కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/04 పేజీ 1
  • బ్రాంచి ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బ్రాంచి ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • విస్తృతి కొనసాగడం రాజ్యమందిరాల అవసరతను పెంచుతుంది
    మన రాజ్య పరిచర్య—1994
  • రాజ్య మందిర నిర్మాణ అవసరతను పూర్తిచేయడం
    మన రాజ్య పరిచర్య—1997
  • రాజ్యమందిర నిర్మాణం —పరిశుద్ధసేవలో ఒక ప్రాముఖ్యమైన అంశం
    మన రాజ్య పరిచర్య—2006
  • ప్రేమ, నమ్మకం, విధేయతలకు నిదర్శనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మన రాజ్య పరిచర్య—2004
km 9/04 పేజీ 1

బ్రాంచి ఉత్తరం

ప్రియమైన రాజ్య ప్రచారకులకు:

తమిళనాడులో నిషేధం ఎత్తివేయబడినందుకు ఇండియాలోని సహోదరులందరూ ఎంతో సంతోషించారు. అక్కడి సహోదరులకు గత కొద్ది సంవత్సరాలుగా క్షేత్ర సేవలో, అధికారులను కలిసే విషయంలో సరైన విధానం అవలంబించడానికి శిక్షణ ఇవ్వబడింది. (1 పేతు. 3:15) యాంత్రికంగా మాట్లాడే బదులు, ఆసక్తిని వివేచనను సమపాళ్లలో ఉపయోగిస్తూ, ఒప్పింపజేసేలా తర్కించడంవల్ల సువార్త సేవలో చక్కని ఫలితాలు వచ్చాయి.​—సామె. 16:21, 23.

ఇతర దేశాల్లోనూ మన సహోదరులు కార్యాభివృద్ధికి సిద్ధపడుతున్నారు. అమెరికాలోని వాల్‌కిల్‌లో గంటకు 90,000 పత్రికలు ఉత్పత్తి చేయగల రెండు కొత్త ముద్రణా యంత్రాలతో పాటు, నిమిషానికి 120 గట్టి అట్టగల పుస్తకాలు తయారుచేయగల కొత్త యంత్రాలు కూడా నెలకొల్పబడ్డాయి. బ్రూక్లిన్‌లో, 360 ఫర్‌మ్యాన్‌ వీధిలో ఉన్న బిల్డింగ్‌లోని ముద్రణా యంత్రాలను వాల్‌కిల్‌కు మార్చడంతో ఆ బిల్డింగ్‌ అమ్మివేయబడింది.

ఇండియాలో, జ్ఞాపకార్థ ఆచరణ జరిగిన నెలలు ఆసక్తితో కూడిన కార్యాభివృద్ధి నెలలుగా నిరూపించబడ్డాయి. ఏప్రిల్‌ నెలలో మొత్తం 2,368 మంది సహాయ పయినీరు సేవచేయగా, శిఖరాగ్ర సంఖ్యలో 18,114 బైబిలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి, ప్రభువు రాత్రి భోజన ఆచరణకు 61,538 మంది హాజరయ్యారు.

మేము “దేవునితో నడవండి” జిల్లా సమావేశాల కోసం, అక్టోబరులో ఇండియాలో ఆరంభమయ్యే పరిచర్య శిక్షణా పాఠశాల ఆరవ తరగతి కోసం ఎదురుచూస్తున్నాం. మనం 2005వ సేవా సంవత్సరాన్ని ఆరంభిస్తుండగా, మీతోపాటు మేము కూడా సంతోషంగా ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తితో’ ఉంటాం.​—1 కొరిం. 15:58.

మీ సహోదరులు,

ఇండియా బ్రాంచి కార్యాలయం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి