బైబిలును సమర్థవంతంగా ఉపయోగించండి
1. క్షేత్ర పరిచర్యకు సిద్ధపడేందుకు మీరేమి చేయవచ్చు?
1 పరిచర్యలో మనం ఏ సాహిత్యాలు అందించాలనుకున్నా వినేవారితో పంచుకునేందుకు, ఆలోచన రేకెత్తించే ఒక లేఖనాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. (హెబ్రీ. 4:12) మీరు అందించే సాహిత్యంలోని లేఖనాన్ని ఎంచుకోవడం ఆ సాహిత్యాన్ని సమర్థవంతంగా అందించడానికి దోహదపడుతుంది. లేఖనాన్ని ఉపయోగించడం ద్వారా వినేవారి హృదయాలపై దేవుని వాక్యం ప్రభావం చూపేలా అనుమతించిన వారమవుతాం. క్రైస్తవేతర మతాల్లోని ప్రజలతోపాటు క్రైస్తవులను ఇష్టపడని వారు కూడా సాధారణంగా బైబిలును గౌరవిస్తారు.
2. (ఎ) మనం మన ప్రతిపాదనను ఒక లేఖనంతో ఎలా ఆరంభించవచ్చు? (బి) క్షేత్రంలోని ప్రజలకు ఏ లేఖన అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి?
2 లేఖనంతో ఆరంభించండి: కొందరు ప్రచారకులు తాము చదవాలనుకున్న బైబిలు వచనానికి సంబంధించి సులభంగా ఉండే, దృక్పథాన్ని రాబట్టే ప్రశ్న వేయడంతో తమ ప్రతిపాదన ఆరంభిస్తారు. ఇది వెంటనే వారి దృష్టిని దేవుని వాక్యంవైపు మళ్లిస్తుంది. ఈ క్రింది ఉపోద్ఘాతాల్లో కొన్ని మీ క్షేత్రంలో సమర్థవంతంగా ఉంటాయా?
◼ “ఇలాంటి మార్పులు తీసుకురాగల శక్తి మీకుంటే మీరు చేస్తారా?” ప్రకటన 21:4 చదవండి.
◼ “మనం ఇలాంటి అపాయకరమైన కాలాల్లో ఎందుకు జీవిస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?” 2 తిమోతి 3:1-5 చదవండి.
◼ “ఈ సూత్రాన్ని ప్రతీ ఒక్కరూ అనుసరిస్తే మన సమాజంలో పరిస్థితులు బాగుంటాయని మీరు అనుకుంటున్నారా?” మత్తయి 7:12 చదవండి.
◼ “ప్రస్తుతమున్న కష్ట పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడ వర్ణించబడిన పరిస్థితులను మీ పిల్లలు అనుభవిస్తారని మీరు అనుకుంటున్నారా?” కీర్తన 37:10, 11 చదవండి.
◼ “ఈ లోకంలో వ్యాధులు, అస్వస్థత విస్తరిస్తుండగా, ఈ మాటలు నిజమయ్యే రోజు వస్తుందని మీరనుకుంటున్నారా?” యెషయా 33:24 చదవండి.
◼ “ఇక్కడ పేర్కొనబడిన ప్రభుత్వ మార్పిడి గురించి మీరెప్పుడైనా విన్నారా?” దానియేలు 2:44 చదవండి.
◼ “మీరు దేవుడ్ని ఈ ప్రశ్న ఎప్పుడైనా అడగాలనుకున్నారా?” యోబు 21:7 చదవండి.
◼ “చనిపోయిన మన ప్రియమైన వారిని మళ్ళీ చూడడం సాధ్యమవుతుందా?” యోహాను 5:28, 29 చదవండి.
◼ “బ్రతికివున్న వారు ఏమిచేస్తున్నారో చనిపోయిన వారికి తెలుస్తుందా?” ప్రసంగి 9:5 చదవండి
3. మనం చదివే బైబిలు వచనాలు ప్రజలు అర్థం చేసుకొనేలా వారికి మనమెలా సహాయం చేయవచ్చు?
3 వివరించి, ఉదహరించి, అన్వయించండి: ఒక వ్యక్తి సంభాషించడానికి ఇష్టపడితే, చర్చను హడావిడిగా ముగించవద్దు. మీరు చదివిన లేఖనం ఆ వ్యక్తి అర్థం చేసుకొనేలా దానిని వివరించడానికి, ఉదహరించడానికి, అన్వయించడానికి సమయం తీసుకోండి. (నెహె. 8:8) దేవుని వాక్యం చెబుతున్నది ప్రజలు అర్థం చేసుకొని అంగీకరించినప్పుడు, అది వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురాగలదు.—1 థెస్స. 2:13.
4. పునర్దర్శనాలు చేసేటప్పుడు మనం బైబిలును సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చు?
4 మీరు ఒక వ్యక్తిలో ఆసక్తిని పెంపొందిస్తూ బైబిలును మరింత సమర్థవంతంగా ఉపయోగించండి. పునర్దర్శనాలు చేసేటప్పుడు కూడా మీరు ఈ పద్ధతినే ఉపయోగించవచ్చు: (1) సముచితమైన లేఖనం ఎన్నుకోండి. (2) ఆ వచనానికి సంబంధించి సులభమైన, దృక్పథాన్ని రాబట్టే ప్రశ్న వేయండి. తర్వాత ఆ వచనాన్ని చదవండి. (3) వివరించండి, ఉదహరించండి, దానిని అన్వయించండి. మీరు సందర్శించిన ప్రతీసారి దేవుని వాక్యానికి సంబంధించి ఆ వ్యక్తి పరిజ్ఞానాన్ని ఇనుమడింపజేయడానికి కృషిచేయండి. అలాచేస్తే మీరు త్వరలోనే ఒక బైబిలు అధ్యయనం నిర్వహించడం ఆరంభిస్తారు!