భద్రపరచుకోండి
సూచించబడిన బ్రోషుర్ల ప్రతిపాదనలు
మీరు బ్రోషుర్లను అందించడానికి ప్రతిపాదనలను సిద్ధపడేలా సహాయం చేయడానికి మధ్యపేజీల్లో వివిధ రకాల సూచనలు ఇవ్వబడ్డాయి. వాటిని స్థానిక పరిస్థితులకు అనుకూలంగా మలచుకోవచ్చు. ఇతర ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. క్రింది సూచనలను నమూనాగా తీసుకొని మధ్యపేజీల్లో ఇవ్వబడని బ్రోషుర్ల ప్రతిపాదనలను తయారు చేసుకోవచ్చు.—జనవరి 2005 మన రాజ్య పరిచర్య, 8వ పేజీ చూడండి.
ఈ పేజీలో ఉన్న సూచనలన్నిటిలో (1) సంభాషణ ప్రారంభించడానికి ఆలోచన రేకెత్తించే ప్రశ్న, (2) బ్రోషుర్లో మాట్లాడే అంశాలు కనుగొనేందుకు సమాచార మూలం, (3) చర్చ జరుగుతున్నప్పుడు చదవగల ఒక అనువైన లేఖనం ఉన్నాయి. వ్యక్తి ప్రతిస్పందనకు అనుగుణంగా ప్రతిపాదనలోని మిగతా విషయాలను మీ సొంత మాటల్లో చెప్పవచ్చు.
సర్వమానవాళి కొరకైన గ్రంథం
“మన కాలంలో అనుసరించదగ్గ సలహా బైబిల్లో ఉందని మీరు అనుకుంటున్నారా?”—22వ పేజీ, శీర్షిక; 23వ పేజీ, బాక్సులోని 3వ పేరా; సామె. 25:11.
సంతృప్తికరమైన జీవితం —దాన్నెలా సాధించవచ్చు
“ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మెరుగైన జీవితం కోసం ప్రయత్నిస్తున్నారు. నిజమైన సంతృప్తికరమైన జీవితం ఎప్పటికైనా సాధ్యమని మీరు అనుకుంటున్నారా?”—29వ పేజీ, 6వ పేరా; 2 పేతు. 3:13.
భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
“చాలామంది తాము నిత్యజీవాన్ని అనుభవించడానికి పరలోకానికి వెళ్ళాలని భావిస్తారు, కానీ భూమ్మీద నిరంతరం జీవించడం గురించి మీరు ఏమనుకుంటున్నారు?”—కవరు మీదున్న చిత్రం; ప్రక. 21:4.
త్రిత్వమును మీరు నమ్మవలయునా?
“దేవుని నిజ స్వభావం గురించి ప్రజలకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. మనం నమ్ముతున్న విషయాలు ప్రాముఖ్యమని మీరు అనుకుంటున్నారా?”—3వ పేజీ, 3, 7-8 పేరాలు; యోహా. 17:3.
నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం)
“మనలో చాలామందికి ‘పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక’ అనే మాటలతో ప్రారంభమయ్యే ప్రార్థన తెలుసు. (మత్త. 6:9) అయితే, మన రక్షణ ఆ నామం తెలుసుకోవడం మీద ఆధారపడివుందని మీకు తెలుసా?”—28వ పేజీ, 1వ పేరా; రోమా. 10:13.
పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము
“నేడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలని చాలామంది కోరుకుంటారు. ఆ సమస్యలను పరిష్కరించగల ఒక ప్రభుత్వం ఎప్పటికైనా వస్తుందని మీరు అనుకుంటున్నారా?”—3వ పేజీ, 1వ పేరా; మత్త. 6:9, 10.
మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం)
“మన ప్రియమైనవారు చనిపోతే వారు ఎక్కడ ఉన్నారు, వాళ్ళను మళ్ళీ ఎప్పటికైనా చూస్తామా వంటి ప్రశ్నల గురించి ఆలోచించడం సహజం. మీరు అలాంటి ప్రశ్నల గురించి ఆలోచించారా?”—చివరి పేజీలో ఉన్న ప్రశ్నలు; యోబు 14:14, 15.
మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే
“మరణం కారణంగా ప్రియమైనవారిని కోల్పోయిన లక్షలాదిమందికి ఓదార్పును, నిరీక్షణను ఇచ్చిన ఈ బ్రోషుర్ను ఈ రోజు మేము ఇస్తున్నాం. చనిపోయినవారికి ఎలాంటి నిరీక్షణ ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?”—27వ పేజీ, 3వ పేరా; యోహా. 5:28, 29.
“మరణం కారణంగా తమ ప్రియమైనవారిని కోల్పోయిన ఒక వ్యక్తిని ఎలా ఓదార్చాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?”—20వ పేజీ, 1వ పేరా; సామె. 17:17.