సేవా కూటాల పట్టిక
డిసెంబరు 13తో ప్రారంభమయ్యే వారం
పాట 11 (85)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. వచ్చే వారం జరిగే చర్చకు సిద్ధపడేందుకు రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) అనే వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి. డిసెంబరు 25, జనవరి 1 కోసం చేయబడిన ప్రత్యేక క్షేత్ర సేవ ఏర్పాట్లను వివరించండి. అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, డిసెంబరు 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించడానికి 8వ పేజీలోని సూచనలు (మీ సేవా ప్రాంతానికి అనువైనవైతే) ఉపయోగించండి. ఇతర ఆచరణాత్మక ప్రతిపాదనలను కూడా ఉపయోగించవచ్చు. ప్రతీ ప్రదర్శనలోనూ, “మీరు చేసే పని నాకు బాగా తెలుసు” అంటూ సంభాషణను ఆటంకపరిచే వారితో వేరు వేరు విధాలుగా ఎలా వ్యవహరించాలో చూపించండి.—సంభాషణను ఆటంకపర్చే వారికి మీరెలా ప్రత్యుత్తరమివ్వవచ్చును బుక్లెట్లోని 13వ పేజీ చూడండి.
15 నిమి: “మీ సహాయం అవసరం.”a ఒక పెద్దను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. సంఘంలో సేవ చేసేందుకు ముందుకు రావడానికి ఆయనను ప్రోత్సహించిందేమిటో, పెద్దగా నియమించబడడానికి కావలసిన అర్హతలను సంపాదించుకోవడానికి ఆయనకు సహాయం చేసిందేమిటో వివరించమనండి.
20 నిమి: “బంధువులకు ఎలా సాక్ష్యమివ్వాలి?”b ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. బంధువులలో ఎలా ఆసక్తి రేకెత్తించి, వారికి తాము ఎలా సాక్ష్యమిచ్చారో క్లుప్తంగా వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
పాట 7 (51), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 20తో ప్రారంభమయ్యే వారం
పాట 23 (200)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “దైవపరిపాలనా పరిచర్య పాఠశాల మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది.” పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. అక్టోబరు 2004 మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్లోని వ్యాఖ్యానాలను చేర్చండి. పాఠశాలనుండి తామెలా ప్రయోజనం పొందుతున్నారనే అంశంమీద వ్యాఖ్యానించేందుకు ఒకరిని లేక ఇద్దరిని ముందుగా ఏర్పాటు చేసుకోండి.
25 నిమి: “రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది అనే వీడియోనుండి ప్రయోజనం పొందండి.” 3వ పేజీలో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించి రక్త రహిత చికిత్స వీడియోమీద ప్రేక్షకులతో చర్చ. ఆ తర్వాత ఆఖరి పేరాను చదవండి. రక్తం ఎక్కించుకోకుండా ఉండేందుకు మనకు సహాయపడేలా చేయబడిన నూతన ఏర్పాటు గురించి వచ్చే వారం జరగబోయే చర్చకు అందరూ హాజరవ్వాలని ప్రోత్సహించండి.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 27తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. డిసెంబరు క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తుచేయండి. 8వ పేజీలోని సూచనలు (మీ సేవా ప్రాంతానికి అనువైనవైతే) ఉపయోగించి, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను లేక జవవరి 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
25 నిమి: రక్తాన్ని విసర్జించమని దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడడం. బ్రాంచి కార్యాలయం పంపిన ప్రతిని ఉపయోగించి పెద్ద ఇచ్చే ప్రసంగం. ప్రసంగం ప్రారంభంలో, DPA కార్డులు ఈ రాత్రే నింపకూడదని తెలియజేయండి. ప్రసంగీకుడు వ్రాత ప్రతిని చదువుతున్నప్పుడు కీలకమైన అంశాలను నొక్కి చెప్పేందుకు క్లుప్తమైన వ్యాఖ్యానాలను చేర్చవచ్చు కానీ సమాచారానికి అనుబంధంగా అదనపు ఉదాహరణలు లేక లేఖనాలు చేర్చకూడదు. సమయం అనుమతించిన మేరకు, ఉల్లేఖించబడిన లేఖనాలను చదవవచ్చు లేక ఉదహరించవచ్చు. సముచితమైన అంశాలవద్ద, “రక్తం ఎక్కించుకోకుండా ఉండేందుకు మనకు సహాయం చేసే నూతన ఏర్పాటు” బాక్సులోని వాక్యాలవైపు అవధానం మళ్ళించండి. ఈ భాగం నిర్వహించబడుతున్నప్పుడు చూసుకోవడానికి వీలుగా, కార్యదర్శి బాప్తిస్మం పొందిన ప్రచారకులందరికీ DPA కార్డుతో పాటు “DPA కార్డును పూరించడానికి సూచనలు” ఇవ్వాలి. అలాగే సరిపోయేన్ని ఐడెంటిటి కార్డులు ఉండేలా కూడా కార్యదర్శి నిశ్చయపరచుకోవాలి.
10 నిమి: మీ మనస్సాక్షి పాత్ర. జూన్ 15, 2004 కావలికోట, 23-4 పేజీలు, 16-19 పేరాల ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. మనస్సాక్షి విషయంలో మనం తీసుకోవలసిన నిర్ణయాలు, యెహోవాతో మన సంబంధం ముడిపడి ఉన్నాయి కాబట్టి, అలాంటి నిర్ణయాలు గంభీరమైనవని నొక్కి చెప్పండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
జనవరి 3తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జనవరిలో ప్రతిపాదించవలసిన సాహిత్యం గురించి ప్రస్తావించండి.
20 నిమి: “ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం—4వ భాగం. ఒకటవ పేరా ఆధారంగా నిమిషం కంటే ఎక్కువ తీసుకోని ఉపోద్ఘాతం చెప్పిన తరువాత, 2-3 పేరాల ఆధారంగా, అధ్యయనంకోసం ఎలా సిద్ధపడాలో ఒక బైబిలు అధ్యయన నిర్వాహకుడు విద్యార్థికి చూపించే ఐదు నిమిషాల ప్రదర్శనను చూపించండి. ప్రదర్శనకోసం జ్ఞానము పుస్తకంలోనుండి లేక దేవుడు కోరుతున్నాడు బ్రోషురులోనుండి ఒక పేరాను ఉపయోగించండి. ప్రదర్శనలోనుండి కీలకమైన అంశాలను ఉన్నతపరుస్తూ 2-5 పేరాలను ప్రశ్నాజవాబుల రూపంలో చర్చించండి.
15 నిమి: “సమావేశ కార్యక్రమాలను పునఃసమీక్షించడానికి నూతన ఏర్పాటు.” 4వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. రాబోయే ప్రాంతీయ, ప్రత్యేక దిన సమావేశ కార్యక్రమాల తేదీలు తెలిసినట్లయితే వాటిని పేర్కొనండి. బాప్తిస్మం తీసుకోవాలనుకునే వారు ముందుగానే సంఘపైవిచారణకర్తకు తెలపాలి.
పాట 20 (93), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.