కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/04 పేజీ 4
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2002
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 9/04 పేజీ 4

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“జీవితంలోని విషాదకర సంఘటనలు ఎదురైనప్పుడు చాలామంది దేవునిపై కోపం తెచ్చుకుంటారు. మీరెప్పుడైనా అలా కోపం తెచ్చుకున్నారా లేక అలా కోపం తెచ్చుకున్నవారెవరైనా మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి.] అలా కోపం తెచ్చుకోవడం దేవుని జ్ఞానాన్ని ప్రేమను పరిగణలోనికి తీసుకోదు. [యాకోబు 1:13, 17 చదవండి.] తేజరిల్లు! పత్రికలోని ఈ ఆర్టికల్‌ దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడో వివరిస్తోంది.”

కావలికోట సెప్టెం. 15

“ప్రఖ్యాతిగాంచిన ప్రార్థనలోని ఈ మాటలు బహుశా మీరు వినే ఉంటారు లేదా మీ సొంత ప్రార్థనల్లో వీటిని ఉపయోగించే ఉంటారు. [మత్తయి 6:10 చదవండి.] ఈ భూమిపై దేవుని చిత్తం పూర్తిగా నెరవేరినప్పుడు జీవితమెలా ఉంటుందని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] మనం ఇప్పుడు చదివిన భాగంతోపాటు ఆ ప్రఖ్యాతి గాంచిన పరలోక ప్రార్థనలోని ప్రతీ భాగానికున్న లోతైన భావాన్ని కూడా ఈ పత్రిక పరిశీలిస్తుంది.”

తేజరిల్లు! జూలై-సెప్టెం.

“అత్యుత్తమ వైద్య పరిశోధనల మధ్యనూ, అంటువ్యాధులు లక్షలాదిమందిని భయభ్రాంతుల్ని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దేవునికి మానవాళి ఆరోగ్యం విషయంలో శ్రద్ధవుందని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత యెషయా 25:8 చదవండి.] దేవునికి శ్రద్ధవుందనీ, వ్యాధులకు అంతాన్ని, వ్యాధులు వ్యాపించడానికి కారణమవుతున్న కరవు, బీదరికం, యుద్ధం వంటివాటిని తీసివేయబోతున్నాడనీ ఈ పత్రిక వివరిస్తోంది.”

కావలికోట అక్టో. 1

“నేరం, హింస, యుద్ధంవంటివి లేకుండా పోవడాన్ని మనమెందుకు చూడలేకపోతున్నామో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ మాటల్లో వర్ణించబడినట్లుగా ఈ లోకం ఎప్పటికైనా మారుతుందని మీరనుకుంటున్నారా? [కీర్తన 37:11 చదవండి, ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] మానవాళి పట్ల దేవుని ఆది సంకల్పానికి ఈ వాగ్దానం ఎలా ముడిపడి ఉంది, దానిలో మనమెలా పాలు పంచుకోవచ్చు అనే వాటిని గురించిన చక్కని సమాచారం ఈ పత్రికలో ఉంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి