కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/02 పేజీ 8
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2007
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2006
  • పత్రికల గురించి ఏమని చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2003
  • పత్రిక గురించి ఏమి చెప్పాలి?
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 2/02 పేజీ 8

పత్రికల గురించి ఏమని చెప్పాలి?

తేజరిల్లు! జన.-మార్చి

“ఇండియాలో మంచి కుటుంబ విలువలు ఉన్నాయని మనం గర్వించినప్పటికీ, ఈ సమస్య ఉందని మీరు అనుకుంటున్నారా? [తేజరిల్లు! ముఖచిత్రం చూపించి, జవాబు కోసం ఆగండి.] ఆసక్తికరమైన విషయమేమిటంటే, దినదినానికీ ఘోరమౌతున్న ఈ పరిస్థితి గురించి లేఖనాల్లో ముందే తెలియజేయబడింది. [2 తిమోతి 3:⁠1, 3 చదవండి.] ఈ సంచిక, ఆ సమస్యకు గురవుతున్నవారితో పంచుకోగల ఆచరణాత్మకమైన ఉపదేశాన్ని ఇస్తూ, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని సూచిస్తుంది.

కావలికోట ఫిబ్ర. 15

“మీ జీవితానికి ఉత్తమమైన నడిపింపునివ్వడానికీ, మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికీ ఏమి అవసరమో మీరెప్పుడైనా ఆలోచించారా? [జవాబు చెప్పనివ్వండి.] బంగారు సూత్రం వంటి, శ్రేష్ఠమైన సూత్రాల్లో కొన్నింటిని బైబిలులో కనుగొనవచ్చు. [మత్తయి 7:⁠12 చదవండి.] ఏ ఇతర దైవిక సూత్రాలు మనకు సూటిగా ప్రయోజనం చేకూర్చగలవు? ఈ పత్రికలో మీరు సమాధానాన్ని కనుగొంటారు.”

తేజరిల్లు! జన.-మార్చి

సెప్టెంబరు 11న ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుండి, దేవుడు అలాంటివి జరుగడానికి ఎందుకు అనుమతిస్తాడా అని ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? [జవాబు కోసం ఆగండి.] దేవుడు ఒక కారణాన్ని బట్టి దుష్టత్వాన్ని సహిస్తాడు, కాని త్వరలోనే, ఆయన ఇక సహించని సమయం వస్తుంది. [ప్రకటన 21:4, 5 చదవండి.] ఒక మార్పు రాబోతోంది, 16వ పేజీలోని ఈ ఆర్టికల్‌ దాన్ని వివరిస్తుంది.”

కావలికోట మార్చి 1

“నేడు జరుగుతున్న దానంతటి దృష్ట్యా మనలో చాలామందిమి, భవిష్యత్తు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంటాము. మనం భవిష్యత్తు వైపు నమ్మకంతో ఎందుకు చూడవచ్చుననేదానికి కారణాన్ని, ప్రసిద్ధి గాంచిన ఒక ప్రార్థనలో యేసు క్రీస్తు వెల్లడి చేశాడు. [మత్తయి 6:9, 10 చదవండి.] చాలాకాలం క్రితం చేయబడిన పొరపాట్లను మానవజాతి మళ్ళీ చేస్తోంది. కానీ ఆ రోజుల్లో, దేవుని సేవ చేసినవారికి సంతోషకరమైన భవిష్యత్తు లభించింది. మనం కూడా దాన్ని ఎలా పొందవచ్చో ఈ పత్రిక చూపిస్తుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి