పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ఒక వ్యక్తి తనకు ఏదైనా విపత్తు కలిగినప్పుడు, ‘దేవుడెంతో శక్తిమంతుడు కదా! మరి ఆయన నన్నిలా కష్టాల్లో ఎందుకు వదిలేశాడు?’ అని అనుకుంటుంటారు. మీరెప్పుడైనా అలా భావించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు కాలాల్లో నమ్మకస్థులైన కొందరు వ్యక్తులు అలాగే భావించారు. (హబక్కూకు 1:13 చదవండి.) ఆ ప్రశ్నకు దేవుడు ఇచ్చిన సమాధానం, ఈ తేజరిల్లు! పత్రికలోని ఈ ఆర్టికల్‌లో వివరంగా చర్చించబడింది.”
కావలికోట ఆగ. 15
“ఈ కాలంలో ప్రజలు వివాహబంధం విషయంలో, పిల్లలను పెంచడం విషయంలో సలహా కోసం అనేక చోట్ల వెదుకుతున్నారు. చక్కని సలహా ఎక్కడ లభిస్తుందని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ కావలికోట సంచిక, మానవులను సృష్టించిన సృష్టికర్త కుటుంబ జీవితం కోసం ఇచ్చిన కొన్ని జ్ఞానవంతమైన సలహాలను చర్చిస్తుంది.” కీర్తన 32:8 చదవండి.
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“నేడు కూడా అనేకమంది వివాహాన్ని పవిత్రమైనదిగా ఎంచుతున్నప్పటికీ, వైవాహిక జీవితంలో అసంతృప్తి బాగా పెరిగిపోతోందనే విషయంతో మీరు ఏకీభవించరా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ లేఖనంలో నొక్కి చెప్పబడ్డ రెండు లక్షణాలు వివాహ దంపతులకు ఎలా సహాయం చేయగలవో ఆలోచించండి. (ఎఫెసీయులు 5:33 చదవండి.) తేజరిల్లు! పత్రికలోని ఈ ఆర్టికల్, భార్యాభర్తలకు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమాగౌరవాలు ఎలా చూపించుకోవచ్చో వివరిస్తుంది.”
కావలికోట సెప్టెం. 1
“మనమందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ పేర్కొన్న విషయాలు నిజంగా సంతోషాన్ని ఇస్తాయని మీకనిపిస్తోందా? [మత్తయి 5:4ఎ, 6ఎ, 10ఎ చదవండి. ఆ తర్వాత ప్రతిస్పందించనివ్వండి.] ప్రసిద్ధి గాంచిన కొండమీది ప్రసంగంలో చెప్పబడిన ఆ మాటల భావమేమిటో ఈ పత్రిక వివరిస్తుంది. సంతోషంగా ఉండడానికి ఇంకా కావలసిందేమిటో కూడా చర్చిస్తుంది.”