దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2004 డిసెంబరు 27వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2004 నవంబరు 1 నుండి డిసెంబరు 27 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. ఒక విషయంపై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తించాలంటే శ్రేష్ఠమైన ఒక మార్గమేమిటి? [be 218వ పేజీ, 3వ పేరా]
2. సమర్థవంతమైన ముగింపుయొక్క ఐదు లక్షణాలు పేర్కొనండి. [be 220వ పేజీ, 4వ పేరా-221వ పేజీ, 4వ పేరా]
3. చెబుతున్న వివరాలు ఖచ్చితమైనవిగా ఉన్నాయని ఎలా నిశ్చయపరచుకోవచ్చు? [be 224వ పేజీ, బాక్సు]
4. కూటాల్లో మనమందించే సమాచారం ‘సత్యమునకు స్తంభముగా ఆధారముగా’ సంఘానికున్న పాత్రకు ఎంతో విలువిస్తున్నట్లు మనం ఎలా నిశ్చయపరచుకోవచ్చు? (1 తిమో. 3:15) [be 224వ పేజీ, 1-4 పేరాలు]
5. ఇటీవలి సంఘటనలు, ఉల్లేఖనాలు, అనుభవాలకు సంబంధించి మనం సామెతలు 14:15ను ఎలా అన్వయించుకోవచ్చు? [be 225వ పేజీ, 1వ పేరా]
ఒకటవ నియామకం
6. జలప్రళయం నుండి ఆదాము సృష్టి వరకున్న కాలాన్ని వెనక్కి ఎలా లెక్కించవచ్చు? [si 286వ పేజీ, 12వ పేరా]
7. యేసు పరిచర్య ఆరంభించిన తేదీని ఎలా నిర్ధారించవచ్చు, అలాగే ఆ పరిచర్య మూడున్నర సంవత్సరాలు మాత్రమే కొనసాగిందని నమ్మడానికి ఎలాంటి ఆధారముంది? [si 291వ పేజీ, 16వ పేరా]
8. (ఎ) “యెరూషలేమును మరల కట్టించవచ్చునని ఆజ్ఞ” ఎప్పుడు బయలుదేరింది? (బి) అప్పటి నుండి యేసు మెస్సీయాగా వచ్చే సమయం వరకు ఎన్ని సంవత్సరాలు గడుస్తాయి? (దాని. 9:24-27) [si 291వ పేజీ, 18, 19 పేరాలు]
9. ‘మన సహోదరునితో సమాధానపడేలా’ యథార్థంగా క్షమాపణ చెప్పడంలో ఏమి ఇమిడివుంది? (మత్త. 5:23, 24) [w02 11/1 6వ పేజీ, 1, 5 పేరాలు]
10. దేవుడు అప్పగించిన పనులు నెరవేర్చడం గురించి 2 రాజులు 13:18, 19 మనకేమి బోధిస్తోంది? [w02 12/1 31వ పేజీ, 1, 2 పేరాలు]
వారపు బైబిలు పఠనం
11. ఇశ్రాయేలీయులు రక్తం కార్చబడని చనిపోయిన జంతువును తాము తినకపోయినప్పటికీ, దానిని పరదేశికి ఎందుకు ఇవ్వవచ్చు లేదా అన్యునికి ఎందుకు అమ్మవచ్చు? (ద్వితీ. 14:21)
12. ద్వితీయోపదేశకాండము 20:5-7లో మనకు ఏ పాఠముంది?
13. “తిరుగటినైనను తిరగటిమీద దిమ్మనైనను” తాకట్టు పట్టడం, “జీవనాధారమును” తాకట్టు పట్టినట్లే అని ఎందుకు చెప్పబడింది? (ద్వితీ. 24:6)
14. ఇశ్రాయేలీయులకు క్రొవ్వు తినకూడదని ఆజ్ఞాపించబడింది కాబట్టి, వారు “గొఱ్ఱెపిల్లల క్రొవ్వు” తినడం అంటే అర్థమేమిటి? (ద్వితీ. 32:13, 14)
15. ఆకాను చేసిన పాపానికి ఏది ఆధునిక సమాంతరంగా ఉంది? (యెహో. 7:1-26) [w86 12/15 20వ పేజీ, 20వ పేరా]