అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి
జూన్ 27, 2005 నుండి ఏప్రిల్ 10, 2006 వారాలకు అధ్యయన పట్టిక
వారం అధ్యాయం పేరాలు
జూన్ 27 1 1-9
జూలై 4 1 10-14*
11 2 1-9
18 2 10-16*
25 3 1-10
ఆగ. 1 3 11-13*
8 4 1-9
15 4 10-15*
22 5 1-9
29 5 10-14*
సెప్టెం. 5 6 1-10
12 6 11-18*
19 7 1-10
26 7 11-18*
అక్టో. 3 8 1-10
10 8 11-15*
17 9 1-10
24 9 11-18*
31 10 1-10
నవం. 7 10 11-17*
14 11 1-9
21 11 10-15*
28 12 1-9
డిసెం. 5 12 10-16*
12 13 1-9
19 13 10-17*
26 14 1-9
జన. 2 14 10-15*
9 15 1-9
16 15 10-16*
23 16 1-7
30 16 8-14*
ఫిబ్ర. 6 17 1-7
13 17 8-13*
20 18 1-9
27 18 10-15*
మార్చి 6 19 1-6
13 19 7-12*
20 20 1-7
27 20 8-15*
ఏప్రి. 3 21 1-9
10 21 10-15*
దేవుణ్ణి ఆరాధించండి పుస్తక అధ్యయనం
అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి అనే పుస్తకం, కొత్తవారు జ్ఞానము పుస్తక అధ్యయనం పూర్తి చేసిన తర్వాత వారితో అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ఈ ప్రచురణను సంఘ పుస్తక అధ్యయనంలో మనం పరిశీలించడం, పరిచర్యలో ఈ ఉపకరణాన్ని ఉపయోగించడానికి మనల్ని సంసిద్ధులను చేస్తుంది, యెహోవాపట్ల ఆయన సంస్థపట్ల మన ప్రేమను కృతజ్ఞతను అధికం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుణ్ణి ఆరాధించండి అనే పుస్తక అధ్యయనం నుండి మనమెలా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు?
అధ్యయనం నిర్వహించడం: మనం రెండు వారాలకు ఒక అధ్యాయాన్ని పరిశీలిస్తాం, ప్రతీవారం అధ్యయనం చేయాల్సిన పేరాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ కారణంగా సమాచారం మీద మీరు చేసిన అధ్యయనం, ధ్యానం ఆధారంగా హృదయపూర్వక వ్యాఖ్యానాలను ఇవ్వడానికి అది మీకు సరిపోయేంత సమయాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అధ్యాయపు ముగింపు భాగాలను సమీక్షించే వారాల్లో పునఃసమీక్షా బాక్సును చర్చించేందుకు సమయం లభించేలా కొన్ని పేరాలే పరిశీలించబడతాయి.
దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంలోని దాదాపు యాభై శాతం అధ్యాయాల్లో ధ్యానించడానికి, చర్చించడానికి ఉద్దేశించబడిన ప్రశ్నలున్నాయి. దానికి ఒక ఉదాహరణను 48-9 పేజీల్లో చూడవచ్చు. అలాంటి ప్రశ్నలను పేరాలతోపాటు చదవాల్సిన అవసరం లేదు. వాటిని అధ్యయన గుంపుతో పరిశీలిస్తున్నప్పుడు, పైవిచారణకర్త సమయం అనుమతించిన మేరకు, ఉదాహరించబడిన లేఖనాలను చదివించి, చర్చించాలి.
ముందుగా సిద్ధపడడం: అధ్యయనానికి చక్కగా సిద్ధపడడంలో, జవాబులను అండర్లైన్ చేయడం మాత్రమే సరిపోదు. ఉదాహరించబడిన లేఖనాలను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం, వ్యాఖ్యానించేందుకు సిద్ధపడడానికే కాక మరింత ప్రాముఖ్యంగా మన హృదయాలను సిద్ధం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (ఎజ్రా 7:10) వినయంతో వ్యాఖ్యానించడం ద్వారా మనమందరం పరస్పరం ప్రోత్సహించుకోవచ్చు.—రోమా. 1:11, 12.
దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని మనం అధ్యయనం చేయడం యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మనకు సహాయం చేస్తుంది, యథార్థ హృదయులు ఆయనను ఆరాధించడంలో మనతో కలిసేలా వారికి సహాయపడేందుకు మనల్ని సంసిద్ధులను చేస్తుంది. (కీర్త. 95:6; యాకో. 4:8) ఈ చక్కని ఆధ్యాత్మిక ఏర్పాటు నుండి మనమందరం పూర్తిగా ప్రయోజనం పొందుదము గాక.
* “పునఃసమీక్షా చర్చ”ను చేర్చండి.