కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/03 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఉపశీర్షికలు
  • డిసెంబరు 8తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 15తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 22తో ప్రారంభమయ్యే వారం
  • డిసెంబరు 29తో ప్రారంభమయ్యే వారం
  • జనవరి 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2003
km 12/03 పేజీ 2

సేవా కూటాల పట్టిక

డిసెంబరు 8తో ప్రారంభమయ్యే వారం

పాట 27 (221)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 6వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది), డిసెంబరు 15 కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినా ప్రతి ప్రదర్శనలో రెండు పత్రికలను జంటగా ఇవ్వాలి.

20 నిమి: “నిజమైన క్రైస్తవ ఐక్యత—ఎలా సాధ్యమవుతుంది?”a 5వ పేరా చర్చిస్తున్నప్పుడు, మన క్రైస్తవ ఐక్యతను నొక్కితెలిపే అంతర్జాతీయ సమావేశాలు, దైవపరిపాలనా నిర్మాణ ప్రాజెక్టులు లేదా విపత్కర సమయాల్లో సహాయ కార్యక్రమాలకు సంబంధించి వ్యక్తిగత అనుభవాలు చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

15 నిమి: “2004 కోసం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల.” పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. అక్టోబరు 2003 మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లోని వ్యాఖ్యానాలు చేర్చండి.

పాట 5 (46), ముగింపు ప్రార్థన.

డిసెంబరు 15తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు 29తో ప్రారంభమయ్యే వారపు సేవాకూటంలో జరిగే చర్చకు సిద్ధపాటుగా మార్పిడికి—ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం (ఆంగ్లం) అనే వీడియో చూడమని ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించండి. “దయచేసి సకాలంలో సందర్శించండి” అనే బాక్సు చర్చించండి. అందుబాటులో ఉంటే S-70 ఫారమ్‌ నమూనా చూపించండి. డిసెంబరు 25, జనవరి 1 కోసం చేయబడిన ప్రత్యేక క్షేత్రసేవా ఏర్పాట్ల గురించి తెలియజేయండి.

15 నిమి: వ్యక్తిగత అధ్యయనం—ఒక ఆరాధనా ప్రక్రియ. అక్టోబరు 1, 2000, కావలికోట, 14-15 పేజీలు, 6-10 పేరాల ఆధారంగా ఇచ్చే ప్రసంగం.

20 నిమి: “‘సరైన మానసిక వైఖరిగల’ వారికి సహాయం చేయండి.”b ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. పునర్దర్శనాలు చేయడానికి మార్చి 1997 మన రాజ్య పరిచర్య, 3వ పేజీలోని బాక్సులో ఇవ్వబడ్డ సూచనలు పునఃసమీక్షించండి.

పాట 21 (191), ముగింపు ప్రార్థన.

డిసెంబరు 22తో ప్రారంభమయ్యే వారం

పాట 3 (32)

12 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్సు రిపోర్టు. 6వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ, అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది), జనవరి 1 కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శించండి. వచ్చేవారం జరిగే ప్రత్యేక సేవా కూటం గురించి ప్రతీ ఒక్కరికి గుర్తుచేయండి. ఆ కూటంలో రోగి అవసరాలు, హక్కులు తీర్చడం అనే వీడియోను మనం పునఃసమీక్షించి చర్చిస్తాం మరియు అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డులు అందరికీ ఇవ్వబడతాయి.

15 నిమి: స్థానిక అవసరాలు.

18 నిమి: “యోగ్యుల కోసం అన్వేషించడం.”c సమాచారాన్ని స్థానిక విషయాలకు అనువర్తించండి. గృహస్థులు ఎక్కువగా ఎప్పుడు తమ ఇళ్లలో ఉంటారు? మధ్యాహ్నం లేదా సాయంకాలం పొద్దుపోకముందే పరిచర్య చేయడం ద్వారా ఏ ఫలితాలు సాధించబడ్డాయి? తమ ఇళ్లదగ్గర అరుదుగా ఉండే ప్రజలను కలుసుకోవడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగించవచ్చు?

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

డిసెంబరు 29తో ప్రారంభమయ్యే వారం

పాట 23 (200)

5 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు క్షేత్రసేవ రిపోర్టులను ఇమ్మని ప్రచారకులందరికీ గుర్తుచేయండి. జనవరి సాహిత్య ప్రతిపాదనలను పేర్కొనండి.

17 నిమి: “ప్రాముఖ్యమైన ఓ వైద్య విధానాన్ని నొక్కితెలిపే వీడియో.” యోగ్యతగల పెద్ద దీనిని నిర్వహించాలి. అపొస్తలుల కార్యములు 15:28, 29 చదివి, క్రైస్తవులు రక్త మార్పిడులు నిరాకరించడానికి ముఖ్య కారణం రక్తపవిత్రతకు సంబంధించిన దేవుని నియమాన్ని గౌరవించడానికే అని క్లుప్తంగా నొక్కిచెప్పండి. ఆ తర్వాత నేరుగా ఆర్టికల్‌లో ఇవ్వబడ్డ ప్రశ్నలు ఉపయోగిస్తూ రోగి అవసరాలు, హక్కులు తీర్చడం అనే వీడియోపై చర్చ సాగించండి. చివరి పేరా చదివి ముగించండి.

23 నిమి: వైద్య సవాళ్లను నమ్మకంగా ఎదుర్కోవడం. బ్రాంచి పంపించిన సంక్షిప్త ప్రతిని ఉపయోగిస్తూ యోగ్యతగల పెద్ద ఇచ్చే ప్రసంగం. “రక్తం తీసుకోకుండా ఉండడానికి మనకు సహాయం చేసే ఏర్పాట్లు” అనే బాక్సునుండి కీలకాంశాలను పునఃసమీక్షించండి.

పాట 24 (185), ముగింపు ప్రార్థన.

జనవరి 5తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

5 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: మీ ప్రయాసము వ్యర్థము కాదు. (1 కొరిం. 15:58) ప్రేక్షకులతో చర్చ. తొలి రోజుల్లో సేవ గురించిన వివరాలు చెప్పడానికి అనేక సంవత్సరాలు చురుకుగా సేవచేసిన ప్రచారకులను ముందే ఏర్పాటుచేసుకోండి. సంఘంతో ఎంతమంది సహవసించారు? సేవచేయడానికి సంఘానికి ఎంత సేవా ప్రాంతం నియమించబడింది? రాజ్య సందేశానికి ప్రజలెలా ప్రతిస్పందించారు? మీరు ఏవిధమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు? గడిచిన సంవత్సరాల్లో స్థానికంగా రాజ్యసేవ ఎలా వృద్ధయింది?

20 నిమి: యెహోవా ఆరాధన మన జీవితాల్ని ఎలా అర్థవంతం చేస్తోంది. ప్రేక్షకులతో చర్చ. సంతోషభరితమైన, అర్థవంతమైన జీవితానికి సత్యారాధన అత్యావశ్యకం. (1) అది జీవన సమస్యలతో, చింతలతో తాళుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (ఫిలి. 4:6, 7) (2) అది దైవిక లక్షణాలు అలవరచుకొనేలా మనలను ప్రోత్సహిస్తుంది. (2 పేతు. 1:5-8) (3) అది మన సమయాన్ని, వనరులను అత్యంత విలువైన రీతిలో ఉపయోగించడానికి మనకు సహాయం చేస్తుంది. (1 తిమో. 6:17-19) (4) అది భవిష్యత్తు కోసం నిశ్చయమైన నిరీక్షణనిస్తుంది. (2 పేతు. 3:13) (5) అది యెహోవాతో సన్నిహిత సంబంధం వృద్ధిచేసుకొనేలా మనకు దోహదపడుతుంది. (యాకో. 4:8) యెహోవా గురించి తెలియని లేదా ఆయనను సేవించని వారిలో పైన పేర్కొనబడిన విషయాలు ఎలా కొదువగా ఉన్నాయో తేడా చూపించండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషానికన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి