కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/04 పేజీ 1
  • మీ కంటిని తేటగా ఉంచుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కంటిని తేటగా ఉంచుకోండి
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ కన్ను తేటగా ఉందా?
    మన రాజ్య పరిచర్య—2010
  • “కంటికి కన్ను” అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ప్రత్యేక సమావేశదిన పునఃసమీక్ష
    మన రాజ్య పరిచర్య—2005
  • క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 9/04 పేజీ 1

మీ కంటిని తేటగా ఉంచుకోండి

1. కంటిని తేటగా ఉంచుకోవడమంటే ఏమిటి, ఇది ఎందుకు ప్రాముఖ్యం?

1 అలంకారార్థ లేదా ఆధ్యాత్మిక కన్ను మన యావత్‌ జీవితంపై అపరిమిత ప్రభావం చూపించగలదని యేసు కొండమీద తాను ఇచ్చిన ప్రసంగంలో నొక్కిచెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును.” (మత్త. 6:22, 23) తేటగా ఉండే కన్ను ఒకే విషయంపై అంటే భౌతిక విషయాల గురించిన అనవసర చింతతో దారి తప్పడానికి బదులు దేవుని చిత్తం చేయడం పైనే దృష్టి నిలుపుతుంది. (మత్త. 6:19-21, 24-33) కంటిని తేటగా ఉంచుకోవడానికి మనకు ఏది సహాయం చేయవచ్చు?

2. భౌతిక వస్తువుల విషయంలో దేవుని వాక్యం ఎలాంటి దృక్కోణాన్ని ప్రోత్సహిస్తోంది?

2 తృప్తిని అలవరచుకోవడం: కుటుంబ పోషణకు అవసరమైనవి తగినంతగా సమకూర్చడం లేఖనాధారమైన బాధ్యత. (1 తిమో. 5:8) అంతమాత్రాన, శ్రేష్ఠమైన, అత్యాధునికమైన వస్తువుల అనంత అన్వేషణలో మునిగిపోవలసిన అవసరం లేదు. (సామె. 27:20; 30:8, 9) బదులుగా, జీవితానికి అవసరమైన ‘అన్నవస్త్రాలతో’ తృప్తి కలిగివుండమని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. (1 తిమో. 6:7-8; హెబ్రీ. 13:5, 6) ఈ ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం మనం సరైనవాటిపై దృష్టి కేంద్రీకరించడానికి సహాయం చేయవచ్చు.

3. స్వయంగా నెత్తిన వేసుకునే భారాలకు దూరంగా ఉండడానికి మనకేది సహాయం చేయవచ్చు?

3 భారమయ్యే అనవసరమైన అప్పులు చేయకుండా, ఎక్కువ సమయాన్నీ, శ్రద్ధనూ తీసుకునే వస్తుసంపద కోసం తాపత్రయ పడకుండా ఉండడం జ్ఞానయుక్తం. (1 తిమో. 6:9, 10) దీనిని మనమెలా చేయవచ్చు? ఏదైనా చేయాలని ఆలోచించేటప్పుడు, ప్రార్థనా పూర్వకంగా దాని గురించి ఆలోచించి, ఆధ్యాత్మిక పనులకు అది ఆటంకం కలిగిస్తుందేమో నిజాయితీగా పరిశీలించుకోండి. ఆధ్యాత్మిక విషయాలకు మీ జీవితంలో ప్రథమస్థానం ఇవ్వాలని తీర్మానించుకోండి.​—ఫిలి. 1:9-10; 4:6, 7.

4. మన జీవన శైలిని నిరాడంబరంగా ఉంచుకునే మార్గాలకై మనమెందుకు చూడాలి?

4 మీ జీవనశైలిని నిరాడంబరంగా ఉంచుకోండి: ఐశ్వర్యాసక్తి ఆకర్షణను ఎదిరించడానికి మరో మార్గం మీ జీవన శైలిని నిరాడంబరంగా ఉంచుకోవడమే. ఎక్కువ వస్తువులు లేకుండానే తన కుటుంబం సర్దుకుపోగలదని గ్రహించిన ఒక సహోదరుడు ఇలా చెప్పాడు: “నా సహోదరులకు సేవచేయడానికి సంఘంలో నేనిప్పుడు ఎంతో చేయగలను. స్వంత ఇష్టానికి బదులు సత్యారాధనకు ప్రథమస్థానం ఇస్తే యెహోవా తన సేవకులందరినీ ఆశీర్వదిస్తాడని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.” మీ జీవన శైలిని నిరాడంబరంగా ఉంచుకోవడం ద్వారా మరిన్ని ఆశీర్వాదాలు అనుభవించే అవకాశం మీకుందా?

5. మన కంటిని తేటగా ఉంచుకోవడానికి నిరంతర కృషి ఎందుకు అవసరం?

5 సాతాను ప్రభావాన్ని, ఐశ్వర్యాసక్తితో కూడిన అతని లోకాన్ని, మన అపరిపూర్ణ శరీరాన్ని ఎదిరించడానికి నిరంతర కృషి అవసరం. మన కళ్లు దారి తప్పడానికి అనుమతించే బదులు, వాటిని మనం దేవుని చిత్తం చేయడంపై, విలువైన నిత్యజీవ నిరీక్షణపై కేంద్రీకరిద్దాం.​—సామె. 4:25; 2 కొరిం. 4:18.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి