పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“అంత్యదినాల్లో కష్టమైన పరిస్థితులు ఉంటాయని బైబిలు ప్రవచించింది. [2 తిమోతి 3:1, 3 చదవండి.] ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేరాల సంఖ్య ఈ విషయాన్ని రుజువుచేస్తోంది. పోలీసులు లేకపోతే పరిస్థితులు ఇంకెంత ఘోరంగా ఉండేవో కదా! ప్రపంచవ్యాప్తంగా పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్ళను తేజరిల్లు! యొక్క ఈ సంచిక చర్చిస్తుంది.”
కావలికోట అక్టో. 15
“నేడు ఎందుకు ఇన్ని దుష్టకార్యాలు జరుగుతున్నాయో పిల్లలకు లేదా ఇతరులకు మీరు ఎలా వివరిస్తారు? [జవాబు చెప్పనివ్వండి.] ‘దుష్టత్వానికంతటికీ బాధ్యులెవరు?’ అన్న ప్రశ్నకు బైబిలు సమాధానం చెబుతుంది. [1 యోహాను 5:19 చదవండి.] ఆ దుష్టుడు ఎవరో మనం అతన్ని ఎలా ఎదిరించవచ్చో అర్థం చేసుకోవడానికి కావలికోట యొక్క ఈ శీర్షిక మీకు సహాయపడుతుంది.”
తేజరిల్లు! అక్టో.-డిసెం.
“చాలామంది పోర్నోగ్రఫీని కేవలం హానిరహితమైన వినోదంగా, కాలక్షేపం కోసం చేసేదిగా దృష్టిస్తారు. అది వ్యక్తులకు, కుటుంబాలకు, మరియు సమాజానికి హాని చేకూరుస్తుందని ఇతరులు భావిస్తారు. తేజరిల్లు! యొక్క ఈ సంచిక, ఈ అంశానికి సంబంధించిన బైబిలు సూత్రాల వెలుగులో పోర్నోగ్రఫీని పరిశీలిస్తుంది. ఉదాహరణకు ఎఫెసీయులు 4:17-19 వచనాలు చదవండి.
కావలికోట నవం. 1
“మనలో చాలామందిమి ఇతరులతో శాంతియుతమైన సంబంధాలు కలిగివుండడానికి ప్రయత్నిస్తాము. కానీ అలా చేయడం కంటే చెప్పడం చాలా సులభం అని మీరు అంగీకరించవచ్చు. [జవాబు చెప్పనివ్వండి.] పరిస్థితి ఎందుకు అలా ఉందో బైబిలు వివరిస్తుంది. [యాకోబు 3:2 చదవండి.] శాంతిని తిరిగి నెలకొల్పడానికి, శాంతియుతంగా కొనసాగడానికి కేవలం క్షమాపణ చెప్పడం కీలకంగా ఎలా పనిచేయగలదో ఈ ఆర్టికల్ చూపిస్తుంది.”