సేవా కూటాల పట్టిక
జనవరి 10తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసుకోబడిన ప్రకటనలు. జనవరి 15 కావలికోటను, జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఇతర ఆచరణాత్మక ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ఒక ప్రతిపాదనలో సాక్షికాని బంధువుకు పత్రికలను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
15 నిమి: “‘విశ్వాస వాక్యములచేత’ పోషించబడుతున్నాం.”a సమయానుకూలతను బట్టి, ఉదహరించిన లేఖనాలను చదివి, చర్చించండి.
20 నిమి: “మలచుకోవడానికి అనువైన పద్ధతిని ఉపయోగించడానికి ప్రయత్నించండి.” 6వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. ఈ పద్ధతిని ఈ నెల సాహిత్య ప్రతిపాదనలకు ఎలా ఉపయోగించవచ్చో చూపించేందుకు రెండు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. ప్రతి ప్రదర్శనలోను, ఇంటి యజమాని తెలియజేసిన చింతకు సంబంధించిన ఒక లేఖనాన్ని ప్రచారకునితో చదివించండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
జనవరి 17తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: యౌవనులారా—మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నారా? కావలికోట, ఏప్రిల్ 1 2003, 8-10 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం. వాస్తవికమైన, సాధించడానికి సాధ్యమయ్యే కొన్ని లక్ష్యాలను పేర్కొనండి, నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకొమ్మని యువతను ప్రోత్సహించండి.
20 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—5వ భాగం.”b బైబిలు అధ్యయనాలను నిర్వహించడంలో అనుభవజ్ఞుడైన ఒక ప్రచారకుడు ఒక క్రొత్త ప్రచారకునితో 4, 5 పేరాల్లో పేర్కొన్న ఉచ్చులను ఎలా నివారించాలో చర్చించే ఒక ప్రదర్శనను చేర్చండి.
పాట 21 (191), ముగింపు ప్రార్థన.
జనవరి 24తో ప్రారంభమయ్యే వారం
పాట 15 (127)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. “వీసీడీలో వీడియో ప్రోగ్రాములు” బాక్సును క్లుప్తంగా సమీక్షించండి.
10 నిమి: ప్రశ్నా భాగం. ప్రసంగం.
25 నిమి: “సూచించబడిన ప్రతిపాదనలను ఉపయోగించే విధానం.”c ఇచ్చిన ప్రశ్నలను ఉపయోగించండి. ఈ నెల మన రాజ్య పరిచర్యలోని 3-5 పేజీల్లో, మనం అందించబోయే ప్రచురణలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొనండి. సంవత్సరం అంతటా ఉపయోగించేందుకు ఈ పేజీలను భద్రపరచుకోండి. ఆర్టికల్‌ను పరిశీలించిన తర్వాత, ఫిబ్రవరిలో యెహోవాకు సన్నిహితమవండి పుస్తకం ఎలా అందించాలో చర్చించండి. రెండు ప్రతిపాదనలను ప్రదర్శించండి. వాటిని 3వ పేజీలో సూచించిన ప్రతిపాదనల ఆధారంగా లేక స్థానిక క్షేత్రంలో సమర్థవంతంగా ఉండే ఇతర ప్రతిపాదనల ఆధారంగా ప్రదర్శించవచ్చు.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
జనవరి 31తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (221)
10 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. 8వ పేజీలోని సూచనలు (మీ క్షేత్రానికి అనువైనవైతే) ఉపయోగించి, ఫిబ్రవరి 1 కావలికోటను లేక జనవరి-మార్చి తేజరిల్లు!ను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ఇతర వాస్తవిక ప్రతిపాదనలను ఉపయోగించవచ్చు.
15 నిమి: స్థానిక అవసరతలు.
20 నిమి: మీరు ప్రతిదినం లేఖనాలను పరిశోధిస్తున్నారా? ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం—2005 ముందుమాట ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ప్రతీరోజు దినవచనాన్ని, వ్యాఖ్యానాలను పరిశీలించేందుకు అందరూ కొద్ది నిమిషాలు వెచ్చించడంలోని అవసరతను చర్చించండి. దినవచనాన్ని ఎప్పుడు పరిశీలిస్తారు, దానివల్ల ఎలా ప్రయోజనం పొందారు అనే విషయాల గురించి వ్యాఖ్యానించడానికి ఒకరు లేక ఇద్దరిని ముందుగా ఏర్పాటు చేసుకోండి. 2005 సంవత్సరపు వార్షిక వచనాన్ని క్లుప్తంగా చర్చించి ముగించండి.
పాట 28 (224), ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 7తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించేందుకు కొత్తవారికి సహాయం చేయండి. కావలికోట, జూలై 1 2004, 16వ పేజీ, 7-9 పేరాల ఆధారంగా ప్రసంగం. కొత్తవారు క్రీస్తు శిష్యులుగా తయారయ్యేలా సహాయం చేయడంలో సంఘంలోని ప్రతీ సభ్యునికి పాత్ర ఉందనే విషయాన్ని నొక్కిచెప్పండి.
20 నిమి: యెహోవా మేలును చేయక మానడు. (కీర్త. 84:11) పరీక్షలు ఎదురైనా నమ్మకంగా ఉన్న కొందరు సహోదర, సహోదరీలను ఇంటర్వ్యూ చేయండి. వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? వాటిని తట్టుకునేందుకు వారికి ఏమి సహాయం చేసింది? వారు ఎలాంటి ఆనందాలను, ప్రతిఫలాలను అనుభవించారు?
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.