మనం యెహోవా అధికారాన్ని గౌరవించాలి
ప్రాచీనకాల కోరహు, దాతాను, అబీరాము అనే పేర్లు వినగానే మీకేమి గుర్తొస్తుంది? తిరుగుబాటు స్వభావమే కదా! వాళ్లు దేనికి విరుద్ధంగా తిరుగుబాటు చేశారు? దేవుని అధికారానికి విరుద్ధంగానే కదా! వారి చెడుతనానికి సంబంధించిన వివరాలు సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి, వాటి సంగ్రహ సమీక్ష ఆగస్టు 1, 2002 కావలికోటలోని “దైవిక అధికారానికి యథార్థంగా లోబడండి” అనే ఆర్టికల్లో ఇవ్వబడింది. ఆ సమాచారం చదివి, తర్వాత దాన్ని స్పష్టంగా చిత్రీకరించిన యెహోవా అధికారాన్ని గౌరవించండి (ఆంగ్లం) అనే వీడియోను చూడడం ప్రయోజనకరంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు. అందులో కోరహు విశ్వాసులైన కుమారులకు, విశ్వ సర్వాధిపతితో ఢీకొనే పరిస్థితికి వచ్చిన తిరుగుబాటుదారుడైన వారి తండ్రికి మధ్య వృద్ధిచెందిన పోరును మీరు చూస్తారు. (సంఖ్యా. 26:9-11) ఈ నిజ జీవిత సంఘటనలు మనం యెహోవా పట్ల మరింత సంపూర్ణంగా విశ్వసనీయతను వృద్ధి చేసుకోవడానికి మనందరిని ప్రేరేపించాలి.
ఈ వీడియోను మీరు చూస్తుండగా, కోరహు అతని తోటి తిరుగుబాటుదారులు విశ్వాస్యతా పరీక్షలో ఆరు కీలకమైన రంగాల్లో విఫలమయ్యారనేదాని రుజువు కోసం చూడండి: (1) వాళ్ళు దేవుని అధికారాన్ని ఎలా అవమానించారు? (2) అహంకారం, అత్యాశ, అసూయ వంటి లక్షణాలు తమపై ప్రభావం చూపడానికి వారెలా అనుమతించారు? (3) యెహోవా నియమించిన వారి అసంపూర్ణతల మీదే వారెలా దృష్టినిలిపారు? (4) వారెలాంటి ఫిర్యాదుచేసే స్వభావాన్ని వృద్ధి చేసుకున్నారు? (5) వారు తమకున్న సేవాధిక్యతల పట్ల ఎందుకు అసంతృప్తి పెంచుకున్నారు? (6) దేవుని పట్ల విశ్వాస్యత కంటే స్నేహితులకు, కుటుంబానికే వారెలా ప్రాధాన్యత ఇచ్చారు?
ఈ బైబిలు నాటకంలో మనం నేర్చుకున్న పాఠాలు నేడు దేవుని అధికారం పట్ల మన వ్యక్తిగత దృక్కోణానికి ఎలా అన్వయిస్తాయో ఆలోచించండి: (1) సంఘ పెద్దల నిర్ణయాలకు మనమెలా ప్రతిస్పందించాలి, ఎందుకు? (2) మనలో అనుచిత ఉద్దేశాలుంటే వాటిని మనం ఎలా అధిగమించవచ్చు? (3) సారథ్యం వహించడానికి నియమించబడిన వారి అపరిపూర్ణతల పట్ల మనమెలా స్పందించాలి? (4) మన హృదయాల్లో ఫిర్యాదుచేసే స్వభావం ఆరంభమైతే మనమేమి చేయాలి? (5) మనకు ఇవ్వబడిన ఏ ఆధిక్యతలనైనా మనమెలా దృష్టించాలి? (6) దేవుని పట్ల మన విశ్వాస్యతకంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇది ఎప్పుడు మనకు కష్టభరితమైన పరీక్ష కావచ్చు?
ఈ సమాచారం సంఘంలో చర్చించబడిన తర్వాత, ఈ వీడియోను మళ్లీ ఒకసారి ఎందుకు చూడకూడదు? ఎల్లప్పుడూ యెహోవా అధికారాన్ని గౌరవించడానికిగల కారణాలను మీ మదిలో మరింత బలంగా నాటుకోనివ్వండి.—కీర్త. 18:25; 37:28.