సేవా కూటాల పట్టిక
డిసెంబరు 9తో ప్రారంభమయ్యే వారం
పాట 18 (162)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) డిసెంబరు 15 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి.
15 నిమి: “రాజ్య సందేశాన్ని ప్రకటించండి.”a 3వ పేరా చర్చిస్తున్నప్పుడు, సువార్తను ఇతరులతో పంచుకునేటప్పుడు నేరుగా బైబిల్లో నుండి ఎలా చదవాలో తెలియజేసే సలహాలను చేర్చండి.—km 12/01 పే. 1, పేరా 3.
18 నిమి: ప్రతి సత్కార్యములోను ఫలవంతంగా ఉండండి. ప్రేక్షకులు పాల్గొనే ప్రసంగం. ఒక పెద్ద నిర్వహించాలి. స్థానిక సంఘ చరిత్రను, అభివృద్ధిని సమీక్షించండి, సంఘం ఏర్పడడానికి చేయబడిన ప్రయత్నాలను కూడా వాటిలో చేర్చండి. సంఘం ఏర్పడే సమయంలో ఉన్న వారెవరైనా ఉంటే ప్రోత్సాహకరమైన అనుభవాలను వినిపించేందుకు వారితో ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి. ఇంకా అభివృద్ధి చెందేందుకు గల అవకాశాలను పరిశీలించండి, సంఘ కార్యకలాపాలకు ఉత్సాహంతో మద్దతునిమ్మని అందరినీ ప్రోత్సహించండి.
పాట 17 (187), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 16తో ప్రారంభమయ్యే వారం
పాట 8 (53)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. డిసెంబరు 25న, జనవరి 1న చేయబోయే ప్రత్యేక క్షేత్ర సేవ ఏర్పాట్ల గురించి క్లుప్తంగా చెప్పండి.
15 నిమి: బుద్ధిగలవారు గ్రహిస్తారు. (దాని. 12:3, 10) ఒక ప్రదర్శన. ఆసక్తి గల ఒక వ్యక్తి ఇలా అడుగుతాడు: “బైబిలు బోధిస్తున్న దాని గురించి మీకు సరైన అవగాహన ఉందని నేనెలా నమ్మవచ్చు?” బైబిలు పరిశోధన చేసేటప్పుడు అంశానుక్రమమైన పద్ధతిని ఎలా ఉపయోగించాలో ప్రచారకుడు ఆయనకు వివరిస్తాడు. (w96 5/15 19, 20 పేజీలు) తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలోని 112-17 పేజీల నుండి ఒకటో రెండో ఉదాహరణలను ఉపయోగించి, లేఖనాలను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా ఈ భూమి గురించిన దేవుని సంకల్పాన్ని మనమెలా అవగాహన చేసుకున్నామో ఆయన చూపిస్తాడు. అదే పద్ధతిని ఉపయోగించి ఇతర బైబిలు బోధనలను కూడా సరిగ్గా ఎలా అర్థం చేసుకోవచ్చో ప్రచారకుడు వివరించి బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదిస్తాడు.
20 నిమి: “విశ్వసనీయులైన వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి.”b కావలికోట ఆగస్టు 1, 1994, 29వ పేజీలోని వ్యాఖ్యానాలను చేర్చండి. అనారోగ్యంతో ఉన్నవారు 15 నిమిషాల చొప్పున కూడా క్షేత్ర సేవా రిపోర్టును ఇచ్చే ఏర్పాటు గురించి తెలియజేయండి. అలాంటివారితో సహవసించడం ద్వారా ఇరువైపుల వారు ఎలా ఆశీర్వదించబడ్డారో తెలియజేసే కొన్ని అనుభవాలను పంచుకునే ఏర్పాటు చేయండి.
పాట 1 (13), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 23తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ అక్టోబరు-డిసెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) జనవరి 1 కావలికోటను, ఎలా ప్రతిపాదించాలో ప్రదర్శించండి. జనవరి 6తో ప్రారంభమయ్యే వారంలోని కూటంలో జరిగే చర్చకు సిద్ధపాటుగా రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది (ఆంగ్లం) వీడియోను చూడమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: స్థానిక అవసరాలు.
20 నిమి: “ఖచ్చితమైన రిపోర్టు సేకరించబడేందుకు మీరు సహకరిస్తున్నారా?”c 2వ పేరా చర్చించేటప్పుడు మన పరిచర్య పుస్తకంలోని 106-8 పేజీల్లోని వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 20 (93), ముగింపు ప్రార్థన.
డిసెంబరు 30తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (212)
8 నిమి: స్థానిక ప్రకటనలు. డిసెంబరు క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. కొత్త సంవత్సరం కోసం మీ సంఘ కూటాల సమయాల్లో మార్పు చేస్తున్నట్లయితే, ఆ కొత్త సమయాలకు క్రమంగా హాజరవమని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రోత్సహించండి. జనవరి నెలలోని సాహిత్య ప్రతిపాదనలను ప్రస్తావించండి, సంఘంలో స్టాకున్న పుస్తకాల గురించి ప్రాముఖ్యంగా తెలియజేయండి.
12 నిమి: అవిశ్వాసం ఎందుకు కలుగుతుంది? ప్రేక్షకులతో చర్చ. విశ్వాసం అంతగా లేనివారిని మనం తరచూ కలుస్తుంటాం. (2 థెస్స. 3:2) వారితో యెహోవా గురించిన సత్యాన్ని పంచుకోవాలంటే, ముందు దేవుని గురించి వారి ఆలోచనను ప్రభావితం చేసిందేమిటో ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రజలు విశ్వసించకుండా ఆటంకపరిచే నాలుగు కారణాలు తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలోని 129, 30 పేజీల్లో ప్రస్తావించబడ్డాయి, వాటిని పరిశీలించండి. అక్కడ ప్రస్తావించబడిన ఒక్కొక్క సందర్భంలో ఎలా వ్యవహరించవచ్చో సూచించమని ప్రేక్షకులను ఆహ్వానించండి. సమర్థంగా వ్యవహరించబడిన ఒక అనుభవాన్ని చెప్పండి లేదా ఆగస్టు 22, 1993 (ఆంగ్లం), తేజరిల్లు! సంచికలోని 14, 15 పేజీల్లోనున్న ఒక దాన్ని ఉపయోగించండి.
25 నిమి: “స్థానికాచారాలు, సత్యారాధన”d సమర్థవంతుడైన పెద్ద నిర్వహించాలి. క్లుప్తమైన రెండు ప్రదర్శనలను చేర్చండి. ఒకదాంట్లో ఒక సహోదరి సముచితమైన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవిశ్వాసి అయిన తన భర్తతో కౌటుంబిక సందర్భాలైన నామకరణం, అన్నప్రాశనం వంటి మత లాంఛనాల్లో తను వహించే స్థానం గురించి ఔచిత్యంతో తెలియజేసేలా చూడండి. రెండవదాంట్లో ఒక పరిచర్య సేవకుడు తాను కొన్ని అంత్యక్రియల ఆచారాల్లో లేదా శ్రాద్ధమునకు సంబంధించిన ధర్మాల్లో ఎందుకు భాగం వహించడో అవిశ్వాసులైన తన తల్లిదండ్రులకు ఎలా వివరిస్తాడో ప్రదర్శించమనండి.
పాట 5 (46), ముగింపు ప్రార్థన.
జనవరి 6తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
13 నిమి: స్థానిక ప్రకటనలు. జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ఎలా ప్రతిపాదించాలో తెలియజేసే, బాగా రిహార్సల్ చేసిన ఒక ప్రదర్శనను ప్రదర్శించండి. ప్రచారకుడు తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత, “యేసుక్రీస్తు గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు చాలామంది ఆయనను ఒక శిశువుగా లేదా బాధపడుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ఊహించుకుంటారు. యేసు గురించిన వారి ఊహలో కేవలం ఆయన జననం, మరణం మాత్రమే ఉంటాయి. ఆయన తన జీవిత కాలంలో చెప్పిన, చేసిన అద్భుత కార్యాలు తరచూ మరుగునపడిపోతాయి. ఆయన నిర్వర్తించినది, ఇప్పటి వరకు భూమిపై జీవించిన ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆయన మన పక్షాన చేసిన అద్భుత కార్యాల గురించి మనకు సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం” అని అనవచ్చు. యోహాను 17:3 చదవండి. మహాగొప్ప మనిషి పుస్తకంలోని పరిచయమాటలున్న మొదటి పేజీని తెరచి నాలుగవ పేరా చదవండి. నిజమైన ఆసక్తిని చూపిస్తే, ప్రచారకుడు “నేను ఈ పుస్తకాన్ని మీకివ్వాలనుకుంటున్నాను, దీన్ని చదివి మీరు తప్పకుండా ఆనందిస్తారని నా నమ్మకం. మీరు చదవాలని ఇష్టపడితే దీన్ని తీసుకోవచ్చు” అని అనవచ్చు. ఇంటింటి సేవలోనూ తటస్థ సాక్ష్యంలోనూ ప్రజలు ఆసక్తి చూపించినప్పడు మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ఉపయోగించమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: రక్తం విషయంలో దేవుని నియమాన్ని పాటించడంలో సహాయం. యోగ్యుడైన పెద్ద ఇచ్చే ప్రసంగం, బ్రాంచి కార్యాలయం అందజేసిన సంక్షిప్తప్రతి ఆధారంగా ఇవ్వబడుతుంది. ఈ క్రింద సూచించబడినవి సంఘంలో పంచడానికి సరిపడేన్ని కార్యదర్శి దగ్గర ఉండాలి: అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు. కూటం తర్వాత వీటిని బాప్తిస్మం పొందిన ప్రచారకులకు ఇవ్వాలి, కానీ ఇదే రాత్రి వీటిని పూరించకూడదు. సంతకాలు చేయడం, సాక్షులుగా ఉండడం, కార్డులపై తేదీలు వేయడం వంటివి తర్వాతి వారంలో జరిగే సంఘ పుస్తక అధ్యయనం తర్వాత చేయవచ్చు, అవసరమైతే పుస్తక అధ్యయన పైవిచారణకర్త సహాయం తీసుకోవచ్చు. [తమ పిల్లల కోసం ఐడెంటిటీ కార్డులు తల్లిదండ్రులకు లభ్యమయ్యేలా చూడాలి.] సాక్షులుగా సంతకం చేసేవారు ఆయా వ్యక్తులు డాక్యుమెంటుపై సంతకం చేసేటప్పుడు చూడాలి. బాప్తిస్మం పొందని ప్రచారకులు ఈ డాక్యుమెంటుల్లోని మాటలనే ఉపయోగించుకొంటూ తమ పరిస్థితులు తమ దృఢవిశ్వాసాలను బట్టి తమ కోసం, తమ పిల్లల కోసం తమ సొంత డైరెక్టివ్‌ను వ్రాసుకోవచ్చు.
17 నిమి: “రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది” (ఆంగ్లం) వీడియోను మీరు తప్పకుండా చూడాలి. యోగ్యుడైన ఒక పెద్ద నిర్వహించాలి. రక్త రహిత చికిత్స వీడియో గురించి నేరుగా ప్రేక్షకులతో చర్చ ప్రారంభించండి, 7వ పేజీలోని బాక్సులో ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. ఆ తర్వాత బాక్సులోని చివరి పేరా చదవండి.
పాట 2 (15), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.