రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది అనే వీడియోనుండి ప్రయోజనం పొందండి
రక్తరహిత చికిత్స చేసే వైద్యరంగంలో అందుబాటులో ఉన్న ఎంపికల గురించి మీకు ఎంతవరకు తెలుసు? రక్తమార్పిడికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఏమిటో మీరు అర్థం చేసుకున్నారా, అవి ఎలా పని చేస్తాయో మీకు తెలుసా? ఈ వీడియోను చూసి, ఈ క్రింది ప్రశ్నలతో మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి.—గమనిక: ఈ వీడియోలో శస్త్ర చికిత్సకు సంబంధించిన క్లుప్త దృశ్యాలు ఉన్నాయి కాబట్టి తమ చిన్నపిల్లలు ఆ వీడియో చూడాలా వద్దా అనేది నిర్ణయించుకోవడానికి తల్లిదండ్రులు తమ వివేచన ఉపయోగించాలి.
(1) యెహోవాసాక్షులు రక్తమార్పిడులను నిరాకరించడానికి ముఖ్య కారణం ఏమిటి, బైబిల్లో ఆ సూత్రం ఎక్కడుంది? (2) చికిత్స విషయానికొచ్చేసరికి మనం ఏమి కోరుకుంటాం? (3) రోగులకు ఏ ప్రాథమిక హక్కు ఉంది? (4) రక్తమార్పిడులను నిరాకరించడం తెలివైన, బాధ్యతాయుతమైన నిర్ణయమని ఎందుకు అనవచ్చు? (5) రక్తం విపరీతంగా కోల్పోయిన సందర్భంలో, డాక్టర్లు మొట్టమొదటగా చేసే రెండు అత్యవసరమైన పనులు ఏమిటి? (6) రక్తమార్పిడులలో ఆరోగ్యానికి హాని కలిగించేవి ఏమిటి? (7) ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఎక్కువగా కోల్పోకుండా ఉపయోగించేందుకు శస్త్ర చికిత్సకులకు అందుబాటులో ఉన్న కొన్ని పరికరాలు ఏమిటి? (8) రక్తమార్పిడికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉపయోగిస్తున్నప్పుడు దాని గురించి మీరు ఏమి తెలుసుకోవాలి? (9) రక్తమార్పిడులు లేకుండా సంక్లిష్టమైన, పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసే అవకాశముందా? (10) యెహోవాసాక్షుల కోసం ఏమి చేయడానికి చాలామంది వైద్యులు సుముఖంగా ఉన్నారు, రోగులందరి సంక్షేమం కోసం చివరికి ఏది ఒక ప్రమాణం కావచ్చు?
వీడియోలో చూపించిన ఎలాంటి చికిత్సనైనా స్వీకరించడం వ్యక్తిగతంగా, మనస్సాక్షిపూర్వకంగా తీసుకోవలసిన నిర్ణయం.—జూన్ 15, 2004, కావలికోట, 22-4 పేజీలు, 29-31 పేజీలు, అక్టోబరు 15, 2000, కావలికోట, 30-1 పేజీలు చూడండి.