కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/04 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఉపశీర్షికలు
  • సెప్టెంబరు 13తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 20తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 27తో ప్రారంభమయ్యే వారం
  • అక్టోబరు 4తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2004
km 9/04 పేజీ 2

సేవా కూటాల పట్టిక

సెప్టెంబరు 13తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సలహాలు మీ సంఘ క్షేత్రానికి ఆచరణాత్మకంగా ఉంటే, వాటిని ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది), సెప్టెంబరు 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. ప్రతీ ప్రదర్శన తర్వాత, ఆ ప్రదర్శనలోని సహాయకరమైన అంశాన్ని క్లుప్తంగా నొక్కిచెప్పండి.

15 నిమి: “మీ కంటిని తేటగా ఉంచుకోండి.”a ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. సమయం అనుకూలిస్తే, ఉదహరించబడిన లేఖనాలు నొక్కిచెప్పండి.

18 నిమి: మన సత్క్రియల ప్రత్యక్ష సాక్షులు. (1 పేతు. 2:12) నవంబరు 1, 2002 కావలికోట 12-14 పేజీలు, 14-20 పేరాలపై ఆధారపడిన ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. స్థానికంగా ఉన్న ప్రజలు మన సత్క్రియలను చూసి ఎలా ప్రభావితులయ్యారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 18 (162), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 20తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య ఈ సంచిక మొదటి పేజీలోవున్న బ్రాంచి ఉత్తరంలోని ముఖ్యాంశాలు సమీక్షించండి. అక్టోబరు 4తో ప్రారంభమయ్యే వారపు సేవా కూటానికి సిద్ధపడేందుకు సంఖ్యాకాండము 16:1-35 చదివి, ఆ తర్వాత యెహోవా అధికారాన్ని గౌరవించండి (ఆంగ్లం) అనే వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి.

15 నిమి: పోయిన సంవత్సరం మనమేమి సాధించాం? 2004 సేవా సంవత్సరపు సంఘ సేవా నివేదిక ఆధారంగా ఒక పెద్ద ఇచ్చే ప్రసంగం. ఆ నివేదికలోని ప్రోత్సాహకరమైన అంశాలపై దృష్టినిలిపి, సంఘం సాధించిన చక్కని పని విషయమై సంఘాన్ని మెచ్చుకోండి. పయినీర్ల కృషిని నొక్కిచెప్పండి. రాబోయే సంవత్సరంలో సంఘం అవధానం ఇవ్వగల ఒకటి రెండు అంశాలు పేర్కొనండి.

20 నిమి: సత్క్రియ చేసేటప్పుడు ఓపిక ప్రదర్శించడం. (గల. 6:10) ఇద్దరు లేదా ముగ్గురు క్రమ పయినీర్లను లేదా అప్పుడప్పుడూ సహాయ పయినీరు చేసేవారిని ఇంటర్వ్యూ చేయండి. యెహోవా సేవలో వారికి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి, వారెలా వాటిని అధిగమించారు? ఇతరులపట్ల మేలు లేదా సత్క్రియలు చేస్తున్నప్పుడు ఓపిక చూపడం వారికెలా సహాయం చేసింది? క్రైస్తవ పరిచర్యలో వారు చేసిన కృషి వారికి, ఇతరులకు ఎలా ప్రయోజనకరంగా ఉంది? మీ ప్రాంతానికి అన్వయిస్తుంటే, వేరే భాషలు మాట్లాడే ప్రజలకు సువార్త ప్రకటించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయబడ్డాయో వివరించండి. ‘విశ్వాసముతోకూడిన వారి పనిని, ప్రేమతోకూడిన వారి ప్రయాసమును, వారి ఓర్పును’ బట్టి అందరిని మెచ్చుకోండి.—1 థెస్స. 1:2, 3.

పాట 11 (85), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 27తో ప్రారంభమయ్యే వారం

పాట 27 (221)

15 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్‌ రిపోర్టు. సెప్టెంబరు క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది), అక్టోబరు 1 కావలికోటను ఎలా ప్రతిపాదించవచ్చో ప్రదర్శించండి.

10 నిమి: యెహోవా వాక్యము సజీవమైనది. ప్రసంగం. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఇవ్వబడిన వారపు బైబిలు పఠన కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందేందుకు మనకు సహాయం చేయడానికి, ఎంపిక చేయబడిన కావలికోట సంచికల్లో “యెహోవా వాక్యము సజీవమైనది” అనే ఆర్టికల్స్‌ పరంపర ఆరంభించబడింది. కావలికోట సెప్టెంబరు 15, 2004, 24-7 పేజీలను ఉపయోగిస్తూ ఈ ఆర్టికల్స్‌లోని అంశాలను సూచించండి. విషయాలను సంగ్రహంగా వివరించిన తర్వాత, “లేఖనాధారిత ప్రశ్నలకు జవాబులు” అనే భాగం కష్టంగావున్న కొన్ని లేఖన భాగాలకు వివరణ అందిస్తుంది. “మనకు పాఠాలు” అనే భాగం క్రిందవున్న వ్యాఖ్యలు పఠన సమాచారంలోని ఆచరణాత్మక విలువలపైకి దృష్టి మళ్లిస్తాయి. దేవుని వాక్యాన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్స్‌ పరంపర ఎలా సహాయం చేస్తుందో ఉదహరించేందుకు కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలు పరిశీలించండి. వచ్చే వారం నుండి మనం ద్వితీయోపదేశకాండము చదవడం ఆరంభిస్తుండగా ఈ ఏర్పాటును సద్వినియోగం చేసుకోమని అందరినీ ప్రోత్సహించండి.

20 నిమి: “బైబిలును సమర్థవంతంగా ఉపయోగించండి.”b ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. పరిచర్య పాఠశాల పుస్తకంలో 145వ పేజీ, 2-3 పేరాల ఆధారంగా ఉపోద్ఘాతం చెప్పండి. ఇవ్వబడిన సలహాలను ఎలా అన్వయించుకోవాలో సూచిస్తూ రెండు ప్రదర్శనలు చేర్చండి, మొదటిది తొలి సందర్శనానికి, రెండోది పునర్దర్శనానికి సంబంధించినవై ఉండాలి.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

అక్టోబరు 4తో ప్రారంభమయ్యే వారం

పాట 7 (51)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

15 నిమి: స్థానిక అవసరాలు

25 నిమి: “మనం యెహోవా అధికారాన్ని గౌరవించాలి.” ఒకటి రెండు నిమిషాలకు మించకుండా ఉపోద్ఘాతం చెప్పి, యూదా 11వ వచనం చదవండి. ఆర్టికల్‌లో ఇవ్వబడిన ప్రశ్నలన్నీ ఉపయోగిస్తూ వెంటనే ప్రేక్షకులతో చర్చ ఆరంభించండి. యెహోవా ఆమోదాన్ని కాపాడుకోవాలంటే మనం కోరహు తిరుగుబాటు స్వభావాన్ని విసర్జిస్తూ, యెహోవా పట్ల తమ విశ్వసనీయతకు దేనినీ అడ్డు రానివ్వని అతని కుమారుల మాదిరిని అనుకరించాలనే అంశాన్ని నొక్కిచెప్పండి.

పాట 8 (53), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి