సేవా కూటాల పట్టిక
ఆగస్టు 11తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) ఆగస్టు 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో, “నేను బిజీగా ఉన్నాను” అని సంభాషణను ఆటంకపరిచే వారితో ఎలా వ్యవహరించాలో ప్రదర్శించండి.—తర్కించడం (ఆంగ్లం) పుస్తకం, 19వ పేజీ.
15 నిమి: “యెహోవా మంచితనాన్ని అనుకరించండి.”a ప్రేమపూర్వక చర్యలు సాక్ష్యమివ్వడానికి ఎలా దారితీసాయో తెలిపే అనుభవాలను క్లుప్తంగా చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి. తోటి విశ్వాసులకు సహాయం చేసేందుకు చేసిన ప్రయత్నాలకు సంఘాన్ని అభినందించండి.
20 నిమి: “పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు.”b ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. పయినీరు పరిచర్య చేయడం వల్ల పొందిన ఆశీర్వాదాల గురించి చెప్పమని ఒకరిద్దరు పయినీర్లను ఆహ్వానించండి. పయినీరు పరిచర్య చేయాలనే ఆసక్తిగలవారు కార్యదర్శి నుండి దరఖాస్తు పొందమని తెలపండి.
పాట 22 (130), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 18తో ప్రారంభమయ్యే వారం
పాట 10 (82)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. “సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? బ్రోషుర్ కోసం సూచించబడిన ప్రతిపాదనలు” బాక్సు సమీక్షించండి, సమర్థవంతుడైన ప్రచారకుడి చేత వాటిలో ఒక ప్రతిపాదనను ప్రదర్శింపజేయండి.
17 నిమి: “పునరుత్తేజాన్నిచ్చే పని.”c క్రైస్తవ పరిచర్య తమకు ఎలా పునరుత్తేజాన్నిచ్చిందో తెలిపేందుకు ఇద్దరు లేక ముగ్గురిని ముందుగానే ఏర్పాటు చేసుకోండి.
18 నిమి: “మన ఆరాధనా స్థలాలను మంచి స్థితిలో ఉంచుకుందాం.”d (1 నుండి 5 పేరాలు) ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. 3వ, 4వ పేరాలను చర్చిస్తున్నప్పుడు, స్థానిక రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే ఏర్పాట్లను సమీక్షించండి. శ్రద్ధ చూపించవలసిన విషయాలేమైనా ఉంటే వాటిని ఉద్దేశించి మాట్లాడండి. సరైన ఆరాధనా స్థలాన్ని చక్కగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంఘాన్ని అభినందించండి.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 25తో ప్రారంభమయ్యే వారం
పాట 5 (46)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) సెప్టెంబరు 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో ఒక తండ్రి యౌవనంలో ఉన్న తన కుమారునికి లేక కుమార్తెకు పత్రికా పనికి సిద్ధపడడాన్ని పూర్వాభ్యాసం చేస్తున్నట్లు చూపించండి. వారు ఆయా పత్రికలు ఇవ్వడానికి ముందు ఏమి చెప్పాలో ఇవ్వబడిన సూచనలను క్లుప్తంగా సమీక్షిస్తారు.
15 నిమి: యువత యెహోవాను స్తుతిస్తోంది! ప్రేక్షకులతో చర్చ, ఇంటర్వ్యూలతో కూడిన ప్రసంగం. కూటాల్లో యువత బాగా సిద్ధపడిన వ్యాఖ్యానాలు చేస్తుండడం విని మనం సంతోషిస్తాం. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో వారి కృషి, అభివృద్ది ఆనందదాయకం. వారు పరిచర్యలో మంచి సాక్ష్యమిస్తుండగా వారు తమ యథార్థ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. దైవభక్తిగల వారి ప్రవర్తన యెహోవాను ఘనపరుస్తుంది. (yb88 53-4 పేజీలు) భవిష్యత్తులోని మహత్తర అవకాశాలకు వారి ఆధ్యాత్మిక అభివృద్ధి పునాదివేస్తుంది. సంఘ కార్యకలాపాల్లో క్రమంగా పాల్గొనే ఇద్దరు ముగ్గురు యువ క్రైస్తవులను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. యెహోవాను స్తుతించడానికి సంఘంలోని యువత చేస్తున్న మంచి ప్రయత్నాలకు వారిని మనస్ఫూర్తిగా అభినందించండి.
20 నిమి: బోధించడానికి ధైర్యం తెచ్చుకోండి. (1 థెస్స. 2:2) ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. రాజ్య సందేశంతో ఇతరులను చేరడానికి చాలామంది ఎందుకు భయపడతారో వివరించండి. అనేక సంవత్సరాల నుండి క్రియాశీలకంగా ఉన్నవారు కూడా భయపడతారు. డిసెంబరు 1, 1999, కావలికోట 25వ పేజీ; డిసెంబరు 15, 1999, కావలికోట 25వ పేజీ; ఏప్రిల్ 1, 1996, కావలికోట 31వ పేజీలలో ఉన్న కొన్ని అనుభవాలను చెప్పండి. ప్రేక్షకులు తమకు భయమనిపించిన సందర్భాల్లో సువార్తను పంచుకోవడానికి ఎలా ధైర్యం తెచ్చుకోగలిగారో వ్యాఖ్యానించడానికి వారిని ఆహ్వానించండి. డిసెంబరు 15, 1999, కావలికోట 23-4 పేజీల ఆధారంగా యెహోవా నుండి శక్తి పొందమని ప్రోత్సహిస్తూ ముగించండి.
పాట 9 (37), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 1తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. సెప్టెంబరులో ప్రతిపాదించే సాహిత్యాలను ప్రస్తావించండి. సమావేశాలకు వెళ్తున్నప్పుడు లేక సెలవుల్లో లేక వేసవి నెలల్లోని ఇతర సందర్భాల్లో గానీ అనియత సాక్ష్యమిచ్చిన నిర్మాణాత్మక అనుభవాలను చెప్పేందుకు ఒకరు లేక ఇద్దరిని ముందుగానే ఏర్పాటు చేసుకోండి.
15 నిమి: మీరు మళ్ళీ వస్తామని చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటారా? సెప్టెంబరు 15, 1999, కావలికోట 10-11 పేజీలలో “వాగ్దానాలను నెరవేర్చేందుకు ఇతర మార్గాలు” అనే శీర్షిక కింద ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. మన పరిచర్యలో ఆసక్తి కనబరిచే ప్రజలను కలుసుకున్నప్పుడు, మనం సాధారణంగా చర్చను కొనసాగించడానికి మరోసారి రావడానికి ఏర్పాటు చేసుకుంటాం. మనం వాగ్దానం చేసిన ప్రకారం నిజంగా తిరిగివెళ్తున్నామా? మన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని పురికొల్పే బైబిలు సూత్రాలను సమీక్షించండి. వెంటనే తిరిగివెళ్ళడం వల్ల ప్రతిఫలం పొందిన అనుభవాలుంటే చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.
20 నిమి: “మన ఆరాధనా స్థలాలను మంచి స్థితిలో ఉంచుకుందాం.”e (6-11 పేరాలు) ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. 5వ పేజీలోని బాక్సులోని అంశాలను నొక్కిచెబుతూ, రాజ్యమందిరాన్ని సరిగ్గా కాపాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో నొక్కిచెప్పండి. మీ రాజ్యమందిర పరిస్థితిని తెలిపే క్లుప్తమైన నివేదికను చేర్చండి, మరమ్మత్తులకు లేక మెరుగుపరచడానికి ఏవైనా ప్రణాళికలుంటే తెలియజేయండి.
పాట 20 (93), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.