ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. లేదా ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి. జనవరిలో: పసుపుపచ్చగా మారే లేక రంగు వెలిసిపోయే పేపరుపై ముద్రించబడిన 192 పేజీ పుస్తకాలు ఏవైనా లేదా 1990కి ముందు ప్రచురించబడిన పుస్తకాలేవైనా ప్రతిపాదించవచ్చు. అలాంటి పాత పుస్తకాలు స్టాకులేని సంఘాలు దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) లేదా కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించాలి. ఈ ప్రచురణ అందుబాటులోలేని సంఘాలు ప్రత్యామ్నాయంగా సృష్టి (పెద్దసైజు లేదా చిన్నసైజు) (ఆంగ్లం) లేదా ప్రకటన ముగింపు! అనే పుస్తకాలను ప్రతిపాదించవచ్చు. మార్చి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదిస్తూ గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించడానికి ప్రయత్నించండి.
◼ 2006వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్ 12, బుధవారం సూర్యాస్తమయం తర్వాత అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తున్నట్లయితే, సహోదరులు అందుబాటులో ఉన్న ఇతర హాళ్ళను రిజర్వు చేసుకోవడానికి లేక కాంట్రాక్టులు తీసుకోవడానికి వీలుగా ఈ తేదీ ఇంత ముందుగా తెలియజేయబడుతోంది. జ్ఞాపకార్థ ఆచరణ ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా ఆ భవనంలోని ఇతర కార్యకలాపాలవల్ల భంగంవాటిల్లకుండా ఉండేందుకు పెద్దలు హాలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవాలి.
◼ జ్ఞాపకార్థ ఆచరణకున్న ప్రాముఖ్యత దృష్ట్యా, ఆ సందర్భంలో ప్రసంగం ఇవ్వడానికి పెద్దలసభ ప్రతి సంవత్సరం ఒకే సహోదరుణ్ని ఎంపిక చేసుకునే బదులు లేదా తామే వంతులవారీగా ఇస్తూ ఉండే బదులు మరింత యోగ్యులైన పెద్దలలో ఒకరిని ఎంపికచేసుకోవాలి. అభిషిక్తుడైన పెద్ద ప్రసంగం ఇచ్చే స్థితిలో ఉంటే ఆయననే ఎంపిక చేసుకోవాలి.
◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:
వాచ్‌టవర్ పబ్లికేషన్ ఇండెక్స్ 2003—ఆంగ్లం
నా బైబిలు కథల పుస్తకము (చిన్న సైజు)—ఆంగ్లం, మలయాళం
యెహోవాకు స్తుతి గీతాలు పాడండి (29 పాటలతో)—గుజరాతీ
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (కరపత్రం నం. 15)—ఖాసి
మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (కరపత్రం నం. 16)—ఖాసి
కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (కరపత్రం నం. 21)—ఖాసి
మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? (కరపత్రం నం. 26)—కొంకణి (రోమన్ లిపి), ఖాసి
◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:
దేవుని కోసం మానవజాతి అన్వేషణ—ఆంగ్లం
నా బైబిలు కథల పుస్తకము (చిన్న సైజు)—తెలుగు
నా బైబిలు కథల పుస్తకము (పెద్ద సైజు)—తమిళం
మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?—నేపాలీ
జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు?—హిందీ