కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/03 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 3/03 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జన-మార్చి

“ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు తీసే అంటువ్యాధుల్లో నేడు ఎయిడ్స్‌ అగ్రస్థానంలో ఉంది. అయితే బాధితులకు ఏదైనా నిరీక్షణ ఉందా? [ప్రతిస్పందించనీయండి.] ‘నాకు దేహములో బాగులేదని’ ఎవరూ అనని ఒక సమయము రానున్నదని మన సృష్టికర్త వాగ్దానం చేశాడు. [యెషయా 33:24 చదవండి.] ఎయిడ్స్‌ స్వైరవిహారం ఆగుతుందా అనే ప్రశ్నకు ఈ తేజరిల్లు! సంచిక జవాబిస్తుంది.”

కావలికోట మార్చి 15

“యేసు బోధనలు మన కాలంలో కూడా ఆచరణీయమేనని మీరనుకుంటున్నారా? [ప్రతిస్పందించనీయండి.] యేసు తన భూజీవితంలోని చివరి రోజు ఇచ్చిన ఈ ఆజ్ఞతో మీరు నిస్సందేహంగా ఏకీభవిస్తారు. [యోహాను 15:12 చదవండి.] యేసు ఆ రోజు విలువైన వేరే పాఠాలను కూడా బోధించాడు. వాటినుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చో ఈ కావలికోట సంచిక చూపిస్తుంది.”

తేజరిల్లు! జన-మార్చి

“మనలో చాలామందికి కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. వాటిని అధిగమించవచ్చని మీకనిపిస్తుందా? [ప్రతిస్పందించనీయండి. తర్వాత రోమీయులు 7:18, 19 చదవండి.] చెడు అలవాట్లను దేవుడు ఎలా దృష్టిస్తాడో ఈ తేజరిల్లు! సంచిక [26వ పేజీ చూపిస్తూ] వివరిస్తుంది, అంతేకాదు వాటిని అధిగమించడానికి మనకు సహాయం చేస్తుంది.”

కావలికోట ఏప్రి. 1

“ఇక్కడ చూపించబడుతున్న భోజనాన్ని సంప్రదాయకంగా ప్రభువు రాత్రి భోజనం అంటారు. [పత్రిక ముందరి, వెనకటి పేజీలను చూపించండి.] క్రైస్తవులు ఈ ఒక్క సంఘటనను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించబడిందని మీకు తెలుసా? [ప్రతిస్పందించనీయండి. తర్వాత లూకా 22:19 చదవండి.] ఈ ఆచరణ ఎందుకంత ప్రాముఖ్యమైనదో, అది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పత్రిక వివరిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి