రాజ్య మందిర గ్రంథాలయాల కోసం కొత్త ఏర్పాటు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు తమ రాజ్య మందిర గ్రంథాలయాలను—పూర్వం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గ్రంథాలయాలు అని పిలువబడేవి—ఉపయోగించుకోవడం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రయోజనం పొందుతున్నాయి. గతంలో, ప్రతి సంఘానికి ఒక సొంత గ్రంథాలయం ఉండడం అవసరం అని పరిగణించబడేది. అయితే ఇప్పుడు ఒకే రాజ్య మందిరాన్ని అనేక సంఘాలు—ఈ సంఘాల్లో కొన్ని వేర్వేరు భాషలకు చెందినవి—ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి ప్రతీ రాజ్య మందిరంలో ఒక్కొక్క భాషా గుంపుకు ఒక గ్రంథాలయం చొప్పున అన్ని పుస్తకాలు సమకూర్చబడి ఆధునీకరించబడిన చేయబడిన గ్రంథాలయం ఒకటి ఉండడం ఉత్తమం అనిపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ హాళ్ళు ఉన్న రాజ్య మందిరాల్లో, ప్రతీ హాల్లో అక్కడ కలుసుకునే భాషా గుంపుకు సంబంధించిన గ్రంథాలయం ఉండాలి.
ఈ ఏర్పాటువల్ల స్థలం, డబ్బు ఆదా అవుతాయని ఆశించబడుతోంది. అంతేకాక ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఘాల గ్రంథాలయాలను కలపడం వల్ల మరిన్ని పుస్తకాలతో మెరుగైన గ్రంథాలయం తయారయ్యే అవకాశం ఉంది. గ్రంథాలయాలను ఇలా ఐక్యం చేయడం వల్ల ఒకటి కంటే ఎక్కువ కాపీలు ఉన్న పుస్తకాలు మిగిలిపోతాయి, వాటిని అలాగే దాచివుంచి కొత్త రాజ్య మందిరాలు కట్టినప్పుడు ఉపయోగించవచ్చు. రాజ్య మందిరంలో కంప్యూటర్‌తో పాటు సిడి-రామ్‌లో వాచ్‌టవర్ లైబ్రరీ ఉంటే, ఈ ఉపకరణం చాలా ప్రయోజనకరమైనదని కొందరు గ్రహిస్తారు.
ప్రతీ రాజ్య మందిర గ్రంథాలయానికి ఒక సహోదరుడు—దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్తల్లో ఒకరైతే మంచిది—గ్రంథాలయకర్తగా సేవ చేస్తాడు. ఆయన క్రమంగా గ్రంథాలయానికి అవసరమైన కొత్త పుస్తకాలను చేరుస్తూ ఉండాలి, ప్రతి పుస్తకంలో అది రాజ్య మందిర గ్రంథాలయానికి చెందినది అని స్పష్టంగా మార్క్ చేయబడివుండాలి. సంవత్సరంలో కనీసం ఒక్కసారి ఆయన గ్రంథాలయంలో పుస్తకాలన్నీ ఉన్నాయా లేదా చూడాలి, పుస్తకాలు మంచి స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఈ గ్రంథాలయాల్లోని ప్రచురణలను రాజ్య మందిరం బయటకు తీసుకువెళ్ళకూడదు.
సంఘంతో సహవసించే వారందరూ రాజ్య మందిరంలోని గ్రంథాలయాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, “దేవుని గూర్చిన విజ్ఞానము”ను వెదకడానికి దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనం వ్యక్తిగతంగా ఈ ఏర్పాటును విలువైనదిగా ఎంచుతున్నామని చూపిద్దాం.—సామె. 2:5.