పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“మీరూ మీ కుటుంబం మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి, ఆ తర్వాత 11వ పేజీలోని ఆర్టికల్ చూపించండి.] మీ ఆరోగ్యాన్ని కాపాడే ఆరు సుళువైన మార్గాల గురించి ఈ తేజరిల్లు! చర్చిస్తుంది. ‘నాకు దేహములో బాగులేదని’ ఎవరూ అనని ఒక కాలం వస్తుందని మన సృష్టికర్త వాగ్దానం చేశాడు.” యెషయా 33:24 చదవండి.
కావలికోట డిసెం. 15
“సంవత్సరంలోని ఈ సమయంలో చాలామంది ప్రజలు యేసు జననం గురించి ఆలోచిస్తుంటారు. ఆయన ఎలాంటి కుటుంబంలో పెరిగాడో మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత లూకా 2:51, 52 చదవండి.] యేసు పెంచబడిన తీరును గురించిన బైబిలు వివరాలనుండి మనం నేర్చుకోగల ఆచరణాత్మక పాఠాలను ఈ కావలికోట సంచిక చర్చిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“విభిన్న జాతుల గురించి మీరేమనుకుంటారు? అన్ని జాతుల్లోని ఆయావ్యక్తులు దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటారా? [ప్రతిస్పందించనివ్వండి. ఆ తర్వాత అపొస్తలుల కార్యములు 10:34, 35 చదవండి.] ఈ విషయాన్నే తేజరిల్లు! యొక్క ఈ సంచిక వివరంగా చర్చిస్తూ, మానవజాతికి సంబంధించి దేవుని దృక్కోణమేమిటో తెలుసుకోవడం నుండి మనమందరం ఎలా ప్రయోజనం పొందవచ్చో మనకు చెబుతుంది.”
కావలికోట జన. 1
“చాలామంది ప్రజలు భూమ్మీద శాంతి ఉండాలని కోరుకుంటారు. ఈ మాటలు నెరవేరడం మనమెప్పుడైనా చూస్తామని మీరనుకుంటారా? [కీర్తన 46:9 చదవండి. ఆ తర్వాత వారిని ప్రతిస్పందించనివ్వండి.] ఇదెలా నెరవేరుతుందో, యుద్ధంలేని లోకం గురించిన దేవుని వాగ్దానాన్ని మనమెందుకు నమ్మవచ్చో ఈ కావలికోట సంచిక చర్చిస్తుంది.”