కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/02 పేజీ 7
  • “కొంత సొమ్ము నిలువ చేయవలెను”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “కొంత సొమ్ము నిలువ చేయవలెను”
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం యెహోవాకు ఏదైనా ఇవ్వగలమా?
    మన రాజ్య పరిచర్య—2008
  • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • “కొంత తీసి పక్కకు పెట్టండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 2/02 పేజీ 7

“కొంత సొమ్ము నిలువ చేయవలెను”

తొలి క్రైస్తవ సంఘంలో, అవధానం ఇవ్వవలసిన వస్తుపరమైన అవసరాలు ఉండేవి. ఆ అవసరాలను తీర్చడానికి, ప్రతి వ్యక్తి తాను వర్ధిల్లిన కొలది చందా వేయడానికి, “తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను” అని ప్రేరేపించబడ్డాడు. (1 కొరిం. 16:1-3) వారి ఔదార్యం ఫలితంగా, అందరూ ‘దేవునికి కృతజ్ఞతాస్తుతులు’ చెల్లించడంలో ఆనందాన్ని పొందారు.​—2 కొరిం. 9:11, 12.

నేడు యెహోవా ప్రజల ప్రపంచవ్యాప్త పని విస్తరిస్తోంది, కాబట్టి ఆర్థిక మద్దతు యొక్క అవసరత అంతకంతకూ అధికమవుతోంది. ఆ అవసరాన్ని తీర్చేందుకు సహాయపడడానికి మనం కూడా క్రమంగా ‘కొంత సొమ్ము నిలువ చేయడం’ సముచితంగా ఉంటుంది. (2 కొరిం. 8:3, 4) సంస్థపై విధించబడిన ఆర్థిక ఆంక్షల గురించి విని గత సంవత్సరం అనేకులు అదనంగా కొంత ‘సొమ్ము నిలువచేయడానికి’ ఏర్పాట్లు చేసుకున్నారు. అలాంటి ప్రయత్నాలు ఎంతో ప్రశంసించబడుతున్నాయి, అవి యెహోవా యొక్క గొప్ప ఆశీర్వాదాలను తీసుకువస్తాయి.​—మలా. 3:10.

మనం క్షేత్రసేవకోసమో, వ్యక్తిగత ఉపయోగార్థమో పత్రికలు గానీ సాహిత్యాలు గానీ తీసుకున్న ప్రతిసారీ చందా వేసేందుకు కొంత సొమ్ము నిలువచేయడం మంచి అలవాటు. మనం ఉదారంగా ఇవ్వడం, సాహిత్యాలను ఉత్పత్తి చేయడానికి వాటిని రవాణా చేయడానికి అయ్యే ఖర్చులకు తోడ్పడడమే గాక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా దోహదపడుతుందని గుర్తుంచుకోండి. దీనిలో భాగం వహించడానికి పిల్లలను కూడా ప్రోత్సహించవచ్చు. తల్లిదండ్రులు పిల్లల చేతి ఖర్చుకోసం వారికిచ్చే దానిలో నుండి కొద్ది మొత్తమే అయినప్పటికీ వారు వ్యక్తిగతంగా కొంత సొమ్ము ‘నిలువచేయగలిగితే’ అది వారికి ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది.

అయితే, ఈ విషయాన్ని మరిచిపోవడం సులభమే. ఒక సంఘంలోని పెద్దలు, గత సంవత్సరాల్లో తాము సంస్థకు అందజేసిన మొత్తం కన్నా ఇప్పుడు అందజేస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉండగా, సంఘం యొక్క నిలువ మాత్రం క్రమంగా పెరుగుతుండడాన్ని గమనించారు. ఆ తర్వాత వారు, పనికి అయ్యే ఖర్చులకు సరిపడేలా, దేశంలోని ప్రతి ప్రచారకుడు నెలకు ఎంత డబ్బు పంపవలసి ఉంటుందని వారు తలంచారో లెక్కలు వేశారు. సహోదరులు ప్రతిస్పందించి, తమ సంఘం కనీసం ఆ మొత్తాన్ని ప్రపంచవ్యాప్త పని కోసం నెలసరి చందాగా పంపడానికి అంగీకరించి, చందా పెట్టెలలో డబ్బు గనుక తక్కువగా ఉంటే దాన్ని సంఘ నిధుల నుండి పూరించాలని నిశ్చయించుకున్నారు.

అమూల్యమైన సంపదను వ్యర్థం చేస్తూ, చాలా పత్రికలు నిరుపయోగంగా పడివున్నాయని మరో సంఘం గమనించింది. చందా ఇవ్వడానికి తమకున్న ఆధిక్యతను ప్రజలు గుర్తించేలా ఎలా చేయాలో ప్రచారకులకు ఉపదేశిస్తూ స్థానిక రేవు దగ్గర ప్రత్యేక పత్రికా కార్యకలాపాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు. ఫలితంగా సంఘం ఆ నెలలో 15,000 రూపాయలకు పైగా సంస్థకు పంపగలిగింది.

మీరూ, మీ కుటుంబమూ ‘కొంత సొమ్ము నిలువచేయడం’ గురించి ఆలోచించారా? వస్తుపరమైన మద్దతును అనేక విధాలుగా ఇవ్వవచ్చు. (నవంబరు 1, 2001, కావలికోట, 28-9 పేజీలు చూడండి.) దీన్ని మనం, నిజమైన సంతోషాన్ని తీసుకువచ్చే ఆధిక్యతగా దృష్టిస్తాము, అలా దృష్టించడం సముచితమే.​—అపొ. 20:35.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి