పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“మన చుట్టూ నేరం అంతకంతకూ పెరిగిపోతూ మన జీవితాలను మరింత ప్రభావితం చేస్తున్నట్లుగా ఉంది. కారణమేమిటో మీకు తెలుసా? [2 తిమోతి 3:1, 3 చదవండి.] ప్రపంచమంతటా పెరుగుతున్న నేరాల సంఖ్య మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని రుజువు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు లేకపోతే ఎంత దుర్భరంగా ఉంటుంది! ప్రపంచవ్యాప్తంగా పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఈ తేజరిల్లు! సంచిక చర్చిస్తోంది.”
కావలికోట డిసెం. 15
“సంవత్సరంలోని ఈ సమయంలో చాలామంది యేసు జననం గురించి ఆలోచిస్తుంటారు. ఆయన జననం గురించిన బైబిలు వృత్తాంతంలో మనం నేర్చుకోగల ఎన్నో విలువైన పాఠాలున్నాయని మీకు తెలుసా? [జవాబు చెప్పనివ్వండి. తర్వాత 5వ పేజీని సూచించి 2 తిమోతి 3:16, 17 వచనాలను చదవండి.] వాటిలోని కొన్ని పాఠాలను ఈ కావలికోట సంచిక పరిశీలిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చాలామంది పోర్నోగ్రఫీని హానిరహితమైన వినోదంగా, కాలక్షేపంగా దృష్టిస్తారు. మరి కొందరేమో అది వ్యక్తులకు, కుటుంబాలకు, సమాజానికి హానికరమైనదని భావిస్తారు. ఈ తేజరిల్లు! సంచిక [19వ పేజీని చూపిస్తూ] ఈ విషయానికి సంబంధించిన బైబిలు సూత్రాల వెలుగులో పోర్నోగ్రఫీని పరిశీలిస్తుంది.” ఒక ఉదాహరణగా ఎఫెసీయులు 4:17-19 చదవండి.
కావలికోట జన. 1
“ప్రజలు, తమ ప్రియమైన వారెవరైనా మరణించినా లేదా అనారోగ్యానికి గురైనా ‘ఇలా జరగడానికి దేవుడెందుకు అనుమతించాడు?’ అని తరచుగా ఆశ్చర్యపోతుంటారు. బహుశా మీరు కూడా అలాగే ప్రశ్నించివుంటారు. బాధపడేవారి పట్ల దేవునికి సానుభూతి ఉందని బైబిలు తెలియజేస్తోంది. [యెషయా 63:9 ఎ భాగాన్ని చదవండి.] దేవుడు బాధలను అంతం చేస్తాడని మనమెందుకు గట్టి నమ్మకంతో ఉండవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”