దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
ఈ క్రింది ప్రశ్నలు 2003, ఏప్రిల్ 28తో ప్రారంభమయ్యే వారపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త 2003, మార్చి 3 నుండి ఏప్రిల్ 28 మధ్య వారాల్లోని నియామకాల సమాచారాన్ని 30 నిమిషాలు పునఃసమీక్షిస్తారు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే ఆ ప్రశ్నకు మీరే స్వయంగా పరిశోధించి సమాధానాలను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. అనర్గళత లోపించడానికి ఏ అంశాలు కారణం కావచ్చు? [be 93వ పేజీ]
2. తప్పా ఒప్పా: మీరు చదివేటప్పుడు లేదా ప్రసంగమిచ్చేటప్పుడు మధ్యమధ్యలో కాస్సేపు ఆగడాన్ని నివారించాలి ఎందుకంటే అది ప్రజల మనస్సు అటూ ఇటూ వెళ్ళడానికి అనుమతించి వారి అవధానాన్ని భంగపరచడానికి అవకాశాలు కల్పిస్తుంది. వివరించండి.
3. ఒక ప్రసంగీకుడు లేదా బహిరంగంగా చదివే వ్యక్తి భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పడం ఎంత ప్రాముఖ్యమైనది? (నెహె. 8:8, ఈజీ-టు-రీడ్-వర్షన్) [be 101వ పేజీ]
4. భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పడాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? [be 102-3 పేజీలు]
5. బైబిలు అధ్యయనంలో గానీ సంఘ కూటంలో గానీ ఒక ప్రచురణ నుండి బిగ్గరగా చదువుతున్నప్పుడు నొక్కిచెప్పవలసిన ప్రధాన తలంపులు ఏవి? [be 105వ పేజీ]
ఒకటవ నియామకం
6. తమ పిల్లలు క్రైస్తవ కూటాల్లో ‘విని నేర్చుకోవడానికి’ వారికి శిక్షణనిచ్చేందుకు తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు? (ద్వితీ. 31:12) [be 16వ పేజీ]
7. ఆధ్యాత్మిక పరదైసు అంటే ఏమిటి? [w01 3/1, 8-10 పేజీలు]
8. దైవిక జ్ఞానము అందరికీ లభిస్తుందని సామెతలు 8:1-3 వచనాలు ఎలా చూపిస్తున్నాయి, కొలొస్సయులు 2:3 వ వచనం ప్రకారం ఆ జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? [w01 3/15, 25, 28 పేజీలు]
9. మనం దేవుని నామాన్ని ఎలా తెలియజేయవచ్చు? (యోహా. 17:6) [be 273-5 పేజీలు]
10. “రాజ్య సువార్త”కు సంబంధించిన ఏ ప్రాముఖ్యమైన వివరాలు ప్రజలు తెలుసుకోవాలి? (మత్త. 24:14) [be 279-80 పేజీలు]
వారపు బైబిలు పఠనం
11. (ఎ) మొదటి శతాబ్దంలో, మార్కు 13:14వ వచనంలో ప్రస్తావించబడిన “హేయవస్తువు” ఏది? (బి) అది “నిలువరాని స్థలమందు నిలుచుట” దేన్ని సూచిస్తుంది?
12. దావీదు సింహాసనానికి యేసే అసలైన వారసుడని లూకా సువార్త ఎలా నిరూపిస్తుంది? (లూకా 3:23-38) [w93 4/1 10వ పేజీ, 3వ పేరా]
13. లూకా 12:2లో నమోదుచేయబడిన యేసు వ్యాఖ్యాన భావమేమిటి?
14. పోయిన వెండి నాణెం గురించి యేసు చెప్పిన ఉపమానంలో, దేవదూతల ప్రతిస్పందన ఎందుకు గమనార్హమైనది? (లూకా 15:10) వారి మాదిరి మనలను ఎలా ప్రభావితం చేయాలి?
15. లూకా 22:29లో ఏ రెండు నిబంధనలు ప్రస్తావించబడ్డాయి?