దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
బ్రోషుర్ను ప్రతిపాదించేందుకు సూచనలు
ఒక విషాద ఘటన గురించిన వార్త చెప్పిన తర్వాత, మీరిలా అనవచ్చు:
“మనపట్ల దేవునికి నిజమైన శ్రద్ధ ఉంటే ఆయన మానవులు బాధలు అనుభవించడానికి ఎందుకు అనుమతించాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ బ్రోషుర్ ఆ ప్రశ్నకు ఒక సంతృప్తికరమైన జవాబు ఇవ్వడమే కాక సమీప భవిష్యత్తులో దేవుడు ఏమి చేస్తాడో కూడా వివరిస్తుంది. [27వ పేజీలోని చిత్రాలను చూపించి 22వ పేరాలోని కీర్తన 145:16 చదవండి.] మానవజాతి అనుభవించిన బాధలన్నిటినీ దేవుడు ఎలా నిర్మూలిస్తాడు? నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆ ప్రశ్నను చర్చించడానికి ఇష్టపడుతున్నాను.” బ్రోషుర్ను ఇచ్చి, పునర్దర్శనం చేయడానికి ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనమప్పుడు మీరిలా అనవచ్చు:
“నేను ఇంతకుముందు వచ్చినప్పుడు మనం ఈ లేఖనాన్ని చదివాం. [కీర్తన 145:16 చదవండి లేక ఉల్లేఖించండి.] ఆ తర్వాత మానవజాతి అనుభవించిన బాధలన్నిటినీ దేవుడు ఎలా నిర్మూలిస్తాడు అనే ప్రశ్నను నేను అడిగాను.” ఆయనను తన బ్రోషుర్ను తెచ్చుకోమని చెప్పండి. ఆ తర్వాత 27-8 పేజీలు తెరిచి 23-5 పేరాలు చర్చించండి. బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి, లేదా తర్వాతి సందర్శనంలో 26-7 పేరాలు చర్చించడానికి ఏర్పాట్లు చేసుకోండి.
కౌమారప్రాయంలోవున్న ప్రచారకుడు ఇలా అనవచ్చు:
“నా వయస్సువారు చాలామంది ఇంకో 10, 15 సంవత్సరాల తర్వాత ఈ లోకం ఎలా ఉంటుందోనని కలత చెందుతున్నారు. అప్పుడు లోకం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] నేడు మనం చూస్తున్న సమస్యలు మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని సూచిస్తున్నాయి. [2 తిమోతి 3:1-3 చదవండి.] ఈ బ్రోషుర్ క్రింది ప్రశ్నలకు జవాబు ఇస్తోంది. [కవరు మీద ఉన్న ప్రశ్నలను చదివి బ్రోషుర్ను ప్రతిపాదించండి.] నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు కొద్ది నిమిషాలు ఇస్తే అనారోగ్యం, వృద్ధాప్యం అంతమవడం గురించిన ప్రోత్సాహకరమైన ఆలోచనను చెప్పడానికి ఇష్టపడతాను.” పునర్దర్శనం చేయడానికి ఏర్పాటు చేసుకోండి.
మీరు పునర్దర్శనం చేస్తున్నప్పుడు ఇలా అనవచ్చు:
“ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు అనారోగ్యం, వృద్ధాప్యం అంతమవడం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను అని నేను చెప్పాను. ఆ అంశం ఇక్కడ ఉంది.” ఆయనను తన బ్రోషుర్ను తెచ్చుకోమని చెప్పండి. ఆ తర్వాత 23-4 పేజీల్లోని 6-7 పేరాలను చదివి, చర్చించండి. మళ్ళీ కలుసుకొని 8-9 పేరాలు చర్చించేందుకు ఏర్పాటు చేసుకోండి.
ఒక పిల్లవానితో పనిచేస్తున్నప్పుడు వయోజనుడు ఇద్దరినీ పరిచయం చేసుకొని ఇలా అనవచ్చు:
“మీరు అనుమతిస్తే, ________ మీ కోసం ఒక లేఖనాన్ని చదవాలని ఇష్టపడుతున్నాడు. [పిల్లవాడు కీర్తన 37:29 చదివి క్లుప్తంగా వ్యాఖ్యానిస్తాడు.] దేవుడు మానవజాతి విషయంలో, భూమి విషయంలో తన సంకల్పాన్ని ఎలా నెరవేరుస్తాడో ఈ బ్రోషుర్ చర్చిస్తోంది. [24-7 పేజీల్లోని చిత్రాలను చూపించండి.] మేము తిరిగి వచ్చినప్పుడు పునరుత్థానం గురించిన అద్భుతమైన బైబిలు వాగ్దానాన్ని మీకు చూపించడానికి నేను ఇష్టపడతాను.” బ్రోషుర్ను ప్రతిపాదించి, పునర్దర్శనం చేయడానికి ఏర్పాటు చేయండి.
పునర్దర్శనం చేస్తున్నప్పుడు వయోజనుడు ఇలా అనవచ్చు:
“నేను మిమ్మల్ని ఇంతకుముందు కలిసినప్పుడు, మనం కీర్తన 37:29 చదివాం, పునరుత్థానం గురించి బైబిలు ఏమి చెబుతుందో మీకు చూపించాలనుకుంటున్నాను అని చెప్పాను. ఇక్కడ ఏమి చెబుతుందో గమనించండి.” ఆయన తన బ్రోషుర్ను తెచ్చుకోమని చెప్పండి. ఆ తర్వాత 24-5 పేజీల్లోని 12-14 పేరాలను చర్చించండి. బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి, లేక తర్వాత కలుసుకున్నప్పుడు 15-16 పేరాలను చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.