లేఖనాన్ని చదవడానికి ఇష్టపడుతున్నాడు. [పిల్లవాడు చిత్రాన్ని చూపించి 31వ పేజీలోని శీర్షికను చదివిన తర్వాత ప్రకటన 21:4 కూడా చదువుతాడు.] నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో దేవుడు ఏమి చేస్తాడో ఈ బ్రోషుర్ వివరిస్తోంది. [29-30 పేజీల్లో ముద్దక్షరాల్లోని ఉపశీర్షికలను క్లుప్తంగా నొక్కిచెప్పి, బ్రోషుర్ను ప్రతిపాదించండి.] మేము తిరిగి వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలన్నీ అంతమవడం గురించి బైబిలు ఏమి చెబుతుందో మీకు చూపించాలనుకుంటున్నాను.”
పునర్దర్శనమప్పుడు, వయోజనుడు ఇలా అనవచ్చు:
“ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఆరోగ్య సమస్యలన్నీ అంతమవడం గురించి బైబిలు ఏమి చెబుతుందో నేను మీకు చూపించాలనుకుంటున్నానని చెప్పాను. ఇక్కడ ఏమి చెబుతుందో గమనించండి.” ఆయనను తన బ్రోషుర్ను తెచ్చుకోమని చెప్పండి. ఆ తర్వాత బ్రోషుర్లో 29వ పేజీలోని 9-14 పేరాలను చర్చించండి. బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి, లేక మళ్ళీ సందర్శించినప్పుడు 15-17 పేరాలు పరిశీలించడానికి ఏర్పాటు చేసుకోండి.