కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/02 పేజీ 1
  • నేర్పుతో—సువార్త ప్రకటించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేర్పుతో—సువార్త ప్రకటించడం
  • మన రాజ్య పరిచర్య—2002
మన రాజ్య పరిచర్య—2002
km 8/02 పేజీ 1

నేర్పుతో​—సువార్త ప్రకటించడం

1 అనేక రాష్ట్రాలలో మతపరమైన ఉద్రిక్తతలు అధికమవుతుండడంవల్ల, ఇతర మతాల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు త్వరగా అభ్యంతరపడుతున్నారని మనం గమనించివుండవచ్చు. ఇవి ‘అంత్యదినములు,’ ప్రజలు ‘అతిద్వేషులు అజితేంద్రియులు క్రూరులు మూర్ఖులుగా’ ఉంటారని చెబుతూ పౌలు వాటిని వర్ణించాడు. (2 తిమో. 3:1-4) కాబట్టి ఈ పరిస్థితుల్లో సువార్తను ప్రకటించేటప్పుడు యెహోవా ప్రజలు నేర్పుతో వ్యవహరించాలన్నది స్పష్టం.

2 నేర్పు అంటే ఏమిటి? నేర్పు, ఒక క్లిష్టమైన లేదా సున్నితమైన పరిస్థితిలో, ఇతరులతో ఉన్న మంచి సంబంధాలను కాపాడుకోవడానికి లేదా వారి మనస్సు నొప్పించకుండా ఉండడానికి ఏమి చేయాలో లేదా ఏమి చెప్పాలో నిశితంగా తెలిసివుండడం అని నిర్వచించబడింది. క్రైస్తవులుగా మనం ఖచ్చితంగా అన్ని సమాజాల ప్రజలతో మంచి సంబంధాలను కాపాడుకోవాలని, అనవసరంగా వారి మనస్సు నొప్పించడాన్ని నివారించాలని కోరుకుంటాము. కాబట్టి ‘మనకు చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉందాము.’​—రోమా. 12:18.

3 నేర్పుగల క్రైస్తవ సాక్షిగా పౌలు మంచి మాదిరిని ఉంచాడు. ఏథెన్సు ప్రజలు విగ్రహారాధన చేయడం, అనేక అబద్ధ దేవుళ్ళను ఆరాధించడం ఆయన ఆత్మకు పరితాపం కలిగించినప్పటికీ ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చేస్తున్న ఆ పనులనుబట్టి వారిని దూషించలేదు లేదా ఖండించలేదు అన్న విషయాన్ని గుర్తుచేసుకోండి. (అపొ. 17:16) ఏథెన్సు ప్రజల ఎదుట ప్రసంగించేటప్పుడు, ఆ ప్రజలకు అనేక దేవుళ్ళను ఆరాధించడంలోవున్న ఆసక్తిని పౌలు నేర్పుగా తన ప్రసంగానికి చక్కని ఉపోద్ఘాతంగా ఉపయోగించుకున్నాడు.​—అపొ. 17:22-31.

4 మనం కూడా, తమ స్వంత మతసమాజం గురించి తమకున్న ఖచ్చితమైన అభిప్రాయాలను మనతో చెప్పేవారిని కలుస్తాము. మనం ఏమి చేయాలి? నేర్పుతో వ్యవహరించాలి. మొండిగా, జగడమాడేవారిగా లేదా ఆక్షేపించేవారిగా ఉండకూడదు. బదులుగా, సాధ్యమైతే వారికి అంగీకారయోగ్యమైన అంశాలేమిటో గుర్తించడానికి ప్రయత్నించి, వాటిని చర్చించడంలో కొనసాగాలి. మన సందేశంతో ఏకీభవించని వ్యక్తి లేవదీసిన ప్రతి అభ్యంతరాన్ని మనం సవాలు చేయవలసిన లేదా తప్పని నిరూపించవలసిన అవసరం లేదు.

5 మంచి శ్రోతగా ఉండడం: నేర్పు కలిగివుండడంలో ఇది కూడా ఇమిడి ఉంది. మనమే మాట్లాడుతూ ఉండడం మనకు సులభంగా అనిపించవచ్చు, కానీ గృహస్థుడిని తన తలంపులను, అభిప్రాయాలను తెలియజేయమని నేర్పుగా ప్రోత్సహించడం ద్వారా ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో మనం తెలుసుకుంటాము. మనం ప్రశ్నలు అడగడం సహాయకరంగా ఉంటుంది, కానీ మన ప్రశ్నలు గృహస్థుడిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. మన ప్రశ్నలు ఆయన మనస్సులో ఉన్నది రాబట్టేలా, మాట్లాడడానికి ఆయనను ప్రోత్సహించేలా ఉండాలి.

6 మన మాటలు మరియు మన ముఖ కవళికలు, అందరిపట్ల మనకున్న వ్యక్తిగత ఆసక్తిని, దయను, స్నేహశీలతను వ్యక్తం చేస్తే దాన్ని గమనించి అనేకమంది తరచూ అనుకూలంగా ప్రతిస్పందిస్తారు. “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి” అన్న పౌలు సలహాను గుర్తుంచుకోండి.​—కొలొ. 4:6.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి