రక్తం ఎక్కించుకోకుండా ఉండేందుకు మనకు సహాయం చేసే నూతన ఏర్పాటు
డ్యూరబుల్ పవర్ ఆఫ్ అటార్ని (DPA) డాక్యుమెంటులోని అవసరమైన ముఖ్యవిషయాలను, అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డును కలిపి ఒకే చట్టబద్ధమైన డాక్యుమెంటుగా తయారు చేసుకోవడాన్ని పరిపాలక సభ ఆమోదించింది, ఆ డ్యాకుమెంటునే మనం DPA కార్డు అని పిలుస్తాం.
DPA కార్డుకు కాలపరిమితి లేదు, మీరు అంతర్జాతీయంగా ప్రయాణించినప్పుడు, అది మీ అభీష్టాలను తెలియజేసే ప్రకటనగా పనిచేస్తుంది. భవిష్యత్తులో, (1) మీ DPA కార్డులో మీ ఇష్టాయిష్టాలు, ఆరోగ్య సంరక్షక ప్రతినిధులు, అడ్రసులు, టెలిఫోను నంబర్లు తదితర విషయాలు మార్చాలనుకున్నప్పుడు, (2) మీ DPA కార్డు పోయినప్పుడు లేదా పాడైనప్పుడు మీరు కొత్త DPA కార్డును పూరించుకోవాలి.
మీరు DPA కార్డు విషయంలో నడిపింపుకోసం ప్రార్థించాలి, దాన్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా పూరించాలి. అయితే ఆ కార్డుమీద సంతకం చేయడానికి ముందు, చట్టపరమైన నియమాలను జాగ్రత్తగా అనుసరించడం ప్రాముఖ్యం. ఉదాహరణకు మీరు సంతకం చేయడాన్ని ఇద్దరు సాక్షులు చూడడం అవసరమని మీ కార్డులో సూచించబడి ఉంటే, మీరు ఆ సాక్షుల సమక్షంలోనే సంతకం చేయాలి. పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు కొత్త కార్డును పూరించని వారికి సహాయమేమైనా అవసరమా అని వారిని తరచూ అడిగి తెలుసుకోవచ్చు.
DPA కార్డు మడతపెట్టడానికి ముందు మీ డాక్టరుకోసం, మీ వ్యక్తిగతమైన రికార్డులకోసం నాణ్యమైన జిరాక్స్ కాపీలను తీయండి. ఇతర కుటుంబ సభ్యులకు, సంఘ కార్యదర్శికి కాపీలను ఇవ్వడానికి మీరు ఇష్టపడుతుండవచ్చు. స్టాండర్డ్ సైజు (8 1/2” x 11”) పేపరుకు ఒక ప్రక్క మాత్రమే మధ్యలో DPA కార్డు వచ్చేలా జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. మీరు DPA కార్డు అసలు ప్రతిని మీ దగ్గర ఉంచుకోవాలి, జిరాక్స్ కాపీని కాదు.
సాక్షులైన తల్లిదండ్రుల బాప్తిస్మం తీసుకొనని పిల్లలకోసం తయారుచేయబడిన 3/99 ముద్రణ తేదీగల ఐడెంటిటి కార్డ్ మారలేదు. ప్రతీ మైనరు పిల్లవాని కార్డును సరైన రీతిలో నింపి, సంతకం చేసి, పిల్లవాడు దానిని సముచిత సమయాలలో తన దగ్గర ఉంచుకొనేలా తల్లిదండ్రులు నిశ్చయపరుచుకోవాలి.
బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులు DPA కార్డులోని, ఐడెంటిటి కార్డులోని భాషను అనుసరించి తమకోసం, తమ పిల్లలకోసం ఆరోగ్య పరిరక్షణ సూచనలను వ్రాసుకోవచ్చు. సంవత్సరంలో కొత్తగా బాప్తిస్మం తీసుకున్న వారందరికీ కార్యదర్శి DPA కార్డును ఇవ్వాలి.