దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ క్రింది ప్రశ్నలు 2004, ఏప్రిల్ 26వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త 2004, మార్చి 1 నుండి ఏప్రిల్ 26 మధ్య వారాల్లోని నియామకాల ద్వారా అందించబడిన సమాచారం ఆధారంగా 30 నిమిషాల పునఃసమీక్షను నిర్వహిస్తారు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేని వాటికి జవాబులను తెలుసుకోవడానికి మీరు స్వయంగా పరిశోధించాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలు చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. మనం ప్రసంగం ఇచ్చేటప్పుడు, వ్రాతప్రతి నుండి కాక సంక్షిప్త ప్రతి నుండి మాట్లాడ్డం ఎందుకు మంచిది? [be 166వ పేజీ, 3వ పేరా]
2. క్షేత్రసేవ కోసం సిద్ధపడడంలో, మన తలంపుల సంక్షిప్త ప్రతిని మనస్సులో ఎలా రూపొందించుకోవచ్చు? [be 167వ పేజీ, 2వ పేరా]
3. అపొస్తలుల కార్యములు 13:16-41 మరియు అపొస్తలుల కార్యములు 17:2, 3 ఉపయోగిస్తూ ‘యేసే క్రీస్తని’ పౌలు ‘తర్కబద్ధంగా’ ఎలా నిరూపించాడో వివరించండి. (అపొ. 9:22) [be 170వ పేజీ, 2వ పేరా]
4. పదే పదే నోట్సు చూడకుండా ప్రసంగించడంలో ఉన్న కొన్ని ప్రయోజనాలేమిటి? [be 175వ పేజీ, 2-5 పేరాలు]
5. పదే పదే నోట్సు చూడకుండా ప్రసంగించడంలో ఎలాంటి ప్రమాదాలున్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? [be 175వ పేజీ, 6వ పేరా—176వ పేజీ, 3వ పేరా]
ఒకటవ నియామకం
6. ఆదికాండము 32:24-32 లోని వృత్తాంతం ప్రకారం, యెహోవా ఆశీర్వాదం పొందడానికి 97 ఏళ్ల యాకోబు ఏమిచేశాడు, ఇది మనకేమి బోధిస్తోంది? [w02 8/1, 29-31 పేజీలు]
7. “ఆలోచనా సామర్థ్యం” అంటే ఏమిటి, అది సమతుల్యం కోల్పోకుండా ఉండడానికి, అనవసర చెడును తప్పించుకోవడానికి మనకెలా సహాయం చేస్తుంది? (సామె. 1:4) [w02 8/15, 21-2 పేజీలు]
8. బహిరంగ ప్రసంగీకులు తమ ప్రసంగాలకు లేఖనాలను ఎలా ఆధారం చేసుకోవచ్చు? [be 52వ పేజీ, 6వ పేరా-53వ పేజీ, 5వ పేరా]
9. సంక్షిప్త ప్రతిని లోతైన లేఖన వివరణగా మార్చడంలో ఒక ప్రసంగీకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? [be 54వ పేజీ, 2-4 పేరాలు]
10. యెహోవా ఇశ్రాయేలీయులకు అరణ్యంలో ఎందుకు వారం వారం, నెల నెలా మన్నా ఇచ్చి పోషించాడు, దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ద్వితీ. 8:16) [w02 9/1, 30వ పేజీ, 3వ పేరా-31వ పేజీ 1వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. ఆదికాండము 37:12-17 లో వ్రాయబడినట్లుగా, యోసేపు విధానానికి, యేసు విధానానికి ఎలాంటి సమాంతరాన్ని మనం చూస్తాం? [w87 5/1, 12వ పేజీ, 12వ పేరా]
12. ఆదికాండము 42:25-35 లోని వృత్తాంతంలో కనబడే విధంగా, యేసు కనికరానికి పోల్చదగ్గ కనికరాన్ని యోసేపు ఎలా కనబరచాడు? [w87 5/1, 18వ పేజీ, 10వ పేరా; 19వ పేజీ, 17వ పేరా]
13. నేడు దాసుని తరగతిచేసే ఏర్పాట్లు యోసేపు కాలంలోని ధాన్య పంపకానికి ఎలా పోలివున్నాయి? (ఆది. 47:21-25)
14. “నేను ఎలా కావాలంటే అలా అవుతాను” అని చెప్పడంలో యెహోవా తన పేరుకు సంబంధించి ఏమి వెల్లడిచేస్తున్నాడు? (నిర్గ. 3:14, 15 NW)
15. ఫిర్యాదు చేయడంలోని ఏ రెండు స్వాభావిక ప్రమాదాలు నిర్గమకాండము 16:2, 3 లో వ్రాయబడ్డాయి? [w93 3/15, 20-1 పేజీలు]