పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“మన కాలంలోని ఒక విషాదకర వాస్తవమైన బాల వేశ్యావృత్తి గురించి ఈ తేజరిల్లు! సంచిక నివేదిస్తోంది. బాలలపై జరుగుతున్న అతి దారుణమైన ఈ అత్యాచారం త్వరలోనే అంతమౌతుందని బైబిలు వాగ్దానం చేస్తోంది. [సామెతలు 2:21, 22 చదవండి.] స్వలాభం కోసం పిల్లలను ఇలా వాడుకోవడం వెనుక ఉన్నదేమిటో, అది ఎలా అంతం చేయబడుతుందో ఈ పత్రిక తెలియజేస్తుంది.”
కావలికోట జూన్ 15
“కొందరు ప్రజలు చరిత్రంతటిలో యేసే మహాగొప్ప మనిషి అని భావిస్తారు. మరి కొందరు ఆయన ఉనికినే ప్రశ్నిస్తారు. మనమాయన గురించి ఏమి నమ్ముతాము అనే విషయం ప్రాముఖ్యమని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించిన తర్వాత, అపొస్తలుల కార్యములు 4:12 చదవండి.] యేసు నిజంగా భూమ్మీద జీవించాడనడానికి రుజువేమిటి? ఈ పత్రిక ఆ ప్రశ్నను పరిశీలిస్తుంది.”
తేజరిల్లు! ఏప్రి.-జూన్
“నిజాయితీయే అత్యుత్తమ మార్గమని స్కూలు పిల్లలకు నేర్పించబడుతుంది. కానీ చాలామంది పిల్లలు పరీక్షల్లో ఎందుకు కాపీ కొడతారో మీకు తెలుసా? అది నిజంగా ప్రతిఫలదాయకమైనదేనా? [ప్రతిస్పందించనివ్వండి, హెబ్రీయులు 13:18 చదవండి.] ఈ తేజరిల్లు! సంచిక [17వ పేజీ చూపించండి] కాపీ కొట్టడంలో తప్పేముంది? అనే ప్రశ్నకు సమాధానమిస్తోంది.”
కావలికోట జూలై 1
“మానవులుగా మనకున్న ప్రాథమిక అవసరాల్లో ఒకటి ఇతరులను ప్రేమించడం, ఇతరులచే ప్రేమించబడడం. [4వ పేజీలోని ఉల్లేఖనం చదవండి.] అయితే ఆధునిక సమాజం ఇతర విషయాలకు ప్రాధాన్యతనివ్వడానికి మొగ్గు చూపుతోందని మీరు గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి.] స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటి, దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలను ఈ పత్రిక చర్చిస్తుంది.” 1 కొరింథీయులు 13:2 చదవండి.