కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/02 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఉపశీర్షికలు
  • ఆగస్టు 12తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 19తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 26తో ప్రారంభమయ్యే వారం
  • సెప్టెంబరు 2తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2002
km 8/02 పేజీ 2

సేవా కూటాల పట్టిక

ఆగస్టు 12తో ప్రారంభమయ్యే వారం

పాట 9 (37)

13 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మొదటిది.) ఆగస్టు 15 కావలికోటను ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. “మీరెందుకిలా తరచు కలుస్తుంటారు” అంటూ సంభాషణను ఆటంకపరిచే వారితో ఎలా వ్యవహరించాలో ఒక్కో ప్రదర్శనలో ఒక్కో విధంగా చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 12వ పేజీ చూడండి.

20 నిమి: “ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పర్చుకోండి.”a 5వ పేరాను చర్చించేటప్పుడు, మన పరిచర్య పుస్తకంలోని 114, 116 పేజీల నుండి క్రమ పయినీరు సేవ గురించి బేతేలు సేవ గురించి ప్రోత్సాహకరమైన వ్యాఖ్యానాలను చేర్చండి.

12 నిమి: స్థానిక అనుభవాలు. మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఉపయోగించినప్పుడు వారికి ఎదురైన అనుభవాలను చెప్పమని సంఘాన్ని ఆహ్వానించండి. ఏవైనా బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయా? అలాగైతే వాటిని ఎలా ప్రారంభించగలిగారో వివరించండి లేదా ఒకటి రెండు అనుభవాలను అభినయించి చూపించండి. 2001, నవంబరు మన రాజ్య పరిచర్యలోని 4వ పేజీలోవున్న “కరపత్రం అందించడానికి లభించే అవకాశాలు” అనే బాక్సును పునఃసమీక్షించండి.

పాట 4 (43), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 19తో ప్రారంభమయ్యే వారం

పాట 24 (185)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

17 నిమి: వారిని ఏది ఆపుచేస్తుంది? ప్రేక్షకులతో చర్చ, ప్రదర్శన. మనం సాధారణంగా మన పరిచర్యలో తమ విశ్వాసాలను మనతో చర్చించడానికి ఇష్టపడని ప్రజలను కలుస్తుంటాము. మనం వారితో రాజ్య సందేశాన్ని పంచుకోకుండా ఆపుచేయగల ఆటంకాన్ని అది మన ముందుంచుతుంది. ఒక వ్యక్తి ఎందుకు అలా చేస్తున్నాడో మనం గ్రహించడం, ఆ వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసేలా ప్రోత్సహించే అందింపును సిద్ధం చేసుకోవడానికి మనకు సహాయపడవచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన ప్రజల వంటివారు కలిస్తే మనం మన అందింపుకు ఎలాంటి మార్పులు చేసుకోవచ్చో చర్చించండి: (1) మతమంటేనే, చివరికి తమ స్వంత మతమన్నా కూడా ఉదాసీనత చూపించేవారు. (2) తమ కుటుంబమూ తమ పూర్వికులూ ఆచరించే మతపరమైన ఆచారాలంటే ఎంతో ఇష్టపడేవారు. (3) వారి విశ్వాసాలకు లేఖనాధారిత మద్దతు చాలా తక్కువే కాబట్టి వాటి గురించి మాట్లాడడానికి ఇబ్బందిపడేవారు. (4) వ్యతిరేకుల తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలవల్ల మన గురించి దురభిప్రాయం కలవారు. అంతేకాకుండా స్థానిక క్షేత్రంలో సాధారణంగా ఎదురయ్యే ప్రజల వైఖరులకు తగినట్లుగా లిస్టును సవరించుకోండి. ఒక వ్యక్తిని లేఖనాధారమైన సంభాషణలోకి ఎలా దించాలో చూపించే క్లుప్తమైన ప్రదర్శనను చేర్చండి.

18 నిమి: “మీ సొంతవాళ్ళు బహిష్కరించబడినప్పుడు క్రైస్తవ విశ్వసనీయతను కనబర్చండి.”b (1-8 పేరాలు) ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ, మంచి అర్హుడైన పెద్ద నిర్వహించాలి. చక్కగా చదవగలిగే సామర్థ్యమున్న సహోదరుని చేత ప్రతీ పేరాను బిగ్గరగా చదివించండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 26తో ప్రారంభమయ్యే వారం

పాట 12 (113)

10 నిమి: స్థానిక ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో మూడవది.) ఎలా అందించాలో ఒక సంఘ ప్రచారకుడిని/ప్రచారకురాలిని ప్రదర్శించమనండి, సెప్టెంబరు 1 కావలికోటను ఎలా అందించాలో ఒక క్రమ లేక సహాయ పయినీరును ప్రదర్శించమనండి. తమ అందింపులో ఒక లేఖనాన్ని చేర్చమని ప్రచారకులందరినీ ప్రోత్సహించండి.

17 నిమి: “సంభాషించేవారిగా ఉండండి!”c ముగింపులో, పాఠశాల నిర్దేశక పుస్తకములో (ఆంగ్లం), 5-9 పేజీలను సమీక్షించమని ప్రచారకులను ప్రోత్సహించండి.

18 నిమి: “మీ సొంతవాళ్ళు బహిష్కరించబడినప్పుడు క్రైస్తవ విశ్వసనీయతను కనబర్చండి.”d (9-14 పేరాలు) ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగిస్తూ, మంచి అర్హుడైన పెద్ద నిర్వహించాలి. చక్కగా చదవగలిగే సామర్థ్యమున్న సహోదరుని చేత ప్రతీ పేరాను బిగ్గరగా చదివించండి.

పాట 9 (37), ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 2తో ప్రారంభమయ్యే వారం

పాట 6 (45)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు క్షేత్రసేవ రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి. 1999, మే 1, కావలికోట, 25వ పేజీలోని “మీ పిల్లలతో చదవండి” అనే ఆర్టికల్‌ను క్లుప్తంగా ఉన్నతపర్చండి.

20 నిమి: మీరు వెళ్ళేముందు సిద్ధపడండి. చర్చ మరియు ప్రదర్శన. మంచి ప్రణాళిక వేసుకోవడం మనం మరింత ప్రభావవంతంగా పరిచర్య చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ముందుగానే, (1) మీకు అవసరమయ్యే సాహిత్యాన్ని సంపాదించుకోండి. (2) సరిపడినన్ని ఇంటింటి సేవా రికార్డులు, పెన్ను లేక పెన్సిలు ఉండేలా చూసుకోండి. (3) మీకు రవాణా అవసరమైతే, తగిన ప్రయాణ ఏర్పాట్లను చేసుకోండి. (4) మీరు చేయాలనుకుంటున్న పునర్దర్శనాల గురించి ఆలోచించండి. (5) మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో సిద్ధపడండి. ఒకవేళ క్షేత్రసేవ కోసమైన కూటాన్ని మీరు నిర్వహిస్తున్నట్లైతే, సరిపడేంత క్షేత్రం ఉండేలా చూసుకోండి. సెప్టెంబరు నెలలో పరిచర్య చేసేటప్పుడు సృష్టి (ఆంగ్లం), మహాగొప్ప మనిషి, యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) పుస్తకాలను అందించడానికి రెండు మూడు విధానాలను ప్రేక్షకులతో చర్చించండి. అందింపుల్లో ఒకదాన్ని ప్రదర్శించండి, చర్చలో ఒక లేఖనాన్ని చేర్చండి.​—⁠మన రాజ్య పరిచర్య, జూన్‌ 1995, 4వ పేజీ, జూన్‌ 1998, 8వ పేజీ, మార్చి 1994, 8వ పేజీల్లోని సలహాలను చూడండి.

15 నిమి: “నేర్పుతో​—సువార్త ప్రకటించడం.”e పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం)లో, 70-72 పేజీలలోని 4-8 పేరాలనుండి యుక్తమైన పాయింట్లను సమీక్షించండి. క్షేత్ర పరిచర్యలో ఎదురవ్వగల పరిస్థితులతో నేర్పుగా ఎలా వ్యవహరించాలో ప్రేక్షకులను వ్యాఖ్యానించమనండి.

పాట 8 (53), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి