పత్రికల గురించి ఏమని చెప్పాలి?
కావలికోట డిసెం. 15
“సంవత్సరంలోని ఈ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యేసు జననాన్ని అనేక రకాలుగా జ్ఞాపకం చేసుకుంటారు. బైబిలు ప్రవచనం యేసు జననాన్ని శాశ్వత శాంతితో ముడిపెడుతుందని మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత యెషయా 9:6, 7 చదవండి.] అలాంటి శాంతి ఎలా సాధించబడుతుందో ఈ పత్రిక వివరిస్తుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“మాకు వివక్ష లేదని మనలో చాలామందిమి భావిస్తాం కానీ ఏ మాత్రం పక్షపాతం లేనివారు ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత, 11వ పేజీలోని బాక్సువైపు దృష్టిమళ్ళించండి. బాక్సులోని కొన్ని అంశాలను ఉన్నతపరచిన తర్వాత అదే పేజీలోని రెండవ పేరావైపు దృష్టిమళ్లించండి.] తేజరిల్లు! యొక్క ఈ సంచిక వివక్షకుగల మూలకారణాలను, దానిని మనం ఎలా అధిగమించవచ్చనే విషయాన్ని వివరిస్తోంది.”
కావలికోట జన. 1
“ప్రజలు తమ పొరుగువారిని ప్రేమించాలని చాలా మతాలు బోధిస్తాయి. [మత్తయి 22:39 చదవండి.] అయితే, ప్రపంచంలో జరిగే ఇన్ని యుద్ధాల్లో, పోరాటాల్లో మతం ఎందుకు ఇమిడివుందని మీరు అనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] కావలికోట యొక్క ఈ సంచిక, మతం మానవాళిని ఐక్యపరచగలదా? అనే ప్రశ్నను పరిశీలిస్తుంది.”
తేజరిల్లు! జన.-మార్చి.
“చిన్న వయస్సునుండి పిల్లలకు శిక్షణ ఇవ్వడంలోని ప్రాముఖ్యతను చాలామంది గ్రహిస్తున్నారు. నేడు ఈ అవసరత ఉన్నట్లు మీకు కనబడుతుందా? [ప్రతిస్పందించనివ్వండి. తర్వాత సామెతలు 22:6 చదవండి.] తేజరిల్లు! యొక్క ఈ సంచిక, తమ పిల్లలు నీతిగలవారిగా, విజయవంతమైన వ్యక్తులుగా వికసించేందుకు సహాయం చేయడానికి తల్లిదండ్రులకు దోహదపడే నిర్దిష్టమైన విషయాలను చర్చిస్తోంది.”