సేవా కూటాల పట్టిక
గమనిక: సమావేశాలు జరిగే నెలల్లో ప్రతి వారం జరిగే సేవా కూటాల పట్టికను మన రాజ్య పరిచర్య మామూలుగానే అందజేస్తుంది. “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశానికి హాజరుకావడానికి వీలుగా సంఘాలు అవసరమైన విధంగా సవరింపులు చేసుకోవచ్చు. సముచితమైన చోట, సమావేశానికి హాజరుకావడానికి ముందు చివరి సేవా కూటంలో, ఈ నెల మధ్యపేజీల్లో నుండి స్థానికంగా అన్వయించే అవసరమైన విషయాల్ని మళ్ళీ చెప్పడానికి 15 నిమిషాలు ఉపయోగించుకోండి. జనవరి నెలలో, సమావేశ కార్యక్రమ ముఖ్యాంశాలను తిరిగి పరిశీలించడానికి ఒక పూర్తి సేవా కూటము ఏర్పాటు చేయబడుతుంది. ఆ చర్చకు సిద్ధపడేందుకుగాను మనమందరం సమావేశంలో అర్థవంతమైన నోట్సు రాసుకోవచ్చు, దానిలో మన స్వంత జీవితంలోనూ క్షేత్ర పరిచర్యలోనూ వ్యక్తిగతంగానూ మనం అన్వయించుకోవాలనుకుంటున్న నిర్దిష్టమైన అంశాల పట్టికను కూడా చేర్చవచ్చు. అప్పుడు సమావేశానికి హాజరైన తర్వాత నుండి ఆ సలహాలను మనం ఎలా అన్వయించుకుంటున్నామో వివరించవచ్చు. అందజేయబడిన మంచి ఉపదేశం నుండి తామెలా ప్రయోజనం పొందారో ఒకరి కొకరు చెప్పుకోవడాన్ని వినడం పరస్పర ప్రోత్సాహానికి నడిపిస్తుంది.
సెప్టెంబరు 9తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను (పత్రికా అందింపు కాలమ్‌లో మొదటిది), సెప్టెంబరు 15 కావలికోటను ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. ‘యెహోవాసాక్షులంటే నాకిష్టం లేదండి’ అంటూ సంభాషణను ఆటంకపర్చే వారితో ఎలా వ్యవహరించాలో ఒక్కో ప్రదర్శనలో ఒక్కో విధంగా చూపించండి.—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 9వ పేజీ చూడండి.
16 నిమి: “యెహోవాను మహిమపరచడానికి ఇతరులకు సహాయం చేయడం.”a సమయం ఉంటే లేఖనముల నుండి తర్కించుట పుస్తకంలోని 196-9 పేజీల్లో నుండి ఒకటి రెండు ఆచరణాత్మకమైన అంశాలను చెప్పండి.
17 నిమి: మనం గత సంవత్సరం ఏమి సాధించాము? సేవా పైవిచారణకర్త ఇచ్చే ప్రసంగం. 2002 సేవా సంవత్సరానికి సంఘ రిపోర్టులోని ముఖ్యాంశాలను తెలియజేయండి. సాధించిన మంచి విషయాల గురించి ప్రతి ఒక్కరినీ ప్రశంసించండి. మెరుగుపరుచుకోవడానికి ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తూ కూటాలకు హాజరుకావడంలో, పునర్దర్శనాలూ బైబిలు అధ్యయనాలూ చేయడంలో సహాయ పయినీరు సేవ చేయడంలో సంఘం సాధించిన అభివృద్ధిపై శ్రద్ధ నిలపండి. రానున్న సంవత్సరం కోసం చేరుకోగల లక్ష్యాలను పెట్టుకోండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 16తో ప్రారంభమయ్యే వారం
పాట 9 (37)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
17 నిమి: “ఒక ప్రత్యేకమైన పరస్పర ప్రోత్సాహం.” ప్రసంగం. జిల్లా సమావేశానికి హాజరుకావడంపై మెప్పును పెంపొందించండి. మొదటి రోజు ఉదయం నుండి మూడవ రోజు మధ్యాహ్నం వరకూ కార్యక్రమ భాగాలన్నింటికీ హాజరుకమ్మని అందరికీ ఉద్బోధించండి.
18 నిమి: “ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.”b మన ప్రయోజనార్థం చేయబడిన రూమింగ్ ఏర్పాట్లకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పండి. 2వ పేరాలోని ఆరు జ్ఞాపికలనూ నొక్కి చెప్పండి. ప్రతి ఒక్కరూ మంచి ప్రవర్తన కలిగి ఉండడం ఎందుకు ఆవశ్యకమో వివరించండి.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 23తో ప్రారంభమయ్యే వారం
పాట 1 (13)
12 నిమి: స్థానిక ప్రకటనలు. వచ్చే వారం సేవా కూటం కోసం సిద్ధపాటుగా ముందటి ప్రాంతీయ సమావేశంలో వ్రాసుకున్న నోట్సును ఒకసారి చూసుకోమని అందరినీ ప్రోత్సహించండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను (పత్రికా అందింపు కాలమ్‌లో మూడవది) ఎలా అందించాలో ఒక పరిచర్య సేవకుడిని, అక్టోబరు 1 కావలికోటను ఎలా అందించాలో ఒక పెద్దను ప్రదర్శించమనండి. ప్రతి ప్రదర్శన తర్వాత, గృహస్థుల ఆసక్తిని రేకెత్తించడానికి ఉపయోగించబడిన ఒకటి లేక రెండు ప్రారంభ వాక్యాలను మళ్ళీ చెప్పండి.
15 నిమి: “మీ ఆధ్యాత్మిక అవసరాన్ని తృప్తిపరుచుకోండి.” ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. అందరూ సమావేశ కార్యక్రమానికి పూర్తి అవధానాన్ని ఎందుకివ్వాలనేదానికి కారణాలను పరిశీలించండి. కేవలం వినడం మాత్రమే గాక మనం నేర్చుకునేదాన్ని అన్వయించుకోవలసిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పండి. జిల్లా సమావేశ ముఖ్యాంశాలను పరిశీలించే, జనవరిలోని ఒక సేవా కూటం కోసం ప్లాన్ చేయబడిన దాని గురించి పైన ఇవ్వబడిన గమనికను పరిశీలించండి. నోట్సు తీసుకోమని అందరినీ ప్రోత్సహించండి. గత సంవత్సర కార్యక్రమం నుండి పొందిన ప్రయోజనాల గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేయమనండి.
18 నిమి: “రిశుభ్రత యెహోవాకు మహిమను తెస్తుంది.”c ఒక పెద్ద నిర్వహించాలి, ప్రతి పేరా చర్చించబడిన తర్వాత ఆయన ఆ పేరాను చదువుతాడు. సమావేశమంతటిలోనూ పరిశుభ్రతను కాపాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యమో గ్రహించడం, బహిరంగ స్థలాల్లో మన వ్యక్తిగత రూపం గురించి జాగ్రత్తగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమైనదో గ్రహించడానికి అందరికీ సహాయం చేయండి.
పాట 17 (187), ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 30తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
5 నిమి: స్థానిక ప్రకటనలు. సెప్టెంబరు క్షేత్రసేవా రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి.
15 నిమి: మన పత్రికలను విశేషమైనవిగా చేసేదేమిటి? ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. అక్టోబరు నెలలో మనం కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందిస్తాము. పత్రికలు ఎందుకు విశేషమైనవనే దానికి కారణాలను చర్చించండి: (1) అవి యెహోవా నామమును ఉన్నతపరుస్తాయి. (2) యేసుపై విశ్వాసముంచమని ప్రోత్సహిస్తాయి. (3) దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తాయి. (4) బైబిలును అత్యున్నత ఆధికారికంగా దానివైపుకు అవధానాన్ని మళ్ళిస్తాయి. (5) బైబిలు ప్రవచనాల నెరవేర్పును వివరిస్తాయి. (6) ప్రపంచ సంఘటనల వెనుకనున్న అసలైన భావాన్ని వివరిస్తాయి. (7) నేటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తాయి. (8) అన్ని వర్గాల ప్రజల ఆసక్తినీ చూరగొంటాయి. (9) రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉంటాయి. సంభాషణను ప్రారంభించడానికి ఈ విషయాల్లో ఏదైనా ఒకదాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తూ రెండు క్లుప్తమైన ప్రదర్శనలను అందించండి.
25 నిమి: “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి.” (ప్రక. 14:7) గత సేవా సంవత్సరంలో జరిగిన ప్రాంతీయ సమావేశ కార్యక్రమాన్ని తిరిగి పరిశీలిస్తూ చేసే ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. నేర్చుకున్న కీలకాంశాలపైనా, వ్యక్తిగతంగా గానీ కుటుంబంగా గానీ తాము వాటిని ఎలా అన్వయించుకోగల్గుతున్నారు అనేదానిపైనా వ్యాఖ్యానించమని సంఘాన్ని ఆహ్వానించండి. (భాగాలను ముందుగానే నియమించవచ్చు.) ఈ కార్యక్రమ భాగాలపై చర్చించండి: (1) “దేవుని పట్ల భయాన్ని పెంపొందించుకోవడానికి కొత్తవారికి సహాయం చేయండి.” జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన ఆసక్తి గలవారు అభివృద్ధి సాధించి, చురుకైన యెహోవా సేవకులయ్యేందుకు మనం ఎలా సహాయం చేయవచ్చు? (2) “యెహోవాయందు భయభక్తులు కలిగివుండడం అంటే చెడును అసహ్యించుకోవడమే.” (W87, 4/15, 16-18) యెహోవా అసహ్యించుకునే అహంకారం, కల్లలాడడం, వస్తుసంబంధమైనవాటి కోసం పడే ప్రయాసలు, అనారోగ్యకరమైన వినోదం, ఇంటర్‌నెట్‌ను దుర్వినియోగం చేయడం వంటివాటి నుండి దూరంగా ఉండడానికి సామెతలు 6:16-19 వచనాలు మనకెలా సహాయం చేయగలవు? (3) “మీరు ప్రేమించేవారికి మరింత సన్నిహితులవ్వండి.” మనం యెహోవాను, యేసును, కుటుంబ సభ్యులను, సంఘంలోని వారిని ప్రేమిస్తాము; వారికి సన్నిహితమవ్వడం లోకం నుండి మనల్ని ఎలా కాపాడుతుంది? (4) “మనుష్యులకు కాదు, యెహోవాకు భయపడండి.” యెహోవాకు అప్రీతికరమైనది చేయకూడదనే భయం, ప్రకటించేటప్పుడు నిర్భయంగా ఉండడానికి, పనిస్థలంలోనూ పాఠశాలలోనూ దైవిక సూత్రాలను హత్తుకొని ఉండడానికి లేదా కూటాలకు సమావేశాలకు హాజరుకావద్దని మీ యజమాని చేసే ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీకెలా సహాయం చేసింది? (5) “దేవుని మహిమార్థమై సమస్తమును చేయండి.” (కీర్త. 119:37; హెబ్రీ. 4:13) అమితంగా త్రాగడం, అశ్లీల చిత్రాలను చూడడం, లేదా రహస్యమైన ఇతర పాపాలను చేస్తూ ఉండడం వంటివాటిని చేయకుండా దైవిక భయం ఎందుకు మనల్ని నివారించాలి? (6) “యెహోవా మీదున్న భయంతో నడుస్తూ ఉండండి.” యెహోవా ఆత్మ మీ జీవితంలో పూర్తిగా కార్యనిర్వహణ చేయడానికి అనుమతించినందుకు యెహోవా మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాడు?—కీర్త. 31:19; 33:19; 34:9, 17; 145:19.
పాట 11 (85), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 7తో ప్రారంభమయ్యే వారం
పాట 18 (162)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “దైవపరిపాలనా కార్యకలాపాల కోసం ఉపయోగించే వనరుల పట్ల కృతజ్ఞతను చూపించండి.”d పెద్ద నిర్వహించాలి. స్థానికంగా గమనించిన దానిపై, మన సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించడానికి సంఘం ఏమి చేయాలనేదానిపై వ్యాఖ్యానించండి. నిజానికి ఎంత సాహిత్యం అవసరమో అంతే తీసుకోమని అందరికీ చెప్పండి. ప్రపంచవ్యాప్త పనికి మద్దతుగా ఆర్థికంగా విరాళాలిచ్చేందుకు మనకున్న ఆధిక్యతను గుర్తుంచుకోండి.
20 నిమి: “‘వ్యర్థమైనవాటిని’ వెంబడించడాన్ని నివారించండి”e 4వ పేరాను చర్చించిన తర్వాత, 1999 నవంబరు మన రాజ్య పరిచర్య మధ్య పేజీల్లోని 30-2 పేరాలపై వ్యాఖ్యానించండి. 5వ పేరాను చర్చించేటప్పుడు, అక్టోబరు 1, 1994, కావలికోట 8వ పేజీలోని బాక్సుపై వ్యాఖ్యానించండి. 6వ పేరాతోపాటు 1999 నవంబరు మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లోని 18వ పేరాను చదవండి.
పాట 6 (45), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.