యెహోవా మంచితనాన్ని అనుకరించండి
1 అద్భుతమైన సూర్యాస్తమయాన్ని తిలకించిన తర్వాత లేక రుచికరమైన భోజనం చేసిన తర్వాత, మంచివాటన్నిటికీ మూలమైన యెహోవాకు కృతజ్ఞతలు తెలపడానికి మనం పురికొల్పబడమా? ఆయన మంచితనం మనం ఆయనను అనుకరించాలని కోరుకునేలా ప్రేరేపిస్తుంది. (కీర్త. 119:66, 68; ఎఫె. 5:1) మంచితనాన్ని మనమెలా కనబరచగలము?
2 అవిశ్వాసుల పట్ల: యెహోవా మంచితనాన్ని అనుకరించగలిగే ఒక మార్గం, మనకు విశ్వాస సంబంధులు కానివారి పట్ల యథార్థమైన శ్రద్ధ చూపించడం. (గల. 6:10) ఆచరణాత్మకమైన మార్గాల్లో మంచితనం చూపించడం, వారు యెహోవాసాక్షులుగా మనల్ని మన సందేశాన్ని ఎలా దృష్టిస్తారన్నదానిపై సానుకూలమైన ప్రభావం చూపిస్తుంది.
3 ఉదాహరణకు ఒక యౌవన పయినీరు సహోదరుడు ఒక ఆసుపత్రిలో వేచివున్న సమయంలో, తన పక్కనే కూర్చున్న ఒక వృద్ధ స్త్రీ అక్కడున్న ఇతర రోగులకంటే ఎక్కువ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన గమనించాడు. డాక్టర్ను కలవడానికి తన వంతు వచ్చినప్పుడు ఆయన ఆ స్త్రీకి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత ఆమె ఆయనకు మరోసారి మార్కెట్లో తారసపడింది, ఆయనను చూసి ఆమె చాలా సంతోషించింది. ఆమె అప్పటివరకు సువార్త వినడానికి సుముఖత చూపించకపోయినా, యెహోవాసాక్షులు తమ పొరుగువారిని నిజంగా ప్రేమిస్తారని ఇప్పుడు తెలుసుకున్నానని ఆమె అన్నది. ఆమెతో క్రమబద్ధమైన బైబిలు అధ్యయనం ఆరంభించబడింది.
4 మన సహోదరుల పట్ల: మనం మన తోటి విశ్వాసులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా మనం యెహోవా మంచితనాన్ని అనుకరిస్తాం. విపత్తు సమయాల్లో మన సహోదరులకు సహాయంచేసేవారిలో మనం మొట్టమొదట ఉంటాం. అదే స్ఫూర్తిని మనం కూటాలకు హాజరవడానికి సహాయం అవసరమైనవారిపట్ల, అనారోగ్యులను సందర్శిస్తున్నప్పుడు, సంఘంలో మనకు ఎక్కువగా పరిచయంలేనివారి పట్ల ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు చూపిస్తాం.—2 కొరిం. 6:11-13; హెబ్రీ. 13:16.
5 యెహోవా మంచితనం చూపించే మరో మార్గం ఏమిటంటే, ఆయన “క్షమించుటకు సిద్ధమైన మనస్సు”తో ఉంటాడు. (కీర్త. 86:5) ఆయనను అనుకరిస్తూ, ఇతరులను క్షమించడం ద్వారా మంచితనంయెడల మన ప్రేమను వ్యక్తంచేయవచ్చు. (ఎఫె. 4:32) ఇది మన తోటి విశ్వాసులతో మన సహవాసం ‘మేలైనదిగా మనోహరమైనదిగా’ ఉండేందుకు తోడ్పడుతుంది.—కీర్త. 133:1-3.
6 విస్తారమైన యెహోవా మంచితనం, మనం ఆయన కీర్తిని స్తుతిస్తూ ప్రకటించేందుకు, సంతోషంతో ప్రజ్వలించేందుకు కారణమవును గాక. మనం చేసే అన్ని కార్యాల్లోను ఆయన మంచితనాన్ని అనుకరించేందుకు కృషిసల్పేలా అది మనల్ని పురికొల్పును గాక.—కీర్త. 145:7; యిర్మీ. 31:12.