కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/03 పేజీ 1
  • యోగ్యుల కోసం అన్వేషించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యోగ్యుల కోసం అన్వేషించడం
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • సువార్తనందించుట—సాయంకాల వేళలలో
    మన రాజ్య పరిచర్య—1991
  • ఫోన్లో సాక్ష్యమివ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది
    మన రాజ్య పరిచర్య—2009
  • విజయవంతమైన రీతిలో టెలిఫోను సాక్ష్యం ఇవ్వడం
    మన రాజ్య పరిచర్య—2001
  • మీరు సాయంకాల సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించారా?
    మన రాజ్య పరిచర్య—1996
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 12/03 పేజీ 1

యోగ్యుల కోసం అన్వేషించడం

1 ప్రకటించమని యేసు మనకిచ్చిన ఆదేశాలు పాటించడం మనకొక సవాలే. ఆయనిలా అన్నాడు: ‘మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేయుడి.’ (మత్త. 10:11) ప్రజలు నేడు తమ ఇళ్లలో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు కాబట్టి, మనమీ అన్వేషణ ఫలవంతంగా ఎలా చేయవచ్చు?

2 మీ సేవా ప్రాంతాన్ని విశ్లేషించండి: మొదట మీ సేవా ప్రాంతాన్ని విశ్లేషించడంతో ఆరంభించండి. ప్రజలు ఏ సమయంలో తమ ఇళ్లలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది? పగటిపూట వారు ఎక్కడ ఉంటారు? వారంలో ఫలాని రోజు లేదా ఫలాని సమయంలో సందర్శించినప్పుడు వారు మంచిగా వినే అవకాశముందా? స్థానిక సేవా ప్రాంతంలోని ప్రజల దినచర్యకు, పరిస్థితులకు తగ్గట్టు మీ పరిచర్యను సవరించుకోవడం మీరు మంచి ఫలితాలను సాధించడానికి సహాయపడగలదు.—1 కొరిం. 9:23, 26.

3 సాయంకాల సమయాల్లో చాలామంది ప్రచారకులు సత్ఫలితాలను సాధించారు. ఆ సమయంలో కొందరు గృహస్థులు ఎక్కువ తీరికగావుండి వినడానికి మొగ్గుచూపారు. చలికాలంలో పగలు గంటలు తక్కువగా ఉంటాయి కాబట్టి, సాయంకాలాల్లో టెలిఫోను సాక్ష్యం కొన్ని ప్రాంతాల్లో (అనుమతివున్న ప్రాంతాల్లో) ఫలవంతంగా ఉండవచ్చు. వ్యాపార స్థలాల్లో సేవచేయడం, బహిరంగ స్థలాల్లో సాక్ష్యమివ్వడం కూడా సువార్తతో ప్రజలను చేరుకొనే మార్గాలే.

4 ఓ ప్రత్యేక కార్యక్రమ నెలలో ఒక సంఘం శని ఆదివారాల్లో మధ్యాహ్నం, బుధ శుక్రవారాల్లో సాయంకాలం సాక్ష్యమిచ్చే ఏర్పాటుచేసింది. అలాగే వారు టెలిఫోను సాక్ష్యాన్ని, వ్యాపార స్థలాల్లో సేవచేయడాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏర్పాట్లు పరిచర్య కోసం ఎంత ఉత్సాహాన్ని పురికొల్పాయంటే, వాటిని అలాగే కొనసాగించేందుకు సంఘం నిర్ణయించుకుంది.

5 పట్టుదలతో పునర్దర్శించండి: మీరు తిరిగి సందర్శించినప్పుడు ప్రజలను కలుసుకోవడం మీ సేవా ప్రాంతంలో సవాలుగా ఉంటే, మొదటి సందర్శనంతో సహా ప్రతీ సందర్శనం తర్వాత మళ్లీ సందర్శించేందుకు నిర్దిష్టమైన ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ పిమ్మట, మీరు చేసుకున్న ఏర్పాటుకు ఖచ్చితంగా కట్టుబడి ఉండండి. (మత్త. 5:37) సముచితమైతే, గృహస్థుల టెలిఫోను నంబరుకోసం మీరు అడగవచ్చు. ఆ వ్యక్తిని మీరు మళ్లీ కలుసుకోవడానికి ఇది కూడా మీకు సహాయపడవచ్చు.

6 యోగ్యులను అన్వేషించడం కోసం పట్టుదలగా మనంచేసే ప్రయత్నాలపై, వారు చూపిన ఆసక్తిని వృద్ధిచేయడానికి మళ్లీ వారిని సందర్శించడంపై తప్పక యెహోవా ఆశీర్వాదాలుంటాయి.—సామె. 21:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి