ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు జూలై మరియు ఆగస్టు నెలల్లో: దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం), పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం), జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, అనే 32-పేజీల బ్రోషుర్లలో దేన్నైనా ఉపయోగించవచ్చు. సముచితమనుకున్న చోట్ల, సర్వమానవాళి కొరకైన గ్రంథం, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? (ఆంగ్లం), యుద్ధంలేని లోకం ఎప్పటికైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషుర్లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరు నెలలో: జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? (ఆంగ్లం) లేదా జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకాలను ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించవచ్చు. అక్టోబరు నెలలో: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. ఆసక్తి కనబరిస్తే బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ప్రత్యేకమైన కృషి చేస్తూ దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను ప్రతిపాదించండి.
◼ 2002 సెప్టెంబరు 16తో ప్రారంభమయ్యే వారం మొదలుకొని, మనం సంఘ పుస్తక అధ్యయనంలో యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు II పుస్తకాన్ని అధ్యయనం చేస్తాము.
◼ సెప్టెంబరు నెల మొదలుకుని ప్రాంతీయ పైవిచారణకర్తలు “మీ క్రైస్తవ గుర్తింపును కాపాడుకోండి!” అనే అంశం గల బహిరంగ ప్రసంగాన్ని ఇస్తారు.
◼ కొన్ని సంఘాలు వార్షిక ఐటమ్‌లను, పరిచర్య పాఠశాల పుస్తకాలను అధిక మొత్తంలో రిక్వెస్టు చేశాయి. జ్ఞాపకార్థ ఆహ్వానాలు తప్ప, లేఖనాలను పరిశీలించుట, క్యాలెండర్లు, జిల్లా సమావేశపు బ్యాడ్జి కార్డులు, పరిచర్య పాఠశాల పుస్తకాలు వంటి స్పెషల్ రిక్వెస్టు ఫారమ్‌లో ఇవ్వబడిన ఐటమ్‌లు సంఘంతో సహవసిస్తున్న వారికోసం మాత్రమే కానీ క్షేత్ర సేవలో అందివ్వడానికి కాదని దయచేసి గమనించండి. కాబట్టి, సంఘాల నుండి వచ్చిన ఆర్డర్లను ఆ సంఘంలో ఉన్న ప్రచారకుల సంఖ్యకు అనుగుణంగా మేము సరిచేశాము. ప్యాకింగ్ లిస్టులో ఉన్న వార్షిక ఐటమ్‌లలో ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో చూడవలసిందిగా కార్యదర్శులు కోరబడుతున్నారు. చూసిన తర్వాత కూడా అదనంగా ఆర్డర్ చేయవలసిన అవసరం ఉంటే దయచేసి వెంటనే మళ్ళీ ఆర్డర్ చేయండి, అందుకు గల కారణాన్ని వివరించే నోట్‌ను కూడా జతచేయండి.