కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/02 పేజీ 2
  • సేవా కూటాల పట్టిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సేవా కూటాల పట్టిక
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఉపశీర్షికలు
  • జూలై 8తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 15తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 22తో ప్రారంభమయ్యే వారం
  • జూలై 29తో ప్రారంభమయ్యే వారం
  • ఆగస్టు 5తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—2002
km 7/02 పేజీ 2

సేవా కూటాల పట్టిక

జూలై 8తో ప్రారంభమయ్యే వారం

పాట 8 (53)

15 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 4వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మొదటిది.) జూలై 15 కావలికోటను, ఎలా అందించాలో రెండు వేర్వేరు ప్రదర్శనలను ప్రదర్శించండి. ప్రతి ప్రదర్శనలోనూ, “మేము కూడా క్రైస్తవులమే” అని సంభాషణను ఆటంకపరిచే వారితో విభిన్న రీతుల్లో ఎలా వ్యవహరించాలో చూపించండి.​—బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో 11వ పేజీ చూడండి.

15 నిమి: “వర్షాకాలంలో ‘వాక్యాన్ని ప్రకటించండి.’”a సేవా పైవిచారణకర్త నిర్వహించాలి. వర్షాకాలంలో సాక్ష్యమివ్వడానికి ఏ సేవా ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయో వివరించండి. వర్షాకాలపు నెలల్లో పరిచర్యలో సాధ్యమైనంత ఎక్కవగా భాగం వహించడానికి ఆచరణాత్మకమైన షెడ్యూల్‌ తయారుచేసుకోమని అందరినీ ప్రోత్సహించండి.

15 నిమి: అనియత సాక్ష్యమివ్వడానికి సంస్థీకరించబడడం. మన పరిచర్య పుస్తకంలోని 93-4 పేజీల నుండి ప్రేక్షకులతో చర్చ. జనవరి 2002, మన రాజ్య పరిచర్య మధ్య పేజీలలోని మొదటి పేజీలో ఇవ్వబడిన సలహాలను ఉపయోగిస్తూ అపరిచిత వ్యక్తికి, పొరుగింటి వ్యక్తికి, బంధువుకు లేదా పరిచయస్థునికి అనియత సాక్ష్యమివ్వడానికి రెండు లేదా మూడు విధానాలను క్లుప్తంగా ప్రదర్శించండి.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

జూలై 15తో ప్రారంభమయ్యే వారం

పాట 4 (43)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

15 నిమి: స్థానిక అవసరాలు.

20 నిమి: మన పరిచర్యలో బైబిలును ఉపయోగించడానికి గల గట్టి కారణాలు. ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ. యేసుకు లేఖనాలు తెలుసు, ఆయన బోధించేటప్పుడు తరచూ లేఖనాలను ప్రస్తావించేవాడు. (లూకా 24:27, 44-47) ఆయన బోధించినది తన సొంత బోధ కాదు. (యోహా. 7:16-18) మనం కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగించడం ప్రాముఖ్యం. మనం వ్యక్తిగతంగా చెప్పే దేనికన్నా దేవుని వాక్యానికే ఎక్కువ శక్తి ఉంది. (యోహా. 12:49, 50; హెబ్రీ. 4:12) లేఖనాలు అందించే ఉపశమనాన్ని, నిరీక్షణను బట్టి యథార్థవంతులు ఆకర్షించబడతారు. మీరు సాక్ష్యమిచ్చేటప్పుడు కనీసం ఒక్క బైబిలు లేఖనాన్నైనా చదవాలన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ నెల కోసం ఇవ్వబడిన పత్రికా అందింపుల్లో లేఖనాలు చేర్చబడ్డాయని సూచించండి. ప్రేక్షకులు తాము పరిచర్యలో బైబిలును ఎలా ఉపయోగిస్తున్నారో, అది వారి మీదా వారు ఎవరికైతే ప్రకటిస్తున్నారో వారి మీదా ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో వ్యాఖ్యానించమని వారిని కోరండి.

పాట 22 (130), ముగింపు ప్రార్థన.

జూలై 22తో ప్రారంభమయ్యే వారం

పాట 11 (85)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఒక అమ్మాయి/అబ్బాయి తన తల్లి/తండ్రితో పరిచర్యలో కలిసిపనిచేస్తూ జూలై-సెప్టెంబరు, (పత్రికా ప్రదర్శన కాలమ్‌లో ఉన్న మూడవది.) ఆగస్టు 1 పత్రికలను ప్రతిపాదించడానికి 4వ పేజీలోని సలహాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శిస్తారు. ఒకరు తేజరిల్లు!ను ఎలా అందించాలో ప్రదర్శిస్తే, మరొకరు కావలికోటను ఎలా అందించాలో ప్రదర్శిస్తారు. పరిచర్యలో తమ పిల్లలకు క్రమంగా శిక్షణనివ్వమని తల్లిదండ్రులను ప్రోత్సహించండి.

17 నిమి: ఇస్లామ్‌ మతం గురించి అడిగే వ్యక్తికి మీరు ఏమని సమాధానం చెబుతారు? ప్రసంగం, ప్రదర్శన. దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం) పుస్తకంలో 12వ అధ్యాయాన్ని (285వ పేజీలో ఉన్న బాక్సు చూడండి) ఉపయోగిస్తూ లేదా దేవుని మార్గదర్శనము​—⁠పరదైసుకు మన మార్గము (ఆంగ్లం) బ్రోషుర్‌లోని 30వ పేజీలోని 7వ పేరాను ఉపయోగిస్తూ పరిశుద్ధ లేఖనాల గురించి ఖురాన్‌ ఏమని చెబుతోందో క్లుప్తంగా వివరించండి. అంతేకాక, ఫిర్దౌసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా అనే కరపత్రాన్ని ఉపయోగిస్తూ క్రొత్తగా ఆసక్తి చూపించిన వ్యక్తికి, పరదైసు గురించి బైబిలు ఏమి చెబుతుందన్నది ఎలా వివరించాలో ప్రదర్శించండి.

18 నిమి: ఇంటర్‌నెట్‌లోని ప్రమాదాలను నేను ఎలా నివారించగలను? జనవరి 22, 2000, తేజరిల్లు! (ఆంగ్లం) 19-21 పేజీలలోని సమాచారం మీద ఆధారపడిన ప్రసంగం, ప్రేక్షకులతో చర్చ. ఇంటర్‌నెట్‌ను అపరిమితంగా ఉపయోగించడం వల్ల వచ్చే ప్రమాదాలను సూచించండి, ప్రమాదంలో పడడాన్ని ఎలా నివారించాలో వివరించండి. ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా వారు ఎలా ప్రయోజనం పొందారో వ్యాఖ్యానించమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 16 (143), ముగింపు ప్రార్థన.

జూలై 29తో ప్రారంభమయ్యే వారం

పాట 1 (13)

10 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై క్షేత్రసేవ రిపోర్టులను ఇవ్వమని ప్రచారకులకు గుర్తుచేయండి.

10 నిమి: ప్రశ్నా భాగం. సమాచారాన్ని స్థానికంగా అన్వయిస్తూ పెద్ద ఇచ్చే ప్రసంగం.

25 నిమి: “సామరస్యంతో ఐక్యమై ఉండండి.”b మూడవ పేరాను చర్చించేటప్పుడు, ఏప్రిల్‌ 22, 2000, తేజరిల్లు! (ఆంగ్లం) 9,10 పేజీలలో ఉన్న సమాచారం మీద వ్యాఖ్యానించండి. నాల్గవ పేరాతో, ఏప్రిల్‌ 1, 1995, కావలికోట, 16,17 పేజీల్లోని 4-6 పేరాల మీద వ్యాఖ్యానించండి.

పాట 26 (212), ముగింపు ప్రార్థన.

ఆగస్టు 5తో ప్రారంభమయ్యే వారం

పాట 3 (32)

10 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: “ఆ యా భాషలు మాట్లాడేవారిని సమకూర్చడం.”c ఏప్రిల్‌ 1, 2002, కావలికోట, 24వ పేజీ మీద ఆధారపడిన వ్యాఖ్యానాలను చేర్చండి. ఒకవేళ మీ సంఘానికి అనువర్తిస్తే, స్థానిక సేవా ప్రాంతంలో ఉన్న ఇతర భాషలు మాట్లాడేవారికి సహాయం చేయడానికి ఏ చర్య తీసుకోబడుతుందో క్లుప్తంగా వివరించండి, వేరే భాషలో సరళమైన అందింపును ప్రదర్శించండి.

15 నిమి: స్థానిక అనుభవాలు. సమావేశాలకు హాజరవుతుండగా, సహాయ పయినీరు సేవ చేస్తుండగా లేదా వేసవి కాలంలో ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భాగం వహిస్తుండగా ఎదురైన కొన్ని ప్రోత్సాహకరమైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను ఆహ్వానించండి.

పాట 28 (224), ముగింపు ప్రార్థన.

[అధస్సూచీలు]

a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి